News


ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌కు కొత్త భాగస్వామి!

Friday 21st June 2019
Markets_main1561055786.png-26454

మహింద్రా అండ్‌ మహింద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తన అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ/మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల సంస్థ) కోసం విదేశీ వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకుందని సమాచారం. సంబంధిత భాగస్వామి ఇండోనేషియాకు చెందిన కంపెనీ అని, ఈ నిర్ణయాన్ని శుక్రవారం మీడియా ముఖంగా కంపెనీ ప్రకటించనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. 

 

మహింద్రా మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణలో ఆస్తులు ఈ ఏడాది మార్చి నాటికి రూ.4,748 కోట్లుగా ఉన్నాయి. 2018 డిసెంబర్‌ నాటికి ఉన్న నిర్వహణ ఆస్తులతో పోలిస్తే 26.42 శాతం వృద్ధి చెందాయి. ఆర్థిక విభాగంలో రోబో బ్యాంకుతో ఇప్పటికే ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు జాయింట్‌ వెంచర్‌ ఉంది. నెదర్లాండ్స్‌ ప్రధాన కేంద్రంగా రోబో బ్యాంకు ఇండోనేషియా పనిచేస్తోంది. రోబో బ్యాంకుతో తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ నిర్ణయించుకుంటే ఈ జాయింట్‌ వెంచర్‌కు పన్ను రాయితీలు కూడా లభించనున్నాయి. ఎందుకుంటే కీలకమైన రంగాల్లో ఇండోనేషియా పన్ను రాయితీలు కల్పిస్తోంది. ఇండోనేషియా కంపెనీ ఎంఅండ్‌ఎం ఏఎంసీ వ్యాపారంలో వాటా తీసుకుంటే, అది కేంద్ర ప్రభుత్వ విధానమైన ఆసియాన్‌ దేశాలతో బలమైన వాణిజ్య భాగస్వామ్యం కింద సానుకూల చర్య అవుతుంది. ఇండోనేషియా ఆసియాన్‌లో పూర్తి కాల సభ్య దేశం. దీనివల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యం బలోపేతం అవుతుందని అంచనా. 



You may be interested

ఐఐఎఫ్‌ఎల్‌ సూచించే 13 స్టాక్స్‌

Friday 21st June 2019

పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకునేందుకు కొందరు ఇన్వె‍స్టర్లు కరెక్షన్‌ కోసం ఎదురు చూస్తుంటారు. నిజానికి మార్కెట్లు కూడా ఇటువంటి అవకాశాలు ఇస్తూనే ఉంటాయి. కానీ, వాటిని గుర్తించేవారు కొందరే. దీర్ఘకాలం కోసం మార్కెట్‌లో ఉండాలనుకునే వారు కరెక్షన్లను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. లార్జ్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవడం మంచి ఆప్షన్‌ అవుతుందంటున్నారు.    ‘‘నిఫ్టీ 2019లో 13,000 దిశగా ర్యాలీ చేయనుంది. బలమైన ప్రభుత్వం, సానుకూల

చిన్న వ్యాపారం.. తక్కువ అనుమతులు!

Thursday 20th June 2019

కిరాణా, తినుబండార షాపులు పెట్టుకోడానికి  తీసుకోవలసిన అనుమతులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏకగవక్షా విధానాన్ని అమలు చేసి చిన్న వ్యాపారాలకు తొందరగా అనుమతులు లభించే విధంగా చర్యలు చేపట్టనుంది. సింగపూర్‌, చైనా వంటి దేశాలలో రెస్టారెంట్‌ ప్రారంభించడానికి కేవలం నాలుగు అనుమతులు తీసుకుంటే చాలు. కాగా ఇండియాలో ప్రస్తుతం రెస్టారెంట్‌కు ప్రారంభించడానికి 17, కిరాణా షాపును ప్రారంభించడానికి 28 అనుమతులు తీసుకోవలసి ఉంది. రెస్టారెంట్‌ను నిర్వహించేవాళ్లు ఫైర్‌, వాణిజ్య ప్రకటనలు

Most from this category