News


ఫారిన్‌ ప్రమోటర్‌ ఎగ్జిట్‌: మహానగర్‌ గ్యాస్‌ 10 శాతం ర్యాలీ

Tuesday 20th August 2019
Markets_main1566288639.png-27895

విదేశీ ప్రమోటర్‌ కంపెనీలో పూర్తిగా వాటాను విక్రయించి నిష్క్రమించడంతో మహానగర్‌ గ్యాస్‌ షేర్లు మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 11శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో కంపెఈ షేర్లు రూ.834.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. విదేశీ ప్రమోటర్‌ బ్రిటీష్‌ గ్యాస్‌ ఏషియా హోల్టింగ్‌ పీటీ లిమిటెడ్‌.. మహానగర్‌ గ్యాస్‌లో తనకు ఉన్న మొత్తం 10శాతం వాటాకు సమానమైన 99లక్షల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.780 చొప్పున బ్లాక్‌ డీల్‌ ద్వారా రూ.724 కోట్లకు విక్రయించింది. ఈ ఏప్రిల్‌లో బీజీ ఏషియా 32.5శాతం వాటాను 24శాతం వాటాను తగ్గించికుంది. ప్రస్తుత ఈ వాటా విక్రయంతో మొత్తం వాటాను ఉపసంహరించుకున్నట్లైంది. ఇది కంపెనీ సానుకూలాంశమని, ధీర్ఘకాలికానికి షేర్లకు కొనుగోలు చేయవచ్చని విశ్లేషకులు సిఫార్సు చేస్తున్నారు. ఫలితం‍గా ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగి ఒకదశలో 11.55శాతం లాభపడి రూ.878.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు(రూ.787.35)తో పోలిస్తే 7శాతం లాభంతో రూ.843.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.754.70 రూ.1057.20లుగా నమోదయ్యాయి. మార్చి 29న రూ.1055 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన నాటికి నుంచి నేటి వరకు షేరు మొత్తంగా 25శాతం వరకు క్షీణించింది.



You may be interested

క్యాపిటల్‌ ఎయిమ్‌ నుంచి టాప్‌ 3 సిఫార్సులు

Tuesday 20th August 2019

స్వల్పకాలానికి మూడు షేర్లపై క్యాపిటల్‌ ఎయిమ్‌ సంస్థ సిఫార్సులు ఇలా ఉన్నాయి... 1. టాటామోటర్స్‌: కాంట్రా బెట్‌గా కొనుగోలు చేయవచ్చు. నెల రోజుల్లో దాదాపు 30 శాతం పతనమైంది. క్యు1 పేలవ ఫలితాలు, డిమాండ్‌లో క్షీణత, అమ్మకాల్లో మందగమనం, రేటింగ్‌ డౌన్‌గ్రేడ్స్‌ తదితరాలు స్టాకుపై ప్రభావం చూపాయి. దీంతో స్వల్పకాలంలో భారీ పతనం చూసింది. ప్రస్తుతం స్టాకు ఓవర్‌సోల్డ్‌గా ఉంది. పలు ఇండికేటర్లు ఇంకా సెల్‌ సిగ్నల్సే ఇస్తున్నాయి. అందువల్ల మరికొంత

మారుతి జోరు..

Tuesday 20th August 2019

ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు అనుగుణంగా ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉండడంతో ఆటో సెక్టార్‌లో కంపెనీ అయిన మారుతి సుజుకి ఇండియా మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్‌ అమ్మకాల ఒత్తిడితో క్షీణిస్తుండగా మారుతి సుజుకీ మాత్రం లాభల్లో ఉన్న నిఫ్టీ50 షేర్లలో ముందుంది. ఈ షేరు మధ్యాహ్నాం 1.00 సమయానికి 2.55 శాతం లాభపడి రూ. 6,135.00 వద్ద ట్రేడవుతోంది. ఈ సెషన్‌లో రూ. 5,982.55 వద్ద ప్రారంభమైన ఈ

Most from this category