News


పతనమైన షేర్లపైనే మా దృష్టి...మార్క్‌ మొబియస్‌

Saturday 23rd November 2019
Markets_main1574504557.png-29815

‘లిక్విడిటీ గురించి ఆలోచిస్తే చైనా, ఇండియా, టర్కి, సౌత్‌ ఆఫ్రికా వంటి మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించొచ్చు. కానీ దీర్ఘకాల దృక్పథం ఉండి, ప్రైవేట్‌ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆఫ్రికాలోని దేశాలు మంచిది’ అని ఇన్వెస్ట్‌మెంట్‌ గురువు, మొబియస్‌, క్యాపిటల్‌ పార్టనర్స్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ మొబియస్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...

మా కేటాయింపులు..
చైనాను ఇండియా అందుకుంటోంది. ఈ రెండు అతి పెద్ద దేశాలు. కేటాయింపుల పరంగా ఇండియా, చైనాను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నాం. మరోవైపు బ్రెజిల్‌లో కూడా మా కేటాయింపులు పెరిగాయి. కొద్ది మొత్తంలో రష్యాలో కూడా మా కేటాయింపులున్నాయి. రష్యా మంచి ప్రదర్శన చేస్తుండడంతో ఈ దేశంలో కేటాయింపులను పెంచాలనుకుంటున్నాం. వీటితోపాటు మేము టర్కిలో ఉన్నాం. కొద్ది మొత్తంలో ఇండోనేషియాలో కూడా. ఇవే మా కేటాయింపులకు ముఖ్యమైన దేశాలుగా ఉన్నాయి. 
   ఇం‍డియాలో బాగా పడిపోయిన స్టాకులను కొనుగోలు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌) స్టాకులపై మా దృష్ఠి వుంది. మరోవైపు మౌలికరంగం. ఈ రెండు సెక్టార్‌లను మేము పరిశీలిస్తున్నాం. 

ఇండియా వృద్ధి బాగానే ఉంది...
ఇంత పెద్ద దేశానికి ఐదు శాతం చాలా మంచి వృద్ధి రేటు. వాస్తవానికి దేశ జీడీపీ వృద్ధి గరిష్ఠ స్థాయిల నుంచి తగ్గినప్పటికి, బేస్‌ ఎఫెక్ట్‌ పెరగడం వలన ముందుకెళ్లే కొద్ది 10 శాతం వృద్ధి రేటు సాధించడం చాలా కష్టంగా మారుతుంది. ఇది చైనాకు కూడా వర్తిస్తుంది. చైనా జీడీపీ వృద్ధి రేటు 2010 లో పది శాతంగా నమోదైంది. కానీ డాలర్‌ పరంగా చూస్తే, అది ప్రస్తుతం నమోదైన ఆరు శాతం కంటే చాలా తక్కువ. అదేవిధంగా మోడీ అనేక సంస్కరణలను వ్యవస్థలోకి తీసుకొచ్చేటప్పుడు, మొదట ప్రజలు ఒక షాక్‌కి గురయ్యారు. మనం కొంత సమయం వేచి ఉండాలి లేదా ఇదేమైన కొత్త ట్యాక్సా? నా కేమీ అర్ధం కావడం లేదు వంటి సందిగ్ధ దశలో ప్రజలున్నారు. కానీ వచ్చే ఏడాది కాలంలో ఈ సంస్కరణలకు ప్రజలు అలవాటు పడితే వృద్ధి పుంజుకోవడాన్ని చూడొచ్చు. 

కార్పోరేట్‌ గవర్నెన్స్‌..
   కంపెనీలు మంచి కార్పొరేట్‌ గవర్నెన్స్‌తో కొనసాగితే, వాటి షేర్‌ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. కం‍పెనీలు కొత్త విషయాలకు అలవాటు పడగలవు, కొత్త ఇంటర్నెట్‌ సమాజానికి తగ్గట్టుగా మారగలవు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంటెర్నట్‌, స్మార్ట్‌ఫోన్లు, కమ్యూనికేషన్‌ విస్తరించడంతో కంపెనీలు తమ అధ్వాన్న కార్పోరేట్‌ గవర్నెన్స్‌ను దాచి పెట్టాలనుకున్నా, దాచి పెట్టలేవు. ఏ  కంపెనీ కార్పోరేట్‌ గవర్నెన్స్‌ అయిన బాగాలేకపోతే, ఆ కంపెనీలు ఎక్స్‌పోజ్‌ అవుతున్నాయి. వాటి షేరు విలువ తీవ్రంగా ప్రభావితమవుతుంది. మం‍చి కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఉండి, నిజాయితిగా కొనసాగే కంపెనీలు మంచి పనితీరును ప్రదర్శిస్తాయి. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అలానే జరుగుతుంది. 

