News


మార్కెట్‌ ఒడిదుడుకులు పెరుగుతాయ్‌!

Tuesday 18th February 2020
Markets_main1582016476.png-31898

గతవారం స్వల్ప హెచ్చుతగ్గులకు లోనై, స్టాక్‌ సూచీలు పాజిటివ్‌గా ముగిసినప్పటికీ, కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రతరమైతే సమీప భవిష్యత్తులో మార్కెట్లు క్షీణిస్తాయని, మార్కెట్‌ విశ్లేషకులు జిమిత్‌ మోడీ వారాంతపు తన కాలమ్‌లో వ్యాఖ్యానించారు.  పార్టమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌,  ఆర్‌బీఐ ద్రవ్యవిధాన సమీక్ష తర్వాత మార్కెట్లో వచ్చిన పెనుతుఫాను తర్వాత ఇప్పుడు కొంత ప్రశాంతత నెలకొంది.  దీంతో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ధైర్యంగా కొనుగోళ్లు చేపట్టారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.59 శాతానికి పెరిగి, ఐఐపీ తగ్గినప్పటికీ ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంలో ప్రభుత్వం ప్రముఖ పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. మరోపక్క సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) ద్వారా ఫండ్స్‌లోకి ప్రవహించిన నిధులు జనవరిలో రూ. 8000 కోట్లు మించాయి. ఈ మార్క్‌ను దాటడం వరుసగా ఇది 14వ నెల.  ప్రస్తుతం ఆర్థిక వ్యస్థ కన్సాలిడేషన్‌ దశలో ఉందని, త్వరలో మళ్లీ చిగురిస్తుందన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒత్తిడి ప్రభావం మార్కెట్‌పై సమీప భవిష్యత్తులో మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనవుతుందని పేర్కొన్నారు. చైనాకు రెండో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న ఇండియా... చైనాలో వైరస్‌ విజృంభణతో అక్కడి నుంచి దిగుమతయ్యే విడిభాగాలు, ముడిపదార్థాలపైన ఆధారపడే రంగాలైన ఎలక్ట్రికల్‌ మెషినరీ, ఐరన్‌, స్టీల్‌, ఆటోమొబైల్స్‌పై నెగిటివ్‌ ప్రభావం పడుతుందన్నారు. అయితే భారత్‌ టెక్స్‌టైల్స్‌ రంగం, స్పెషాలిటీ రసాయినాల రంగాలు లబ్దిపొందుతాయని, ఎందుకంటే చైనా నుంచి సరఫరాలు తగ్గనున్నందున, అంతర్జాతీయ కంపెనీలు...ఈ ఉత్పత్తుల కొనుగోలుకు ఇండియావైపు చూస్తాయని వివరించారు. 

 ప్రధాన అంశాలు
ఫైనాన్షియల్స్‌, వినియోగ రంగాలు నిరుత్సాహకరమైన పనితీరును ప్రదర్శించిన కారణంగా డిసెంబర్‌ క్వార్టర్లో కార్పొరేట్‌ ఫలితాలు మిశ్రమంగా వున్నాయి. ఆటో మొబైల్స్‌ విభాగంలో భారీ కమర్షియల్‌ వాహనాల అమ్మకాలు పడిపోవడం, ప్యాసింజర్‌ వాహనాలు విక్రయాలు జరిగింది. సిమెంట్, స్పెషాలిటీ రసాయనాల కంపెనీల లాభాలు మార్కెట్లను కొంత ఆశ్చర్యానికి గురిచేసాయి. మరోపక్క  ఏజీఆర్‌ బకాయిల్ని చెల్లించకపోవడంపై సుప్రీకోర్టు స్పందిస్తూ తీవ్రంగా మందలిస్తూ వెంటనే చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే ఇందుకోసం నిధులు సమీకరించిన భారతీ ఎయిర్‌టెల్‌ భరోసాతో వుండగా, వొడాఫోన్‌పై దెబ్బపడే పరిస్థితి వుంది. 

 You may be interested

ఎర్నింగ్‌ డౌన్‌గ్రేడ్‌ అవకాశాలు ఎక్కువ!

Tuesday 18th February 2020

2020-21పై మోతీలాల్‌ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ నిఫ్టీ కంపెనీలకు సంబంధించి హైఫ్రీక్వెన్సీ డేటా ఇండికేటర్లు భారీ రికవరీ సూచించడం లేదని, అందువల్ల కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎర్నింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ రిసెర్చ్‌ హెడ్‌ గౌతమ్‌ దుగ్గడ్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత క్యు3లో ఫలితాలు ఫర్వాలేదనిపించాయన్నారు. ఎర్నింగ్స్‌ నాణ్యతలో భారీ మెరుగుదల లేదని, స్వల్ప మెరుగుదల మాత్రమే ఉందని చెప్పారు. ఎర్నింగ్స్‌గ్రోత్‌ పుంజుకోవడానికి ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ, కన్జూమర్‌ విభాగాలు ముఖ్యపాత్ర పోషించగా,

పదేళ్లుగా వేల్యూ బయింగ్‌కు చోటెక్కడ?!

Tuesday 18th February 2020

గత దశాబ్ద కాలంలో ఈ ఐడియా విఫలం మూడేళ్లుగా ఫార్మా స్టాక్స్‌లో ర్యాలీ నిల్‌ ఇటీవలే డీమార్ట్‌ షేర్లను కొనుగోలు చేశాం - సార్తీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌ గడిచన దశాబ్ద కాలంలో దేశీ స్టాక్‌ మార్కెట్లలో వేల్యూ బయింగ్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ విఫలమైందని సార్తీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సల్‌ పేర్కొంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ తదితర రంగాలతోపాటు.. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ తదితర పలు అంశాలపై అభిప్రాయాలను

Most from this category