News


అమ్మకాల షాక్‌ -39 నెలల కనిష్టం

Thursday 19th March 2020
Markets_main1584591732.png-32574

1892 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌
522 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ
27,000 పాయింట్ల స్థాయి దిగువకు సెన్సెక్స్‌
8,000 పాయింట్ల మైలురాయినీ కోల్పోయిన నిఫ్టీ
2016 డిసెంబర్‌ స్థాయికి స్టాక్‌ మార్కెట్లు
మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 5 శాతం చొప్పున పతనం

ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా దెబ్బకు స్టాక్‌ మార్కెట్లు పిట్టల్లా వణుకుతున్నాయి. బుధవారం అమెరికా, యూరోప్‌ మార్కెట్లు 6 శాతం చొప్పున కుప్పకూలగా.. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు 8-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఈ ప్రభావంతో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు  దేశీయంగానూ అమ్మకాలకు క్యూకట్టారు. దీంతో భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభమైంది. వెరసి సెన్సెక్స్‌ 1892 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్‌ 26,977ను తాకింది. వెరసి 27,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. ఇక 522 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 7,950 వద్ద కదులుతోంది. తద్వారా 8,000 పాయింట్ల మైలురాయినీ కోల్పోయింది. ఇంతక్రితం 2016 డిసెంబర్‌లో మాత్రమే మార్కెట్లు ఈ స్థాయికి చేరినట్లు నిపుణులు తెలియజేశారు. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌, ఫెడరల్‌ రిజర్వ్‌, ఈసీబీ తదితరాలు ప్రకటించిన సహాయక చర్యలు మార్కెట్లలో అమ్మకాలను ఆపలేకపోతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకోనున్న భయాలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు.

అన్ని రంగాలూ
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ 8.5-4 శాతం మధ్య పడిపోయాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌ మాత్రమే(2.2 శాతం) బలపడ్డాయి. మిగిలిన బ్లూచిప్స్‌లో ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫిన్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, మారుతీ 15-9 శాతం మధ్య కుప్పకూలాయి. 

చిన్న షేర్లు డౌన్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో నిట్‌ టెక్‌, ముత్తూట్‌, ఈక్విటాస్‌, ఐజీఎల్‌, ఐబీ హౌసింగ్‌, అశోక్‌ లేలాండ్‌, బాటా, శ్రీరామ్‌ ట్రాన్స్‌ 15-13 శాతం మధ్య తిరోగమించాయి. కాగా.. మరోపక్క ఐడియా మాత్రమే అదికూడా 1.6 శాతం పుంజుకుంది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 7 శాతం చొప్పున నష్టపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన అర్ధగంటలో 1432 షేర్లు డీలాపడగా.. 163 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి.


 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 19th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ఆమోదం తెలిపిన తర్వాత రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌లో డెట్‌ బాధ్యతలను తీసుకోనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. యస్‌బ్యాంక్‌: యస్‌బ్యాంక్‌లో అతిపెద్ద ప్రమోటర్‌గా ఉన్న వ్యవస్థాపక చైర్మన్‌ అశోక్‌ కపూర్‌ భార్య మధు కపూర్‌ ప్రస్తుతం యస్‌బ్యాంక్‌లో  6.87 శాతం వాటాతోపాటు తాజాగా 25 లక్షల షేర్ల వాటాను కొనుగోలు చేయనున్నారు.  ఐటీసీ: ఐటీసీ

ఫిబ్రవరిలో 9% పెరిగిన విమాన యానం

Thursday 19th March 2020

న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఈ ఏడాది ఫిబ్రవరిలో 8.98 శాతం వృద్ధితో 1.236 కోట్లుగా నమోదైంది. డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం.. జనవరితో పోల్చితే అన్ని ప్రధాన విమానయాన సంస్థల ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) గణనీయంగా పెరిగింది. ఇక జనవరిలో ప్రయాణికుల రద్ధీ కేవలం 2.2 శాతంగానే ఉన్న విషయం తెలిసిందే కాగా.. కంపెనీలు ప్రకటించిన భారీ

Most from this category