News


మార్కెట్‌ నుంచి 20 శాతం రాబడులు పొందొచ్చు

Saturday 17th August 2019
Markets_main1566039640.png-27837

‘పన్నులు, జీఎస్‌టీ, వడ్డీ రేట్లను తగ్గించడం, నిర్మాణాత్మక సంస్కరణలను ప్రభుత్వం తీసుకు రావడం వంటివి జరిగి,  ప్రపంచఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారితే దేశియ మార్కెట్‌ 15-20 శాతం రిటర్న్‌లను ఇవ్వగలదు’ అని మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో డైరెక్టర్, సీఐఓ మిహిర్ వోరా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

మార్కెట్‌ను నడిపింది..కొన్ని స్టాకులే!
గత ఏడాది నుంచి గమనిస్తే నిప్టీ, ఎస్‌ అండ్‌ పీ సెన్సెక్స్‌ను నడిపించినవి కేవలం కొన్ని స్టాకులు మాత్రమే. అవి కూడా  లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ను నడిపించాయి. గత కొన్నేళ్లలో ఆదాయాల పరంగా ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న స్టాకులు చాలా తక్కువ. మరోవైపు, గత ఐదేళ్ల నుంచి వార్షిక ప్రాతిపదికన, నిఫ్టీ కంపెనీల లాభాల వృద్ధి 3 శాతం మాత్రంగానే నమోదవుతోంది. నిరర్థక ఆస్తులు పెరగడంతో బ్యాంకింగ్‌ సెక్టార్‌, కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి, వడ్డీ ఖర్చులు పెరగడంతో చాలా రంగాలలోని తయారి కంపెనీలు, నిఫ్టీ లాభాల వృద్ధి తగ్గడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం బలమైన ఆదాయ వృద్ధిని నమోదు చేసిన కొన్ని కంపెనీల స్టాకులలోకి మాత్రమే లిక్విడిటీ ఫ్లో అధికంగా జరుగుతోంది. ఫలితంగా ఈ స్టాకుల ధరలు పెరుగుతున్నాయి. కానీ గత ఏడాది నుంచి గమనిస్తే ఆర్థిక వ్యవస్థ పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పరాలేదనే విషయం స్పష్టం. దీర్ఘకాలానికి గాను, స్టాక్ ధరలు ఆదాయాలు, లాభాల వృద్ధిని అనుకరిస్తాయి. కాబట్టి, రాబోయే రెండేళ్లలో కార్పోరేట్‌ ఆదాయాలు, లాభౠలు వృద్ధి చెందడం చాలా అవసరం.

మల్టీ బ్యాగర్‌లు.. వెతకడం ముఖ్యం
 మార్కెట్లో మల్టీ-బ్యాగర్‌లను కనుగొనడం ఆసాధ్యమేమి కాదు. ఆదాయాల వృద్ధి అనుకూలంగా ఉండి మూలధనంపై మంచి రాబడులను ఇచ్చే స్టాకులను ఎన్నుకోవడమే మా పెట్టుబడి సిద్ధాంతం. సెక్టార్‌ పరంగా దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలను కూడా గమనించాలి. గత 18 నెలల్లో స్మాల్‌, మిడ్‌ క్యాప్‌లు విపరీతంగా నష్టపోవడంతో, కొన్ని స్టాకుల ఆదాయాలు నిరాశకు గురిచేసినప్పటికి కొన్ని షేర్ల విలువ పెరుగుతుండడాన్ని చూడవచ్చు. కాబట్టి, 2019లో ఎంచుకున్న చాలా వరకు స్టాకులు మల్టీ బ్యాగర్లగా మారే​ అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులలో సరియైన ధర వద్ద కొనుగోలు చేయడం చాలా ముఖ్యం.

ఆర్థిక వ్యవస్థ తిరిగి పంజుకుంటుంది..
ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా రికవరి అవుతుందని ఆశిస్తున్నాం. అదే సమయంలో వచ్చే ఏడాది కాల వ్యవధిలో నిఫ్టీలో ప్రస్తుత స్థాయిల నుంచి  గరిష్ట-సింగిల్-డిజిట్‌ రిటర్న్‌ను అంచనా వేస్తున్నాం. పన్నులు, జీఎస్‌టీ, వడ్డీ రేట్లను తగ్గించడం, ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకు రావడంతో పాటు ప్రపంచఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారితే దేశియ మార్కెట్‌ 15-20 శాతం రిటర్న్‌లను ఇవ్వగలదని నమ్ముతున్నాం.

