News


అంత ర్యాలీ అనంతరం ఇంత పతనం.. మాములే!

Saturday 5th October 2019
Markets_main1570268290.png-28737

నిపుణుల అభిప్రాయం
గతనెల ప్రభుత్వ ప్రకటన అనంతరం వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించాలని బుల్స్‌ ఎంత ప్రయత్నించినా చివరకు మార్కెట్‌ మాత్రం బేర్స్‌ పట్టులోకే జారింది. ఆర్‌బీఐ వృద్ధి రేటు అంచనాలను తగ్గించడంతో మార్కెట్‌ ఈ వారాన్ని నష్టాలతో ముగించింది. అయితే గత నెల చివర్లో భారీగా పెరిగిన సూచీలు ఈమాత్రం పతనం కావడం కామనేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 11000- 11100 పాయింట్ల వరకు దిగజారడాన్ని సాధారణ పతనంగానే భావించాలంటున్నారు. ఈవారం వచ్చిన ఐఆర్‌సీటీసీ ఐపీఓకు మంచి స్పందన లభించడమనేది రాబోయే రోజుల్లో మంచి బుల్‌ మార్కెట్‌ ఉందనేందుకు సంకేతమని నిపుణుల అంచనా. అయితే రిటైలర్ల స్పందన కొంచెం తక్కువగా ఉండడమనేది మార్కెట్‌పై సాధారణ మదుపరికి ఇంకా పూర్తి నమ్మకం కలగలేదనేందుకు నిదర్శనంగా భావించాలంటున్నారు. రిటైలర్లు కూడా బుల్లిష్‌గా మారితేనే సూచీలు మరో టాప్‌కు పయనిస్తాయంటున్నారు. 


టెక్నికల్స్‌
ప్రస్తుతం నిఫ్టీ తన 50- 60 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిల్లో కదలాడుతోంది. ఈ శ్రేణిలో మంచి కన్సాలిడేషన్‌కు అవకాశాలున్నాయి. ప్రస్తుత పతనం మరికొంత కాలం కొనసాగి బుల్స్‌ సహనం మరింతగా పరీక్షించే ఛాన్సులున్నాయి. ఈ సమయంలో 200 రోజుల డీఎంఏకు పైన ట్రేడవుతున్న కంపెనీల షేర్లను తగ్గినప్పుడు కొను సూత్రం ప్రకారం కొనవచ్చని నిపుణుల సూచన. త్వరలో రాబోయే ఫెడ్‌ నిర్ణయాలు స్వల్పకాలానికి మార్కెట్ల గతిని నిర్ణయించవచ్చు. దేశీయంగా రిటైల్‌ విక్రయాలు పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లే ఆటో విక్రయాల్లో కాస్త మెరుగుదల కనిపించింది. దిగువ స్థాయిల్లో ఇన్వెస్టర్లు నాణ్యమైన స్టాకులను ఎంపిక చేసి కొనుగోలు చేయవచ్చని నిపుణుల సలహా.You may be interested

భారత్‌-22 ఈటీఎఫ్‌కు 12రెట్లు అధిక స్పందన

Saturday 5th October 2019

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ నిర్వహించిన భారత్‌ 22 ఈటీఎఫ్‌ నాలుగో విడుత ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి స్పందన లభిస్తుంది. రూ.2000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఆఫర్‌ తీసుకురాగా. 12రెట్ల అధికంగా రూ.23, 500 కోట్ల విలువైన బిడ్లు ధాఖలయ్యాయి. ఆఫర్‌ నుంచి అదనంగా మరో రూ.4368 కోట్ల బిడ్లను అట్టిపెట్టికోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీ తెలిపారు. తక్కువ వాల్యూవేషన్లు, పెట్టుబడుల ఉపసంహరణలపై

4రోజుల పసిడి లాభాలకు బ్రేక్‌..!

Saturday 5th October 2019

ఆర్థిక మాంద్య భయాలతో వరుసగా నాలుగు రోజుల ర్యాలీ చేస్తున్న పసిడి ధరకు శుక్రవారం బ్రేక్‌ పడింది. అమెరికాలో నిన్నరాత్రి ఔన్స్‌ పసిడి ధర అంతకు ముందు ముగింపు(1,514డాలర్లు)తో పోలిస్తే 1డాలరు స్వల్ప నష్టంతో 1513డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికాలో సెప్టెంబర్‌ కార్మిక ఉపాధి కల్పన గణాంకాలు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా నమోదయ్యాయి. ఈ సెప్టెంబర్‌లో  1.35లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. గణాంకాలు అక్టోబర్‌లో ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల

Most from this category