News


యస్‌ బ్యాంక్‌పై మారటోరియం ఎత్తివేత

Thursday 19th March 2020
Markets_main1584587790.png-32567

- బ్యాంకింగ్ సేవలన్నీ పునరుద్ధరణ
- మూడు రోజుల పాటు వేళల పొడిగింపు

ముంబై:  ప్రైవేట్ రంగ యస్ ‍బ్యాంక్ 13 రోజుల తర్వాత మారటోరియంపరమైన ఆంక్షల నుంచి బైటపడింది. బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు బ్యాంకింగ్ వేళలను కూడా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం మార్చి 19 నుంచి 21 దాకా ఉదయం 8.30 గం.లకే శాఖలు తెరుచుకుంటాయి. సీనియర్ సిటిజన్ ఖాతాదారుల కోసం మార్చి 19 నుంచి 27 దాకా సాయంత్రం 4.30 గం.ల నుంచి 5.30 గం.ల దాకా సేవలు అందిస్తాయి. 
    అయితే, సేవలు పునరుద్ధరించిన కాస్సేపటికే మొబైల్ యాప్ క్రాష్ కావడం, వెబ్‌సైట్‌ పనిచేయకపోవడంతో ఖాతాదారులు అసహనానికి లోనయ్యారు. సోషల్‌ మీడియాలో బ్యా్ంక్‌ను ట్యాగ్‌ చేస్తూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సమస్యలిక పడలేమని, తాము ఽడిపాజిట్లను మరో బ్యాంకుకు మార్చేసుకుంటామని సూచిస్తూ పలువురు పోస్ట్ చేశారు. దీంతో ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి యస్ బ్యాంక్ క్షమాపణలు కోరింది. సమస్యను సత్వరం పరిష్కరిస్తున్నామని పేర్కొంది. మార్చి 5 నుంచి నెలరోజులపాటు యస్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారటోరియం విధించడం, ఈ వ్యవధిలో రూ. 50,000కు దాటకుండా విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు విధించడం తెలిసిందే. ఎస్‌బీఐ సహా ఇతరత్రా బ్యాంకులు.. యస్‌ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడంతో మారటోరియం తొలగింది. మరోవైపు, యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌పై మనీ లాండరింగ్ కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు మరోసారి విచారణకు గైర్హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి భయాలను ఇందుకు కారణంగా వారు చూపారు. You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ నేడు!

Thursday 19th March 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 369 పాయింట్లు డౌన్‌ ప్రపంచ మార్కెట్లలో కరోనా విలయం అమెరికా, యూరప్‌, ఆసియా నేలచూపు నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి పతనం(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 369 పాయింట్లు పడిపోయి 8,073 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 8,442 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి

చిన్న పొదుపులపై వడ్డీ తగ్గింపు!

Thursday 19th March 2020

న్యూఢిల్లీ: చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. వచ్చే త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌) సంబంధించి ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరిస్తున్న సరళతర వడ్డీరేట్ల విధానం ఈ నిర్ణయానికి నేపథ్యం కానుంది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీరేట్లను ప్రస్తుత త్రైమాసికంలో (జనవరి-మార్చి) కేంద్రం తగ్గించలేదు.

Most from this category