News


ఏ కొద్ది కరెక్షన్‌ వచ్చినా.. తదుపరి ర్యాలీయే..

Monday 20th January 2020
Markets_main1579459890.png-31026

నిఫ్టీ గత ఐదు సెషన్లుగా స్థిరీకరణలో ఉందని, 12,278-12,389 స్థాయిల మధ్యలో ట్రేడ్‌ అయిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చందన్‌ తపారియా పేర్కొన్నారు. నూతన లైఫ్‌టైమ్‌ గరిష్ట స్థాయి 12,389ని నమోదు చేసిందని, ఏ కొద్ది కరెక్షన్‌ వచ్చినా కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చని, ఇప్పటికీ ఇండెక్స్‌ భారీ ట్రెండ్‌ సానుకూలంగానే ఉందన్నారు. 

 

‘‘వీక్లీ స్కేల్‌పై చిన్న బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. రోజువారీ చార్ట్‌లో మాత్రం నిర్ణయలేమిని సూచిస్తోంది. అంటే తదుపరి దశ ర్యాలీని నడిపించేందుకు తదుపరి చర్య అవసరమని సూచిస్తోంది. వీక్లీ స్కేల్‌పై పెరుగుతున్న ట్రెండ్‌లైన్‌ సమీపంలో బలమైన నిరోధం వద్ద నిఫ్టీ ప్రస్తుతం ఉంది. నిరోధ స్థాయికి సమీపంలో ఇండెక్స్‌ ఉన్నప్పటికీ ధరల పరంగా ఎటువంటి బలహీనత కనిపించడం లేదు. కనుక నిఫ్టీ 12,280 స్థాయిపైనే కొనసాగితే తదుపరి 12,450-12,500 దిశగా ర్యాలీ చేస్తుంది. బలమైన మద్దతు స్థాయి 12,150 అవుతుంది. ఇండియా వీఐఎక్స్‌ ఫ్లాట్‌గానే ఉంది. 14.08 నుంచి 14.13 శాతానికి గత వారంలో పెరిగింది. వీఐఎక్స్‌ స్థాయిలు బుల్స్‌కు సౌకర్యాన్నిస్తున్నాయి. అయితే సమీపంలో 2020 బడ్జెట్‌ ఉండడంతో అస్థిరతలు కొనసాగొచ్చు. ఆప్షన్ల డేటాను గమనిస్తే ట్రేడింగ్‌ శ్రేణి 12,000-12,500 స్థాయిల మధ్య ఉండొచ్చని సూచిస్తోంది.

 

స్టాక్స్‌వారీగా చూస్తే.. చాలా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లలో బ్రేకవుట్‌ కదలికలు కనిపించాయి. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎంసీఎక్స్‌, ఎస్కార్ట్స్‌, డాబర్‌, సీమెన్స్‌, సీఈఎస్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నిట్‌ టెక్నాలజీస్‌, మారుతి, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐఆర్‌సీటీసీ తదితర స్టాక్స్‌లో సానుకూల కదలిక కనిపించింది.  ఇండెక్స్‌ ధోరణి సానుకూలంగా ఉండడంతో ప్రతీ చిన్న కరెక్షన్‌ తదుపరి దశ ర్యాలీకి చోదకంగా నిలుస్తుంది. బ్యాంకు నిఫ్టీలో బలహీనత చిన్న విరామం తీసుకుంది. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో ధోరణి నిఫ్టీని నూతన శ్రేణికి తీసుకెళుతుంది’’ అని చందన్‌ తపారియా వివరించారు. You may be interested

బడ్జెట్‌ అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం

Monday 20th January 2020

ఈ వారంలో కీలక కంపెనీల ఫలితాలు పెరుగుతున్న బడ్జెట్‌ అంచనాలు  టెల్కోల ‘ఏజీఆర్‌’ చెల్లింపులకు గడువు  ఈ వారమే  ఆల్‌టైమ్‌ హైల వద్ద సెన్సెక్స్‌, నిఫ్టీలు  ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఎనలిస్ట్‌ల సూచన కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు కీలకం కానున్నాయి. వీటితో పాటు కేంద్ర బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు స్టాక్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, డాలర్‌తో రూపాయి మారకం

ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు 41శాతం డౌన్‌

Monday 20th January 2020

2019లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు నికరంగా చేసిన పెట్టుబడులు రూ.75,000 కోట్లు. కానీ, అంతకుముందు 2018లో చేసిన పెట్టుబడులతో పోలిస్తే 41 శాతం తగ్గడం గమనార్హం. ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గడం, మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు తిరిగి ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాయని, మంచి పనితీరు చూపిస్తాయని నిపుణులు అంచనాతో ఉన్నారు.    ‘‘మార్కెట్లలో ఉన్న అస్థిరతలు మరికొంత

Most from this category