News


మురిపించిన ముహూరత్‌ ట్రేడింగ్‌..!

Sunday 27th October 2019
Markets_main1572185912.png-29173

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం గంటసేపు పాటు జరిగిన ప్రత్యేక ముహూరత్ ట్రేడింగ్‌‌ మురిపించింది. పండుగ సందర్భంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు లాభాల పంట పండించాయి.  సెన్సెక్స్‌ 192.14 పాయింట్లు పెరిగి 39,250.20 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 11,628.00 వద్ద ముగిశాయి. యస్‌బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం నుంచి అరశాతం వరకు పెరగడంతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 103.60 పాయింట్లు లాభపడి 29,499.55 వద్ద స్థిరపడింది.ప్రతియేటా దీపావళి రోజున సాంప్రదాయబద్ధంగా జరిగే మూహూరత్‌ ట్రేడింగ్‌ నేడు 6.15ని.లకు ప్రారంభమైంది. పండుగ సందర్భంగా  అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 446 పాయింట్ల మేర లాభపడి 39,402.23స్థాయిని, నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 11,672.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అనంతరం లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీల లాభాలు కొంత హరించుకుపోయాయి.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 1శాతం లాభపడి రూ.1,445.00వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసి 0.30శాతం పెరిగి 1,435.50 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌ అంచనాల్ని మించి ఫలితాల్ని ప్రకటించడంతో టాటామోటర్స్‌ షేర్లు 18శాతం లాభంతో రూ.149.50 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ ఇండెక్స్‌ 11500-11450 జోన్‌లో బలమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసింది. అలాగే 11,650-11,700 స్థాయిలో కీలకమైన నిరోధస్థాయి కలిగి ఉంది. ఒకవేళ నిఫ్టీ 11700 స్థాయిని చేధించగలిగితే 12000 స్థాయిని అందుకుంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇన్ఫోసిస్‌, వేదాంత, ఎంఅండ్‌ఎం, యస్‌బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, టాటామోటర్స్‌ 2శాతం నుంచి 18శాతం వరకు లాభపడ్డాయి. జీ లిమిటెడ్‌, గ్రాసీం, టైటాన్‌, కోల్‌ ఇండియా, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం నష్టపోయాయి. 



You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Monday 28th October 2019

దిపావళి బలిప్రతిపాద సందర్భంగా నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సెలవు ప్రకటించారు. ఈక్విటీ మార్కెట్‌తో పాటు కమోడిటీ మార్కెట్‌ కూడా ఈ రోజు పనిచేయదు. ఎంసీఎక్స్‌లో మాత్రం ఈ రోజు సాయంత్రం ట్రేడింగ్‌ జరుగుతుంది. దీపావళి రోజున ముహూరత్‌ ట్రేడింగ్‌ అంటూ ప్రత్యేక ట్రేడింగ్‌ను స్టాక్‌ఎక్చేంజ్‌లు నిర్వహిస్తాయి. దీపావళి మరుసటి రోజు సెలవు ఇస్తారు. ఈ దఫా ముహూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు పాజిటివ్‌గా క్లోజయ్యాయి. దీంతో మార్కెట్‌ సంవత్‌ 2076ను పాజిటివ్‌గా

సంవత్‌ 2076 శుభారంభం

Sunday 27th October 2019

హిందూ సంప్రదాయ ఏడాది 'సంవత్‌ 2076 ను దేశీయ స్టాక్‌ సూచీలు శుభారంభం చేశాయి. దీపావళి రోజు గంటపాటు జరిగే ఈ ప్రత్యేక ముహురత్‌ ట్రేడింగ్‌ సందర్భంగా సెన్సెక్స్‌ 339 పాయింట్ల లాభంతో 39,397.37 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు పెరిగి 11,646.15 వద్ద మొదలయ్యాయి. పండుగ సందర్భంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో అన్ని రంగాలకు చెందిన షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. అటోరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా లభిస్తోంది.

Most from this category