News


బేర్‌ పట్టులో మార్కెట్‌- బ్లూచిప్స్‌ విలవిల

Thursday 12th March 2020
Markets_main1584003630.png-32434

గరిష్టం నుంచి 20 శాతం పతనమైన నిఫ్టీ
నిఫ్టీ బ్లూచిప్స్‌లో 43 షేర్లు బేర్‌ ట్రెండ్‌లో

కరోనా సునామీకి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ ఏకధాటిగా బేర్‌ మంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో చరిత్రాత్మక గరిష్టాలను తాకిన అమెరికా స్టాక్‌ ఇండెక్స్‌ ఎస్‌అండ్‌పీ దగ్గర్నుంచి దేశీయ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ వరకూ అమ్మకాలతో నీరసిస్తూ వస్తున్నాయి. తాజాగా వైరస్‌ భయాలతో యూరోపియన్‌ దేశాల ప్రయాణికులను అమెరికా రాకుండా నిషేధం విధించడంతో మరోసారి మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలాయి. మధ్యాహ్నం 2 ప్రాంతంలో సెన్సెక్స్‌ 2215 పాయింట్లు పడిపోయి 33,482ను తాకగా.. నిఫ్టీ 661 పాయింట్లు కోల్పోయి 9,797కు చేరింది. వెరసి 10,000 పాయింట్ల మార్క్‌ను సైతం కోల్పోయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 32,990కు దిగజారింది. తద్వారా 33,000 పాయింట్ల మైలురాయి దిగువకు చేరింది. ఇది 24 నెలల కనిష్టంకాగా.. ఈ ఏడాది జనవరి 20న సెన్సెక్స్‌ 42,273 వద్ద గరిష్టానికి చేరింది. కాగా.. నిఫ్టీ 9650 దిగువకు చేరడం ద్వారా 2017 సెప్టెంబర్‌ కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది జనవరి 20న నమోదైన 12,430 నుంచి నిఫ్టీ 21 శాతం తిరోగమించింది.

5 శాతం డౌన్‌
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ప్రారంభమైన యూరోపియన్‌ మార్కెట్లు సైతం అమెరికన్‌ మార్కెట్ల బాటలో 5 పతన‍‍మయ్యాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, యూరోపియన్‌ దేశాలు సైతం కరోనా ధాటికి వణుకుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా.. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 52 వారాల గరిష్టం 12,430 నుంచి 22 శాతంపైగా క్షీణించింది. వెరసి బేర్‌ దశలోకి ప్రవేశించినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా 20 శాతానికి మించి మార్కెట్లు నీరసిస్తే.. బేర్‌ ట్రెండ్‌లోకి మళ్లినట్లుగా భావిస్తారు. కాగా.. ఈ ఫిబ్రవరిలో నమోదైన గరిష్టాల నుంచి అమెరికన్‌ ఇండెక్సులు డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 20 శాతం చొప్పున వెనకడుగు వేశాయి.

బ్లూచిప్స్‌ సైతం
నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించే బ్లూచిప్స్‌లోనూ అమ్మకాలు వెల్లువెత్తడంతో అత్యధిక శాతం కౌంటర్లు బేర్‌మంటున్నాయి. నిఫ్టీ 50 కౌంటర్లలో 43 షేర్లు బేర్‌ దశలోకి ప్రవేశించినట్లు టెక్నికల్‌ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. 52 వారాల గరిష్టాలతో పోలిస్తే దిగ్గజాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ 20 శాతంపైగా క్షీణించగా.., ఈ బాటలో బ్రిటానియా, టైటన్‌, యాక్సిస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, పవర్‌గ్రిడ్‌ తదితరాలు సైతం ఇదే బాటలో పయనిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

అమ్మకాల ఎఫెక్ట్‌
దేశీయంగా గత 11 సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఏకంగా రూ. 29,000 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇటీవల మార్కెట్లలోకి ప్రవహించిన ఈటీఎఫ్‌ నిధులు వెనక్కి మళ్లుతుండటం ‍ప్రభావాన్ని చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. అయితే 2008 అక్టోబర్‌లో నమోదైన మార్కెట్ల మహాపతనం తదుపరి ఏడాది కాలంలో ఈక్విటీలు 63 శాతం రిటర్నులను అందించిన విషయాన్ని ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. 

బౌన్స్‌బ్యాక్‌ ఇలా
ఇంతక్రితం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2015లో నమోదైన 9119 పాయింట్ల నుంచి 2016 ఫిబ్రవరికల్లా 6825 స్థాయికి పడిపోయింది. ఇదే విధంగా 2010లోనూ నిఫ్టీ 6338 నుంచి 4531 పాయింట్లకు క్షీణించింది. తదుపరి రెండు సందర్భాలలోనూ మార్కెట్లు రికవరీ అయినట్లు నిపుణులు చెబుతున్నారు. అంటే బేర్‌ దశలో భాగంగా సాధారణంగా 25-28 శాతం వరకూ మార్కెట్లు పతనంకావచ్చని అంచనా వేస్తున్నారు. తదుపరి రికవరీకి వీలున్నట్లు భావిస్తున్నారు. You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 9.50శాతం క్రాష్‌..!

Thursday 12th March 2020

మార్కెట్‌ మహాపతనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో ఏకంగా 9.50శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు మార్కెట్‌ భారీ గ్యాప్‌ డౌన్‌లో భాగంగా ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(26,487.80)తో పోలిస్తే 5శాతం(1311.9 పాయింట్లు) నష్టంతో 25,175.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్లలో అమ్మకాల కొనసాగుతుండటంతో ఇండెక్స్‌ ఒక దశలో దాదాపు 9.50శాతం(2474 పాయింట్లు) నష్టాన్ని చవిచూసింది. మధ్యాహ్నం గం.లకు

రిలయన్స్‌ టార్గెట్‌ ధర పెంచిన యూబీఎస్‌

Thursday 12th March 2020

ముంబై: అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్‌ ధరను రూ.1840గా నిర్ణయించింది. కేటాయించిన టార్గెట్‌ ధర వచ్చే ఏడాదిలో ప్రస్తుత షేరు ధర నుండి 60 శాతం అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. ఈ ఏడాది స్టాక్ ధరలో బాగా క్షీణించడం ఇంధన వ్యాపారానికి ఎటువంటి విలువను కేటాయించలేదని సూచిస్తుంది. స్టాక్ ధరల ప్రస్తుత క్షీణత ఇన్వెస్లర్లకు ఇంధన వ్యాపారాన్ని ఉచితంగా కొనుగోలు

Most from this category