News


భారత్‌కు 5 శాతం వృద్ధి మంచిదే: మొబియస్‌

Tuesday 17th December 2019
Markets_main1576522903.png-30255

భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థకు 5 శాతం వృద్ధి రేటు మంచిదేనని వర్ధమాన మార్కెట్ల నిపుణుడు మార్క్‌ మొబియస్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌ ఆకర్షణీయ మార్కెట్‌ అని అభివర్ణించారు. 1980ల చివర్లో భారత మార్కెట్లో పెట్టుబడులను ప్రారంభించిన ఆయన, ఈ స్థాయిలో భారత్‌ ఆర్థిక వృద్ధి సాధిస్తుందని తాను అంచనా వేయలేదని తెలిపారు. భారత ఆర్థిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

 

‘‘ఇప్పుడు, భారత్‌, చైనా మార్కెట్లలో రాబడుల కోసం భారీ పెట్టుబడులు అన్వేషిస్తున్నాయి. ఆర్థిక రంగం మందగమనంలోనూ మార్కెట్లు ర్యాలీ చేయడానికి కారణం ఇదే’’ అని మార్క్‌ మొబియస్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు అయిన మార్క్‌ మొబియస్‌ పేర్కొన్నారు. దేశ జీడీపీ వృద్ధి సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి తగ్గిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈక్విటీ మార్కెట్లు నూతన గరిష్టాలకు సమీపంలో ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల కూడా బలంగానే ఉన్నాయి. ‘‘నేను భారత్‌లో పెట్టుబడులను ఆరంభించిన సమయంలో అస్తవ్యస్తంగా ఉంది. ఈ స్థాయి ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని అనుకోలేదు. ఎనిమిదేళ్ల క్రితం వృద్ధికి అద్భుతమైన అవకాశాలను చూశాను’’ అని మొబియస్‌ తన అనుభవాలను వివరించారు. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో ప్రతికూల వడ్డీ రేట్లు ఉన్నాయని, భారత్‌లోనూ వడ్డీ రేట్లు తగ్గుతూ వస్తున్నాయని చెప్పారు. ఇలా రేట్లు తగ్గడం ఈక్విటీ మార్కెట్లను ఆకర్షణీయంగా మార్చేస్తుందన్నారు. 

 

సేవల రంగంలో విలువను తాను గుర్తించినట్టు మొబియస్‌ చెప్పారు. ‘‘సేవల రంగానికి భవిష్యత్తు ఉంది. ఈ రంగానికి పెరుగుతున్న వెయిటేజీని జీడీపీ గణాంకాల్లోకి పూర్తిగా తీసుకోలేదు. భారత సేవల రంగంలో విలువను నేను గుర్తించాను’’ అని మొబియస్‌ చెప్పారు. వినియోగ రంగంపైనా తాను బుల్లిష్‌గా ఉన్నట్టు తెలిపారు. ‘‘వినియోగ స్టాక్స్‌ను కొనుగోలు చేస్తాం. మార్కెట్‌ వృద్ధి అవకాశాల కోసం చూస్తోంది’’ అని పేర్కొన్నారు. మంచి కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లేని స్టాక్స్‌ను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయనని స్పష్టం చేశారు. ప్రధాన సూచీల్లో ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ లేకపోతే మార్కెట్లు మరింత మెరుగైన పనితీరు చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అధిక ఈల్డ్స్‌ ఉన్న కంపెనీలు పెట్టుబడులకు సురక్షితమని అభిప్రాయపడ్డారు.You may be interested

బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి జియో టవర్ల కంపెనీ

Tuesday 17th December 2019

డీల్‌ విలువ రూ.25,215 కోట్లు  దేశీ ఇన్‌ఫ్రాలో భారీ విదేశీ పెట్టుబడి ఇదే! న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొబైల్‌ కంపెనీ రిలయన్స్‌ జియోకు చెందిన టవర్ల వ్యాపారాన్ని కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పార్ట్‌నర్స్‌ ఎల్‌పీ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ.25,212 కోట్లు. ఒక భారత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలో విదేశీ కంపెనీ పెట్టిన అత్యధిక పెట్టుబడి ఇదే కావటం గమనార్హం. ఈ మేరకు బ్రూక్‌ఫీల్డ్‌తో తమ రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌

ఐదు స్టాక్‌ సిఫారసులు

Tuesday 17th December 2019

ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి, క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ 3 నుంచి 5 వారాల కోసం కొన్ని స్టాక్స్‌ను సూచించారు.    హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫారసులు ఎన్‌ఎండీసీ టార్గెట్‌ రూ.127. స్టాప్‌లాస్‌ రూ.103. రోజువారీ, వారం చార్ట్‌లు స్థిరమైన ర్యాలీకి సంకేతం ఇస్తున్నాయి. కీలకమైన నిరోధం రూ.115-117ను అధిగమించేందుకు సమీపంలో ఉంది. గత కొన్ని నెలల కాలంలో ఇది కీలక అవరోధంగా

Most from this category