News


షేర్ల ఎంపికకు మొబియస్‌ సూత్రాలు!

Thursday 19th December 2019
Markets_main1576750380.png-30313

మంచి రాబడినిచ్చే షేర్లను ఎంపిక చేసేందుకు వర్దమాన మార్కెట్స్‌ నిపుణుడు మార్క్‌మొబియస్‌ కొన్ని సూత్రాలను అవలంబిస్తుంటారు. ఇండియన్‌ ఎకనమిక్‌ కాంక్లేవ్‌లో ఆయన వీటిని వివరించారు. షేరు ఎంచుకునేందుకు మూడు పారామీటర్లు పరిశీలిస్తానని చెప్పారు. 


ఒక షేరును కొనుగోలు చేయాలంటే దాని 1.రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌(ఆర్‌ఓసీఈ) 20 శాతం పైన ఉండాలి. 2. డెట్‌ టు ఈక్విటీ నిష్పత్తి 50 శాతం కన్నా తక్కువగా ఉండాలి. 3. డివిడెండ్‌ ఈల్డ్‌ 3-4 శాతం ఉండాలి. అని ఆయన చెప్పారు. అదేవిధంగా కంపెనీ ఒకరోజు టర్నోవర్‌ కనీసం 20 లక్షల రూపాయల పైన ఉండాలన్నారు. 


మొబియస్‌ చెప్పిన పై పారామీటర్లను అప్లై చేసి చూస్తే దేశీయ మార్కెట్లో మూడు షేర్లు వీటికి సరిపోయేలా ఉన్నాయి. కోల్‌ఇండియా, సొనాటా సాఫ్ట్‌వేర్‌, ఎన్‌ఎండీసీ షేర్లు మొబియస్‌ సూత్రాలకు అనుగుణంగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. పలు బ్రోకరేజ్‌లు సైతం ఈ మూడింటిపై బుల్లిష్‌గా ఉన్నారు. రెండేళ్లుగా సొనాటా మినహా మిగిలిన రెండు షేర్లు దాదాపు 25 శాతం నష్టంలో ఉన్నాయి.  కోల్‌ఇండియా రెండేళ్లుగా వరుసగా 109, 45.50 శాతం ఆర్‌ఓసీఈని, 5 శాతం డివిడెండ్‌ ఈల్డ్‌ను నమోదు చేస్తోంది. సొనాటాసాఫ్ట్‌వేర్‌ వరుసగా 48, 40 శాతం ఆర్‌ఓసీఈని, ఎన్‌ఎండీసీ రెండేళ్లు 25 శాతంపైచిలుకు ఆర్‌ఓసీఈని నమోదు చేశాయి. కోల్‌ఇండియాకు మోతీలాల్‌ఓస్వాల్‌ కొనొచ్చు రేటింగ్‌తో రూ. 278 టార్గెట్‌ను, సొనాటాకు సెంట్రమ్‌ బ్రోకింగ్‌ కొనొచ్చు రేటింగ్‌తో రూ. 400 టార్గెట్‌ను, ఎన్‌ఎండీసీకి మోతీలాల్‌ఓస్వాల్‌ కొనొచ్చు రేటింగ్‌తో రూ. 126 టార్గెట్‌ను ఇచ్చాయి. 



You may be interested

మరో రికార్డు ముగింపు

Thursday 19th December 2019

12,250 పాయింట్లపైన ముగిసిన నిఫ్టీ సెన్సెక్స్‌ 41,600 పాయింట్లపైకి  స్టాక్‌ మార్కెట్లో గురువారం రికార్డుల హోరు కొనసాగింది. రెండు ప్రధాన స్టాక్‌ సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115 పాయింట్లు జంప్‌చేసి 41,673 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో చరిత్రలో ప్రధమంగా 12,250 పాయింట్ల స్థాయిపైన 12,260 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ‍ట్రంప్‌ను ఆ దేశపు దిగువ సభ అభిశంచిన

అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ తీర్పుపై ఆందోళన అనవసరం!

Thursday 19th December 2019

హేమాంగ్‌ జానీ  టాటా కంపెనీల వ్యాపారంలో రికవరీ చూస్తుంటే చంద్రశేఖర్‌ నేతృత్వం మంచి ఫలితాలు ఇస్తుందని తెలుస్తోందని షేర్‌ఖాన్‌ అనలిస్టు హేమాంగ్‌ జానీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై ఆందోళన అనవసరమని అభిప్రాయపడ్డారు. తీర్పు వచ్చాక టాటాగ్రూప్‌ షేర్లలో కొంత ఆందోళన కనిపించిందన్నారు. కానీ యథాతధ స్థితి కొనసాగే అవకాశాలున్నాయన్నది అర్ధం చేసుకోవాలని చెప్పారు. టాటాలు తప్పకుండా ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాయని అంచనా వేశారు. అయితే సుప్రీంకోర్టులో

Most from this category