News


గణాంకాలే దిక్సూచి..!

Monday 11th February 2019
Markets_main1549867218.png-24125

  •  మంగళవారం రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలు
  • గురువారం టోకు ద్రవ్యోల్బణం డేటా వెల్లడి..
  • ఈవారంలోనే యూఎస్‌ రిటైల్ సేల్స్‌, చైనా ద్రవ్యోల్బణం, జపాన్‌ ఐఐపీ డేటా
  • సన్‌ ఫార్మా, హిందాల్కో, ఇండియా సిమెంట్స్‌, ఐషర్‌ మోటార్స్‌, బాటా ఇండియా ఫలితాలు

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, డిసెంబర్‌ త్రైమాసికానికి పలు కార్పొరేట్‌ రంగ సంస్థలు ప్రకటించనున్న ఫలితాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యకాలంలో 2,000 కంపెనీలు క్యూ3 ఫలితాలను ప్రకటించనుండగా.. ఈవారంలోనే పారిశ్రామికోత్పత్తి, టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ ప్రధాన అంశాలపైనే మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు.

స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి
అంతర్జాతీయ అంశాల పరంగా.. డిసెంబర్‌కు సంబంధించిన అమెరికా రిటైల్ అమ్మకాల డేటా ఫిబ్రవరి 14న (గురువారం) వెలువడనుంది. చైనా జనవరి ద్రవ్యోల్బణ డేటా, జపాన్‌ డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈనెల 15న (శుక్రవారం) వెల్లడికానున్నాయి. ఇక దేశీ ప్రధాన అంశాల విషయానికి వస్తే.. పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ 13న (బుధవారం) ముగియనుంది. డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సీపీఐ డేటా ఈనెల 12న (మంగళవారం) వెలువడనుండగా.. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 14న వెలువడనుంది.

భౌగోళిక రాజకీయ అంశాల ప్రభావం..
అమెరికా–ఉత్తర కొరియా చర్చలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి. ఈసారి వియత్నాం రాజధాని హనోయ్‌లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌తో సమావేశం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈనెల 27, 28 తేదీల్లో భేటీ ఉంటుందని, ఇరు దేశాల దౌత్యాధికారుల మధ్య ఇందుకు సంబంధించిన ముందస్తు చర్చలు సానుకూలంగా సాగాయని ట్రంప్‌ చెబుతున్నప్పటికీ.. అటువైపు ఉత్తర కొరియా నుంచి ఎటువంటి అణు నిరాయుధీకరణ పరమైన ప్రకటనలు వెలువడపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళనను కొనసాగించే అంశాగా మారింది. యూరోజోన్‌ వృద్ధి మందగిస్తుందంటూ వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మరింత్ర అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

కంపెనీల ఫలితాలు..
సోమవారం అమరరాజా బ్యాటరీస్, ఆంధ్రా బ్యాంక్, ఆస్ట్రల్ పోలీ, ఐషర్ మోటార్స్, హిందూస్తాన్ ఏరోనాటిక్స్, ఇండియా సిమెంట్స్, స్పైస్‌జెట్ క్యూ3 ఫలితాలను వెల్లడించనుండగా.. మంగళవారం బాటా ఇండియా, కోల్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్, హెచ్‌ఈజీ, హిందాల్కో, కరూర్ వైశ్యా బ్యాంక్‌, మన్‌పసంద్ బెవరేజెస్, ఎన్‌సీసీ, సన్ ఫార్మా గణాంకాలను వెల్లడించనున్నాయి. బుధవారం అదానీ గ్యాస్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, లెమన్ ట్రీ హోటల్స్, ప్రభాత్ డైరీ, రిలయన్స్ కాపిటల్, రుచి సోయా ఫలితాలను వెల్లడించనుండగా.. గురువారం గ్లెన్‌మార్క్ ఫార్మా, జీవీకే పవర్, హెచ్‌డీఐఎల్, ఇన్ఫీబీమ్, ఎంటీఎన్ఎల్, నెస్లే ఇండియా, ఓఎన్‌జీసీ, టాటా టెలీసర్వీసెస్, యునైటెడ్ బ్రూవరీస్‌, వోల్టాస్‌ క్యూ3 గణాంకాలు వెల్లడికానున్నాయి.
రూ.5,300 కోట్ల ఎఫ్‌ఐఐల పెట్టుబడి...
ఫిబ్రవరి 1–8 మధ్యకాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,273 కోట్ల పెట్టుబడులను దేశీయ స్టాక్‌ మార్కెట్లో పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. మరోవైపు డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.2,795 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు స్టాక్‌ మార్కెట్లో కూడా నికర అమ్మకందారులుగా నిలిచిన ఎఫ్‌పీఐలు ఈసారి కొనుగోలుకు మొగ్గు చూపడానికి గల ప్రధాన కారణం అధిక ఆర్ధిక వృద్ధి అంచనాలేనని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ హిమంషు శ్రీవాత్సవ వివరించారు. ఇక మీదట ఎఫ్‌పీఐల ఏవిధంగా కొనసాగుతుందనే విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచిన ఈయన.. ‘సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున వీరు వేచిచూసే వైఖరిని అవలంభించేందుకు అవకాశం ఉంది. ముడిచమురు, డాలరుతో రూపాయి కదలికలు సైతం ఎఫ్‌పీఐల ట్రెండ్‌ను ప్రభావితం చేయనున్నాయి.’  అని వివరించారు.You may be interested

ఎస్‌బీఐ, ఓబీసీ మొండిబకాయిల విక్రయం

Monday 11th February 2019

- రూ. 5,740 కోట్లు రాబట్టుకునేందుకు కసరత్తు న్యూఢిల్లీ: సుమారు రూ. 5,740 కోట్ల బాకీలను రాబట్టుకునే క్రమంలో వాటికి సంబంధించిన మొండిపద్దులను విక్రయించడంపై ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) దృష్టి సారించాయి. సుమారు రూ. 4,975 కోట్ల రికవరీకోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు (ఏఆర్‌సీ), ఆర్థిక సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానిస్తూ ఎస్‌బీఐ ప్రకటన విడుదల చేసింది. వీటిలో

లార్జ్‌ క్యాప్‌ పథకాల్లో మేటి..!

Monday 11th February 2019

సూచీలు ముందుకే పయనిస్తున్నాయి. కానీ, అన్ని లార్జ్‌క్యాప్‌ పథకాలు సూచీలతో పోలిస్తే రాబడుల పరంగా షార్ప్‌గా ఉన్నాయంటే... అవునని చెప్పలేం. అన్ని పథకాలు సూచీలకు దీటుగా, సూచీలను మించి రాబడులను అన్ని సమయాల్లోనూ ఇస్తాయని ఆశించలేం. కొన్నింటికే అది సాధ్యపడుతుంది. ఈ విభాగంలోని యాక్సిస్‌ బ్లూచిప్‌ పథకం మాత్రం లార్జ్‌క్యాప్‌ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చినా, సూచీలతో పోల్చి చూసినా రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్‌,

Most from this category