  ప్రస్తుతం కార్పొరేట్‌లు మూలధన వ్యయాలపై ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేయడం లేదు. అధికంగా నిధుల ప్రవాహాన్ని రుణ విముక్తికి ఉపయోగిస్తున్నారు. దేశియంగా వడ్డీ రేట్లను తగ్గించడంతోపాటు ద్రవ్య పరిస్థితులను పరిష్కరించే విధానాలను గమనిస్తే త్వరలోనే  స్థానిక ఆర్థిక ఒత్తిళ్లు పరిష్కారం అవుతాయనిపిస్తోంది. అంతేకాకుండా ఇండియాకి ఉన్న ఆకర్షణ కారణంగా విదేశి ఇన్వెస్ట్‌మెంట్లు పెరుగుతాయి. కానీ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందనే నమ్మకం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుందనే విషయం చెప్పడం కష్టం. ఈ అనిశ్చితిని తప్పించుకోడానికి క్రమబద్ధమైన కాల వ్యవధిలో పెట్టుబడుల పెట్టడమే ఉత్తమమైన మార్గం. రిటైల్ ఇన్వెస్టర్లు సమీప కాలంలోని సమస్యలను విస్మరించి, దీర్ఘకాలిక పరిస్థితులపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. గత 20 ఏళ్లలోలో మార్కెట్లను ప్రభావితం చేసిన అనేక అంతర్జాతీయ, స్థానిక కారకాలను గమనించాం. అయినప్పటికి దీర్ఘకాలిక రాబడులలో ఈక్విటీలే ముందుండడం గమనార్హం.

మార్కెట్‌ సెంటిమెంట్‌ మారుతుంది...
అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల మార్కెట్ల కంటే దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి అధికంగా ఎఫ్‌పీఐల(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లు) ఔట్‌ ఫ్లో జరిగింది. జులై నెలలో ఏకంగా 300 కోట్ల డాలర్ల విలువైన సంపద దేశియ ఈక్విటీల నుంచి బయటకు వెళ్లింది. ఈ ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి సంస్కరణలను మొదలు పెడుతుందని ఎఫ్‌పీఐలు ఆశించి భంగపడ్డారు. దీనితోపాటు అంతర్జాతీయంగా ఉన్న ఆందోళనలు కూడా దేశియ మార్కెట్‌ సెంటిమెంట్‌ను భారీగా ప్రభావితం చేశాయి. వీటికి తోడు  బడ్జెట్‌లో పన్నులు, సర్‌చార్జీలను పెంచడం మార్కెట్‌ను నష్టపరిచాయి. వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యం ఒత్తిడిలో ఉండడంతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగించడంతో, పెట్టుబడులకు భారతదేశం ఒక మంచి గమ్యస్థానంగా నిలుస్తుందని మేము నమ్ముతున్నాము.

  వినియోగం, దేశ జనాభాపై ఎక్కువగా ఆధారపడిన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రస్తుత వాతావరణంలో మెరుగుపడే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారీ ఎఫ్‌పీఐల ఔట్‌ ఫ్లో తర్వాత సెంటిమెంట్‌ను తిరిగి పెంచేందుకు ప్రభుత్వం చర్యలను తీసుకోడానికి సుముఖంగా ఉండడం మార్కెట్‌కు అనుకూలించే అంశమే.

ఇంకో త్రైమాసికం..కష్టమే
ప్రస్తుత పరిస్థితులలో వాహన అమ్మకాల తిరోగమనం తాత్కాలికమైతే కాదు. గత కొన్ని నెలల నుంచి వాహన అమ్మకాల సంఖ్యలు మార్కెట్‌లను నిరాశ పరుస్తునే ఉన్నాయి. మొదట్లో గ్రామీణ, పట్టణ ఆర్థికవ్యవస్థ వలన ప్రారంభమైన ఆటోరంగ సంక్షోభం, ఆ తర్వాత వాహన డీలర్లకు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు అందకపోవడంతో ముదిరింది. ఆటో సెక్టార్‌ మందగమనం ఇంకో త్రైమాసికం కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పగలను. పండుగ సీజన్ (సెప్టెంబర్-అక్టోబర్) కారణంగా డిమాండ్ రికవరీ, వాహన విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. గతంలో చాలా ఆటో స్టాక్స్ మూలధనంపై అధిక రాబడిని అందించాయి. జనాభా దృష్ట్యా దేశియంగా ఆటో డిమాండ్ తిరిగి పుంజుకోగలదు. కనుక లాంగ్‌ రన్‌లో ఆటో సెక్టార్లొ మంచి అవకాశాలున్నాయి.You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కేసులో తొలి ఛార్జీసీటు నమోదు

Saturday 17th August 2019

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీపై శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తొలి ఛార్జీషీట్‌ను నమోదు చేసింది. ముంబైలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం చార్జిషీట్ దాఖలైనట్లు అధికారులు ధృవీకరించారు. నిధుల సంక్షోభానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్లతో పాటు ఇతరుల పాత్ర మేరకు ఉందనే అంశాన్ని ఛార్జ్‌షీట్‌ తెలియజేస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద బ్యాంకు ఖాతాలతో పాటు, ఢిల్లీ, ముంబై, చెన్నై, బ్రసెల్‌, బెల్జియం

రికార్డుస్థాయికి ఫారెక్స్‌ నిల్వలు

Saturday 17th August 2019

దేశీయ ఫారెక్స్‌ నిల్వలు జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు ఆగస్ట్‌ 9తో ముగిసిన వారానికి 1.620 బిలియన్ల డాలర్లకు పెరిగి 430.572 డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అంతకుముందు వారం(ఆగస్ట్‌ 02 తేది వారం) 697.2 డాలర్ల తగ్గుదలతో 428.952 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి.  అయితే గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 15.2 మిలియన్ డాలర్లు పెరిగి 398.739 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని

Most from this category