News


ఫలితాల ఎఫెక్ట్‌: మహింద్రా ఫైనాన్స్‌ 10 శాతం డౌన్‌

Wednesday 24th July 2019
Markets_main1563964983.png-27290

జూన్‌ త్రైమాసిక ఫలితాలలో మహింద్రా అండ్‌ మహింద్రా నికర లాభం 66 శాతం పడిపోవడంతో మహింద్రా ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో 10.52 శాతం నష్టపోయి రూ. 304.45 వద్ద ముగిసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.322 కోట్ల నికర లాభం నమోదవ్వగా ఈ త్రైమాసికంలో అది రూ.108 కోట్లకు పడిపోయింది. మహింద్రా ఫైనాన్స్‌ షేరు విలువ గత సెషన్‌లో రూ.340.15 వద్ద ముగియగా బుధవారం ట్రేడింగ్‌లో రూ.34 నష్టపోయి రూ. 306.15 వద్ద ప్రారంభమయ్యింది. ఒకానొక దశలో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి రూ.289.15 వరకు పడిపోయి తిరిగి కోలుకుంది.   



You may be interested

11,200 వరకు పతనం..!

Thursday 25th July 2019

నిఫ్టీ బుధవారం 11,300కు దిగువన క్లోజయింది. నిజానికి 11,300 అన్నది కీలకమైన మద్దతు స్థాయి. 200 రోజుల ఎక్స్‌పొనెన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌ అక్కడే ఉంది. దీనిని కోల్పోవడంతో రానున్న సెషన్లలో నిఫ్టీ ఇంకా నష్టపోవచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.    ‘‘స్వల్ప కాలిక ఆసిల్లేటర్స్‌ అమ్మకాల ఒరవడిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇండెక్స్‌ తన మద్దతు స్థాయి అయిన 11,130-11,260 శ్రేణిలో ట్రేడ్‌ కావచ్చు’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ అరుణ్‌ కుమార్‌

బడా బ్యాంకుల్లో మరింత పతనం!

Wednesday 24th July 2019

గౌతమ్‌ షా అంచనా దేశీయ ఈక్విటీ మార్కెట్‌ కోలుకోవాలన్నా, పతనం కావాలన్నా బ్యాంకు నిఫ్టీయే కారణమవుతుందని, బ్యాంకునిఫ్టీ కదలికలే ప్రధాన మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతం షా అభిప్రాయపడ్డారు. బ్యాంకు నిఫ్టీ సరిగా లేకుంటే ప్రధాన సూచీలు ఒత్తిడిలోకి జారుకుంటాయని, గత రెండువారాలుగా ఈ ధోరణిని మనం గమనించవచ్చని చెప్పారు. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో బడా బ్యాంకుల షేర్లు మరింత పతనమయ్యే ఛాన్సులు ఎక్కువని అంచన వేశారు.

Most from this category