ఆశ్చర్యపరిచిన, నిరుత్సాహపరిచిన అంశాలు..
ఇండియాలో గత 20 ఏళ్ల నుం‍చి ఇన్వెస్ట్‌ చేస్తున్నా. నన్ను బాగా ఆశ్చర్యపరిచింది మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందడం. కేవలం పరిమాణంలో మాత్రమే కాదు, డిజిటలైజేషన్‌ పరంగా కూడా మార్కెట్‌ బాగా వృద్ధి చెందింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ పార్కింగ్‌ లాట్‌లా కనిపించడం నాకిప్పటికి గుర్తుంది. ప్రజలు తమ బౌతిక షేర్‌ సర్టిఫికేట్‌లు పట్టుకొని ఎక్సేంజ్‌ చుట్టు తిరిగేవారు. అది చాలా అద్భుతంగా ఉండేది. ఆ తర్వాత నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ వచ్చింది. మొత్తం మారిపోయాయి. డిజిటలైజేషన్‌ పెరిగింది. ఇది ఇండియా మార్కెట్‌లోనే కాదు ప్రపంచమంతటా ఇలానే జరిగింది. 
    అదే విధంగా నన్ను బాగా నిరుత్సాహానికి గురి చేసింది కంపెనీల కార్పొరేట్‌ గవర్నెన్స్‌, మేనేజ్‌మెంట్‌. కంపెనీలు మనకొకటి చెప్పి, మరొకటి చేసేవి. కొన్ని విషయాలను దాచి పెట్టేవి. ఇలాంటి పారదర్శకత్వం లేని చర్యలు బాగా నిరుత్సాహాపరిచాయి. 

మోసపోయిన సంఘటన..
ఇండియాతో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కార్పొరేట్‌ మోసాలను ఎదుర్కొన్నాం. బ్రెజిల్‌లో జరిగిన సంఘటన గురించి చెప్పాలి. మెస్బలా బ్రెజిలియన్‌ డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌. ఆ సమయంలో రియో డి జనైరోలో విజయవంతంగా నడుస్తున్న ఈ స్టోర్‌లో ఇన్వెస్ట్‌ చేశాం. ప్రతి ఏడాది ఫైనాన్స్‌ మేనేజర్‌తో మాట్లాడేవాళ్లం.  కంపెనీ పనితీరు చూడ్డానికి బాగుండేది, కంపెనీ లాభాలు పెరిగాయి, అన్ని బాగుండేవి. కానీ అకస్మాత్తుగా కంపెనీ దివాలాకు వచ్చేసింది. ఆస్తులన్ని ఆవిరైపోయాయి. వాళ్లు కేవలం కంపెనీ ఫైనాన్స్‌ మేనేజర్‌ని మాత్రమే కాదు, చైర్మన్‌ని, కంపెనీని నియంత్రించే వ్యక్తులందరిని తమకనుకూలంగా మార్చుకున్నారు. ఏం జరిగిందని తెలుసుకోడానికి చాలా ప్రయత్నించాం. కానీ అది అసాధ్యంగా మారింది. ఏడాదిన్నర తర్వాత ఒకరోజు మేము సీబీఎం(బ్రెజిల్‌ స్టాక్‌ ఎక్సేం‍జి)కి వెళ్లాం. మెస్బలాకి సంబం‍ధించి మీ డైరక్టర్‌ ఒకరితో మాట్లాడాలని అనుకుంటున్నామని చైర్మన్‌ని అడిగాం. ఆయన సరే అన్నాడు. ఒక డైరక్టర్‌ మమ్మల్ని కలవడానికి వచ్చాడు. ఆయనెవరోకాదు మెస్బలాలో పనిచేసిన ఫైనాన్స్‌ డైరక్టర్‌. ఇలాంటి సంఘటనలు ఇండియాలో కూడా జరిగాయి. అందుకే ఇన్వెస్టర్లు మొదట కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌ను తెలుసుకోవాలి. వారి ముఖ్యమైన ప్రేరణేంటో కనుక్కోవాలి. వారి స్నేహితులు, వారి ఇతరేత్ర వ్యాపకాలు అన్నింటిని కనుక్కోవాలి. 

