News


మరో రికార్డు ముగింపు

Thursday 19th December 2019
Markets_main1576750012.png-30314

12,250 పాయింట్లపైన ముగిసిన నిఫ్టీ

సెన్సెక్స్‌ 41,600 పాయింట్లపైకి 

స్టాక్‌ మార్కెట్లో గురువారం రికార్డుల హోరు కొనసాగింది. రెండు ప్రధాన స్టాక్‌ సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115 పాయింట్లు జంప్‌చేసి 41,673 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో చరిత్రలో ప్రధమంగా 12,250 పాయింట్ల స్థాయిపైన 12,260 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ‍ట్రంప్‌ను ఆ దేశపు దిగువ సభ అభిశంచిన నేపథ్యంలో ట్రేడింగ్‌ తొలిదశలో సూచీలు స్వల్ప ఒడుదుడుకులకు లోనైనప్పటికీ, మధ్యాహ్న సెషన్‌నుంచి క్రమేపీ ర్యాలీ జరిపాయి. సెన్సెక్స్‌ 41,456 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత 41,719 పాయింట్ల రికార్డుస్థాయికి, 12,191 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి నిఫ్టీ ర్యాలీ జరిపి చరిత్రాత్మక గరిష్టస్థాయి 12,168 పాయింట్ల వద్దకు పెరిగాయి. ఈ క్రమంలో మార్కెట్‌ కేపిటలైజేషన్‌లో మొదటి రెండు స్థానాల్లో వున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌ షేర్లు పోటీపడి ర్యాలీ జరపడం విశేషం. ఈ రెండు షేర్లూ 2-3 శాతం మధ్య ఎగిసాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గతంలో ఒక దఫా 1,600 స్థాయిపైకి పెరిగినప్పటికీ, ఆ స్థాయిపైన 1,609 వద్ద క్లోజయ్యింది. సైరస్‌మిస్త్రీకి అనుకూలంగా ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పునిచ్చిన నేపథ్యంలో ట్రేడింగ్‌ తొలిదశలో బలహీనంగా ప్రారంభమైన సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం, టాటా గ్రూప్‌ షేరు టీసీఎస్‌, క్రమేపీ పెరుగుతూ మూడు నెలల గరిష్టస్థాయి రూ. 2,235 స్థాయిని అందుకుంది.

పెరిగిన షేర్లలో రిలయన్స్‌, టీసీఎస్‌లతో పాటు భారతి ఎయిర్‌టెల్‌, యస్‌బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, టాటా మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, హీరో మోటార్స్‌ వున్నాయి. మరోవైపు వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ, గ్రాసిమ్‌లు 1.5-3 శాతం మధ్య తగ్గాయి. 

 



You may be interested

వచ్చే ఐదేళ్లలో ‘టెలికం’ నుంచి ఆదాయం: అగర్వాల్‌

Thursday 19th December 2019

స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికీ టెలికం కంపెనీల పట్ల ఆశావహంగా ఉందని, ఈ రంగం పుంజుకుంటుందని అంచనాలే ఇందుకు కారణమని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. టెలికం ఆపరేటర్లు, ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఈ రంగం నుంచి డబ్బులు పిండుకోనున్నాయని ఆయన విశ్లేషించారు. ‘‘టెలికం అన్నది గత 13 ఏళ్లుగా ఓ ఉపద్రవం వంటిది. ఈ రంగంలో సేవలు అందించే కంపెనీలు మూడు నుంచి 17కు

షేర్ల ఎంపికకు మొబియస్‌ సూత్రాలు!

Thursday 19th December 2019

మంచి రాబడినిచ్చే షేర్లను ఎంపిక చేసేందుకు వర్దమాన మార్కెట్స్‌ నిపుణుడు మార్క్‌మొబియస్‌ కొన్ని సూత్రాలను అవలంబిస్తుంటారు. ఇండియన్‌ ఎకనమిక్‌ కాంక్లేవ్‌లో ఆయన వీటిని వివరించారు. షేరు ఎంచుకునేందుకు మూడు పారామీటర్లు పరిశీలిస్తానని చెప్పారు.  ఒక షేరును కొనుగోలు చేయాలంటే దాని 1.రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌(ఆర్‌ఓసీఈ) 20 శాతం పైన ఉండాలి. 2. డెట్‌ టు ఈక్విటీ నిష్పత్తి 50 శాతం కన్నా తక్కువగా ఉండాలి. 3. డివిడెండ్‌ ఈల్డ్‌ 3-4 శాతం

Most from this category