News


భారీ పతనానికి బ్రేక్‌....సెన్సెక్స్‌ 1630 పాయింట్లు జంప్‌

Friday 20th March 2020
Markets_main1584700496.png-32598

482 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ 
ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌ దూకుడు

ఎట్టకేలకు వరుస నష్టాలకు చెక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెంటిమెంటు మెరుగుపడింది. సెన్సెక్స్‌ 1628 పాయింట్లు దూసుకెళ్లి 29,916 వద్ద నిలవగా.. నిఫ్టీ 482 పాయింట్లు జంప్‌చేసి 8,745 వద్ద ముగిసింది. గురువారం అమెరికా మార్కెట్లు నష్టాల నుంచి బయటపడగా.. ఆసియాలోనూ పలు మార్కెట్లు 1-3 శాతం మధ్య ఎగశాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ప్రారంభమైన యూరోపియన్‌ మార్కెట్లు 6 శాతం స్థాయిలో పెరగడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపగా.. ఇండెక్స్‌ హెవీవెయిట్స్‌లో ట్రేడర్లు భారీ స్థాయిలో షార్ట్‌ కవరింగ్‌ చేపట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి దేశీ స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి నేలక్కొట్టిన బంతిలా బౌన్స్‌బ్యాక్‌ సాధించినట్లు తెలియజేశారు.

ఆటుపోట్లు..
నేటి ట్రేడింగ్‌లోనూ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 30,418 వద్ద గరిష్టాన్నీ, 27,933 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ 8,883- 8,178 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. వెరసి సెన్సెక్స్‌ 2,500 పాయింట్ల పరిధిలో హెచ్చుతగ్గులను చవిచూడగా.. నిఫ్టీ సైతం 600 పాయింట్ల స్థాయిలో లాభనష్టాలకు లోనైంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌ రంగాలు 9-8 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో ఫార్మా, ఆటో, మీడియా, రియల్టీ 4-2.3 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, గెయిల్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌, ఆర్‌ఐఎల్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, విప్రో 23-10 శాతం మధ్య దూసుకెళ్లాయి. ఇతర బ్లూచిప్స్‌లో కేవలం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.6-0.8 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వో ఇలా
డెరివేటివ్‌ కౌంటర్లలో జూబిలెంట్‌ ఫుడ్‌, ఎస్కార్ట్స్‌, మణప్పురం, బంధన్‌ బ్యాంక్‌, కంకార్‌, మైండ్‌ట్రీ, కేడిలా హెల్త్‌కేర్‌ 22-16 శాతం మధ్య పరుగుతీశాయి. అయితే మరోపక్క యస్‌ బ్యాంక్‌ 15 శాతం కుప్పకూలగా.. పిరమల్‌, అశోక్‌ లేలాండ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఇండిగో, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, నౌకరీ, కెనరా బ్యాంక్‌, భారత్‌ ఫోర్జ్‌ 15-2 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 4 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1444 లాభపడగా.. 1013 నష్టాలతో ముగిశాయి.

విక్రయాల బాటలోనే
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4623 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 4367 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 5085 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 3636 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4045 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. డీఐఐలు రూ. 3422 కోట్లను ఇన్వెస్ట్‌  చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 3810 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2615  కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.   You may be interested

50 శాతం ఇండియా కంపెనీలపై కరోనా ఎఫెక్ట్‌ : ఫిక్కీ సర్వే

Friday 20th March 2020

మహమ్మారి కరోనావైరస్‌  వ్యాప్తితో ప్రపచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావం  భారత్‌లో 50 శాతం కంపెనీలపై పడుతుందని ఫలితంగా నగదు ప్రవాహం క్షీణిస్తుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌ఐసీసీఐ) సర్వే చెబుతోంది. కరోనా వల్ల వివిధ రంగాల్లో డిమాండ్‌కు సప్లైకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడి భారత ఆర్థిక వృద్ధికి కొత్త సవాళ్లు ఎదురవుతాయని తెలిపింది. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక

బడా ఇన్వెస్టర్లకూ మార్కెట్ల షాక్‌

Friday 20th March 2020

జాబితాలో రాకేష్‌ జున్‌జున్‌వాలా ఆశిష్‌ ధావన్‌, డాలీ ఖన్నా.. రూ. 3550 కోట్లను పోగొట్టుకున్న రాకేష్‌ నష్టాల జాబితాలో షుగర్‌ షేర్లు సరిహద్దులను చెరిపేస్తూ కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయానికి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(WHO) కోవిడ్‌-19ను  ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సైతం కోవిడ్‌-19 ధాటికి ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని చవిచూడనుందంటూ బాహాటంగానే

Most from this category