వాల్యూ అంటే ఏంటి?
వాల్యూ ఇన్వెస్టింగ్‌లో కంపెనీ మేనేజ్‌మెంట్‌ ఎలాంటిదో గుర్తించాలి. కంపెనీ యాజమాన్యం, కంపెనీని నడిపించే వ్యక్తుల విలువేంటో గుర్తించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ వ్యక్తులు అధిక​ నాణ్యతను పాటిస్తారా? నైతిక విలువలను కలిగివున్నారని గమనించాలి. విలువను గుర్తించడం‍లో ఇదొక భాగం. అర్థమయ్యేట్టు చెప్పాలంటే కేవలం కంపెనీ నెంబర్లను మాత్రమే పట్టించుకోకూడదు. కంపెనీ తెరవెనుక ఏం చేస్తోందో కూడా తెలియాలి. అంటే సులభంగా పరిశీలించగలిగే అంశాలను గుర్తించాలి. క్యాష్‌ డివెడెండ్స్‌ పరిశీలించడం సులభం, కంపెనీ లాభాలను పరిశీలించడం అంత సులువు కాదు. అన్నింటి కంటే క్లిష్టమైనది..కంపెనీ ఖాతా నెంబర్లు. కంపెనీ అకౌంట్స్‌ను ఆడిటర్లు ఆడిట్‌ చేస్తారు. ఈ ఆడిటర్స్‌ను కంపెనీ మేనేజ్‌మెంట్‌, బోర్డు డైరక్టర్లు నియమిస్తారు. వారు ఎటువైపు పనిచేస్తారో సులువుగా అర్ధమవుతుంది. వారు అవినీతికి పాల్పడతారని కాదు, కానీ కంపెనీకి సంబంధించిన ప్రకటనలను స్వల్పంగా మార్చి ఇవ్వగలరు. నువ్వా ప్రకటనలను లోతుగా పరిశీలించాలి.  అందువలనే తరుచూ ఒక కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు, కేవలం కంపెనీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడటమే కాకుండా ప్రత్యర్థి కంపెనీలతో మాట్లాడమని, మార్కెట్‌లో కంపెనీ గురించి తెలుసుకోమని విశ్లేషకులకు సలహాయిస్తాం. ఫలితంగా కంపెనీలో ఏం జరుగుతుందో నీకొక దృక్పథం వస్తుంది. 

ఆఫ్రికాలో ఇన్వెస్ట్‌మెంట్‌..
వచ్చే పదేళ్లలో ట్రెండ్‌ అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల చూట్టు తిరుగుతుంది. ఒక సారి చైనా, ఇండియాను గమనిస్తే, ముఖ్యంగా ఇండియాలో వృద్ధి పరంగా అతి పెద్ద బ్రేక్‌ ఔట్‌ వచ్చిందని నమ్ముతున్నాం. ఆర్థిక ‍వ్యవస్థ పరిమాణం పరంగా చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలు వేగంగా వృద్ధి చెందగలిగే సామర్ధ్యం కలిగివున్నాయి. ఇండియా ఇప్పుడు ఆ స్థాయిలోనే ఉంది. చైనా ఇప్పటికే  బాగా వృద్ధి చెందింది. ఈ దేశాలు క్లిష్టమైన పరిస్థితులను దాటి మంచి స్థాయిలో ఉన్నాయి. కానీ ఈ దేశాలు అధికంగా చిన్న కంపెనీలనే కలిగివున్నాయి. 
  ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక అవకాశాలున్నాయి. ఆఫ్రికా. ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఆఫ్రికా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తోంది. ఇది ఉత్పాదకతకు అధికంగా ఉపయోగపడుతుంది. చైనా, ఇండియా, టర్కీ, దక్షిణాఫ్రికా, మొదలైన మార్కెట్లను, లిక్విడిటీని గురించి పరిశీలించడం మంచిది. అయితే దీర్ఘకాలిక దృక్పథంతో, ప్రైవేట్‌ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలంటే ఆఫ్రికాలోని దేశాలను పరిశీలించడం ఉత్తమం.You may be interested

బెంచ్‌టైమ్‌లో కోత విధించిన కాగ్నిజంట్‌

Saturday 23rd November 2019

ఉద్యోగుల బెంచ్‌ టైమ్‌ గరిష్ఠ పరిమితిని దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజంట్‌ తగ్గించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో రాబోయే నెలల్లో పలువురి ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పెరిగాయి. నాన్‌ బిల్లబుల్‌ ప్రాజెక్ట్‌లోని ఉద్యోగులకు ఇప్పటివరకు 60 రోజులున్న బెంచ్‌టైమ్‌ గరిష్ఠకాలపరిమితిని తాజాగా 32 రోజులకు కంపెనీ తగ్గించింది.  35 రోజుల తర్వాత ఈ ఉద్యోగులకు ఎలాంటి ప్రాజెక్టు అసైన్‌ కాకపోతే కంపెనీ నుంచి వైదొలగాల్సిఉంటుంది.

లాభాల కోసం కాంట్రా బెట్స్‌ బెటర్‌!

Saturday 23rd November 2019

జిమిత్‌మోదీ సూచన స్వల్పకాలానికి మార్కెట్లు పలు వార్తలకు అతిగా స్పందించే అవకాశం ఉందని, ఈ సమయంలో కాంట్రాబెట్స్‌ తీసుకోవడం మంచిదని సామ్‌కో సెక్యూరిటీస్‌ అనలిస్టు జిమిత్‌ మోదీ సూచిస్తున్నారు. నిఫ్టీ ఈ వారం 12100 పాయింట్లను దాటేందుకు గట్టి ప్రయత్నం చేసిందని, కానీ విఫలమైందని చెప్పారు. నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీ ప్రస్తుత మార్కెట్‌ మూడ్‌ను ప్రతిబింబిస్తోందన్నారు. స్మాల్‌క్యాప్‌ సూచీ ప్రస్తుతం కరెక్టివ్‌ దశలో ఉంది. అయితే చార్టులను పరిశీలిస్తే భారీ అప్‌ట్రెండ్‌

Most from this category