News


ఫలితాల ఎఫెక్ట్‌.. 52 వారాల కనిష్టానికి ఎం అండ్‌ ఎం

Wednesday 7th August 2019
Markets_main1565169682.png-27611

మహీంద్రా అండ్ మహీంద్రా జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో, ఏడాది ప్రాతిపదికన 80 శాతం నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,257 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన ఈ కంపెనీ, ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 లో రూ. 2,260 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అసాధారణ లాభం(ఆస్తులు విక్రయం మొ.) రూ. 1,367 కోట్లు ద్వారా, ఈ కంపెనీ నికర లాభం గణనీయంగా పెరిగింది.  ఈ కంపెనీ నికర లాభం రూ. 1,000 కోట్లుగా ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. కాగ అసాధారణ లాభాన్ని పక్కన పెడితే కంపెనీ లాభం ఏడాది ప్రాతిపదికన 26 శాతం తగ్గి రూ. 918 కోట్లకు పడిపోవడం గమనర్హం. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు 5 శాతంపైగా క్షీణించి, 52 వారాల కనిష్టస్థాయిని తాకింది.

బలహీనమైన సెంటిమెంట్: సెంటిమెంట్‌ బలహీనంగా ఉండడంతో డిమాండ్‌ భారీగా పడిపోయింది. ఫలితంగా ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, 82,013 ట్రాక్టర్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 15 శాతం తక్కువ కావడం గమనర్హం. వాహనాల అమ్మకాలు 5 శాతం క్షీణించి 1,23,690 యూనిట్లకు చేరుకున్నాయి. ‘ ఆర్థిక సంవత్సరం 2020లో, ట్రాక్టర్ డిమాండ్ మందగించింది, నైరుతి రుతుపవనాల ఆలస్యం, బలహీనమైన వ్యవసాయ ఆదాయాల వలన డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడింది’  అని ఎం అండ్‌ ఎం పేర్కొంది. దేశీయ ట్రాక్టర్ పరిశ్రమ విక్రయాలు, ఆర్థిక సంవత్సరం 2020 క్యూ1 లో 14.6 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ పరిశ్రమ 2,23,937 ట్రాక్టర్లను విక్రయించగా, ఈ త్రైమాసికంలో ఆ సంఖ్య 1,61,305 కు పడిపోయింది.
టాప్‌లైన్(మొత్తం ఆదాయం): జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, ఇతర ఆదాయం 4 శాతం క్షీణించి, రూ. 12,997 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఆదాయం రూ. 13,551 కోట్లుగా ఉంది.
ఆపరేటింగ్ మార్జిన్ (ఓపీఎం): ఆర్థిక సంవత్సరం 2019 క్యూ1 లో ఆపరేటింగ్‌ మార్జిన్‌ 15.80 శాతంగా ఉండగా, ఈ త్రైమాసికంలో అది 14 శాతానికి తగ్గింది.

 



You may be interested

బేర్‌ గుప్పిట్లోనే ముడిచమురు!

Wednesday 7th August 2019

ఆయిల్‌ మార్కెట్‌ నిపుణురాలు వందనా హరి అంచనా ప్రపంచ వృద్ధి గతేడాది కన్నా మరింత మందగించవచ్చన్న అంచనాల నేపథ్యంలో క్రూడాయిల్‌లో షార్ట్‌ సైడ్‌ ఉండడమే మంచిదని ప్రముఖ అనలిస్టు వందనా హరి అభిప్రాయపడ్డారు. ట్రేడ్‌వార్‌ కారణంగా డిమాండ్‌ వృద్ధిపై ఏడాదికేడాది ఆందోళనలు పెరిగిపోతున్నాయన్నారు. ముఖ్యంగా గతవారం నుంచి అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు మరింత సంకటంగా తయారయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముడిచమురు డిమాండ్‌లో పెరుగుదల ఆశించలేమని చెప్పారు. అందువల్ల క్రూడ్‌

మార్కెట్‌ను మెప్పించని ఆర్‌బీఐ రేట్ల కోత

Wednesday 7th August 2019

రిజర్వ్‌ బ్యాంకు పాలసీ విధాన ప్రకటన అనంతరం మార్కెట్‌ లాభాల్లోంచి నష్టాల్లోకి మళ్లింది. ఆసియా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., నేడు దేశీయ మార్కెట్‌ లాభాలతో మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో వడ్డీరేట్ల కోత అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఉదయం సెషన్స్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో సెన్సెక్స్‌ 127 పాయింట్లు పెరిగి 37,104.79 వద్ద, నిఫ్టీ 27  పాయింట్లు లాభపడి 10,975.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే,

Most from this category