News


మార్కెట్‌పై బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం

Monday 8th July 2019
Markets_main1562561196.png-26879

  • మార్కెట్‌పై బడ్జెట్‌ నిర్ణయాల ప్రభావం
  • ఐఐపీ, ద్రవ్యోల్బణం, కార్పొరేట్‌ ఫలితాల పాత్ర కూడా
  • ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనాలు
  • 9న టీసీఎస్‌, 12న ఇన్ఫోసిస్‌ ఫలితాలు

న్యూఢిల్లీ: గత శుక్రవారం బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కీలక నిర్ణయాలు, ప్రతిపాదనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని, అలాగే ఐఐపీ(పారిశ్రామికోత్పత్తి), ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక గణాంకాలపైనా ఇన్వె‍స్టర్ల దృష్టి ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక జూన్‌ త్రైమాసికానికి సంబంధించి విడుదలయ్యే కంపెనీల ఫలితాలు కూడా మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్ణయించొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9న టీసీఎస్‌, 12న ఇన్ఫోసిస్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. అలాగే, బడ్జెట్‌ నిర్ణయాల నేపథ్యంలో డాలర్‌తో రూపాయి కదలికలు, అంతర్జాతీయ అంశాల ప్రభావం సైతం ఉంటుందని భావిస్తున్నారు. గత శుక్రవారం బడ్జెట్‌ నిర్ణయాలు ఆశాజనకంగా లేకపోవడంతో సూచీలు నష్టాల్లో ముగిసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లిస్టెడ్‌ కంపెనీల్లో కనీస ప్రజల వాటాను ప్రస్తుత 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, బైబ్యాక్‌పై 20 శాతం పన్ను వంటి అంశాలు మార్కెట్లకు రుచించలేదు. ‘‘ఎంతగానో వేచి చూసిన బడ్జెట్‌ కార్యక్రమం ముగిసింది. అయితే, దీని తాలూకూ ప్రభావం ఈ వారం కూడా మార్కెట్‌పై కొనసాగుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోది తెలిపారు. ‘‘బడ్జెట్‌ ప్రభావం సోమవారం నాటి మార్కెట్‌పైనా ఉంటుంది. సూచీల్లో భారీ క్షీణత మరింత నష్టాలు ఉంటాయన్న సంకేతాన్నిస్తోంది. 11,800ను నిఫ్టీ కోల్పోతే మరింత క్షీణతకు దారితీస్తుంది’’అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ తెలిపారు. ఇక, పారిశ్రామిక ఉత్పత్తి, జూన్‌ నెల ద్రవ్యోల్బణం గణాంకాలు, చమురు ధరల కదలిక, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి సైతం ఈ వారం మార్కెట్‌ దిశను నిర్ణయించనున్నాయి. లిస్టెడ్‌ కంపెనీల్లో ప్రజల వాటాను పెంచే ప్రతిపాదన అవసరమైనదే కానీ, లార్జ్‌క్యాప్‌ కంపెనీల విషయంలో దీని అమలు సమస్యలతో కూడుకున్నదేనని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ అన్నారు. 
మార్కెట్లకు నిరుత్సాహం...
‘‘ప్రభుత్వం నుంచి మద్దతు చర్యలను మార్కెట్‌ ఆశించింది. కానీ, అది జరగలేదు. దేశీయంగా, అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులే ఇందుకు కారణం’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌హెడ్‌ వినోద్‌నాయర్‌ పేర్కొన్నారు. ఈక్విటీల్లో పెట్టుబడులపై ప్రోత్సాహకాల్లేమి మార్కెట్లను సమీప కాలంలో నిరుత్సాహంగా మార్చొచ్చన్నారు. ఈ స్థాయి నుంచి మార్కెట్‌ పనితీరు అన్నది 2020 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆర్థిక పనితీరుపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయాన్ని వినిపించారు. 
ఈ వారంలో వచ్చే ఫలితాలు...
8వ తేదీన డెల్టాకార్ప్‌, గోవా కార్బన్‌, 9న టీసీఎస్‌, 10న సీసీఎల్‌, 12న ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, కర్ణాటక బ్యాంకు, 13న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, డీమార్ట్‌ ఈ వారంలో ఫలితాలు విడుదల చేయనున్న ప్రముఖ కంపెనీల్లో కొన్ని.  ‘‘బడ్జెట్‌లో అదనపు సాయం కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు కొనసాగుతాయి. 2020 ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. 2020 ఆర్థిక సంవత్సరం ఫలితాల విషయంలో ఎన్‌ఎస్‌ఈ 500 కంపెనీల పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి ఉంటుందని మా అంచనా’’అని ఎడెల్‌వీజ్‌ ఇన్వెస్టర్‌ రీసెర్చ్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌కపూర్‌ తెలిపారు.



You may be interested

కొనసాగుతున్న ఆటో షేర్ల పతనం

Monday 8th July 2019

బడ్జెట్‌లో ఆటో రంగానికి అనుకున్నంత చేయూత లేకపోవడంతో పాటు ఆసియా మార్కెట్ల పతనం కారణంగా సోమవారం (జులై 8) ట్రేడింగ్‌లో నిఫ్టీ ఆటో సూచీ 2.15 శాతం లేదా 168.90 పాయింట్లు నష్టపోయి ఏడాది కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 10.00 సమయంలో ఆటో ఇండెక్స్‌ సూచీ 7,680.20 పాయింట్ల వద్ద  ట్రేడవుతోంది.  హీరో మోటర్‌ కార్ప్‌ 4.09 శాతం, మారుతి 2.88 శాతం, అపోలో టైర్స్‌ 2.84 శాతం, మదర్‌

1400డాలర్ల వద్దకు పసిడి ధర

Monday 8th July 2019

ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్ల కోతకు అంచనాలు బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1400డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప లాభంతో 1,401.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ శుక్రవారం జూన్‌ నెల ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. సూమరు 2.24లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. అంచనాలకు మించి ఉద్యోగాల కల్పన జరగడంతో ఈ నెలలో

Most from this category