News


ఆర్‌ఐఎల్‌ డౌన్‌గ్రేడ్‌-మెక్వ్యరీ

Thursday 30th January 2020
Markets_main1580358341.png-31324

నేలచూపులతో ప్రారంభమైన రిలయన్స్‌ షేరు
నష్టాలతో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు

డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వ్యరీ తాజాగా పేర్కొంది. రూ. 1300 టార్గెట్‌ ధరను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. కాగా.. కరోనా వైరస్‌ జపాన్‌కూ చేరిన వార్తలతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు డీలా పడ్డాయి. నేడు సమావేశంకానున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై గ్లోబల్‌ ఎమర్జెన్సీను ప్రకటించన్నుట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం​బలహీనంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 168 పాయింట్లు క్షీణించి 41,035కు చేరగా.. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 12,079 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 1458 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1480 వద్ద గరిష్టాన్నీ, రూ. 1454 వద్ద కనిష్టాన్నీ తాకింది.

అండర్‌పెర్ఫార్మ్‌
ఆర్‌ఐఎల్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి అండర్‌పెర్ఫార్మ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తాజాగా మెక్వారీ పేర్కొంది. కంపెనీ వృద్ధి అవకాశాలను ఇప్పటికే షేరు ధర ప్రతిబింబిస్తున్నట్లు అభిప్రాయపడింది. దీంతో రూ. 1300 టార్గెట్‌ ధరను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. అయితే వృద్ధి బాటలో వున్నదని భావించే ఇన్వెస్టర్లు ఆర్‌ఐఎల్‌లో ఏ ధరలో అయినా  పెట్టుబడులను కొనసాగించవచ్చని పేర్కొంది. గత నెల రోజుల్లో ఆర్‌ఐఎల్‌ షేరు 5 శాతం నీరసించగా.. ఏడాది కాలంలో 22 శాతం ర్యాలీ చేయడం గమనార్హం. కాగా.. ఆర్‌ఐఎల్‌ కెమికల్‌ బిజినెస్‌ ఆర్జన 2018-19 ఏడాదిలో గరిష్టస్థాయికి చేరుకున్నట్లు మెక్వారీ అంచనా వేసింది. టెలికం విభాగం జియో అంచనాలను మించుతూ వేగవంత వృద్ధి​సాధిస్తున్నదని, అయితే ఈ స్థాయి నుంచి కస్టమర్లను పెంచుకోవడం కష్టమేనని అభిప్రాయపడింది. అయితే పరిశ్రమ కన్సాలిడేషన్‌ నేపథ్యంలో ఏఆర్‌పీయూలు బలపడుతున్నట్లు తెలియజేసింది. 



You may be interested

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ డివిడెండ్‌ రూ.10

Thursday 30th January 2020

34 శాతం పెరిగిన లాభం  న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో 34 శాతం ఎగసి రూ.123 కోట్లకు చేరింది. ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.1,073 కోట్లకు పెరిగిందని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ తెలిపింది. ఆర్డర్లు వరుసగా 11వ క్వార్టర్‌లోనూ పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో తామందిస్తున్న రెండో డివిడెండ్‌

జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌కు ఆన్‌లైన్‌ జోష్‌

Thursday 30th January 2020

 14 శాతం పెరిగిన ఆదాయం   7 శాతం వృద్ధితో రూ.104 కోట్లకు నికర లాభం  న్యూఢిల్లీ: డొమినోస్‌  పిజ్జా, డంకిన్‌ డునట్స్‌ చెయిన్లను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.104 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో వచ్చిన నికర లాభం రూ.97 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.929

Most from this category