News


మార్కెట్‌క్యాప్‌ వ్యత్యాసం... మరింత పెరిగింది!

Thursday 19th December 2019
Markets_main1576732461.png-30310

ఇన్వెస్టర్లు ఎక్కువగా మక్కువ చూపడంతో చిన్న స్టాకులతో పోలిస్తే లార్జ్‌క్యాప్స్‌ అధికంగా లాభాలు చూపుతున్నాయి. దీంతో లార్జ్‌క్యాప్స్‌కు చిన్నక్యాప్స్‌కు మధ్య మార్కెట్‌ క్యాప్‌ అంతరం రెండు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. స్టాక్‌ ఎక్చేంజ్‌లోని ఏ గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ క్యాప్‌ ప్రస్తుతం 94 శాతానికి పెరిగింది. 2000 సంవత్సరం తర్వాత ఈ రేంజ్‌లో ఈ మార్కెట్‌ క్యాప్‌ పెరగడం ఇదే తొలిసారి. ఇదే సమయంలో స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ మార్కెట్‌క్యాప్‌ 2018 గరిష్ఠాల నుంచి వరుసగా 30, 17 శాతం పడిపోయాయి. ఇదే విధింగా మిడ్‌క్యాప్స్‌కు సెన్సెక్స్‌కు మధ్య ప్రైస్‌ నిష్పత్తి 0.069కు దిగివచ్చింది. ఇది దశాబ్ద కనిష్ఠ స్థాయి. మరోవైపు సెన్సెక్స్‌ ఈపీఎస్‌ను అనలిస్టులు కార్పొరేట్‌ టాక్స్‌ కోత అనంతరం అప్‌గ్రేడ్‌ చేశారు. ఇదే సమయంలో స్మాల్‌క్యాప్‌ సూచీ ఈపీఎస్‌ను తగ్గించారు. అలాగే స్మాల్‌, మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కింద ఉన్న ఏయూఎం విలువ గత ఏప్రిల్‌తో పోలిస్తే దాదాపు 4 శాతం తగ్గింది.

ఎకానమీలో విస్తృత రికవరీ వస్తేనే చిన్న స్టాకులు పుంజుకుంటాయని, ప్రస్తుతానికి అలాంటి సంకేతాలేమీ లేవని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ వివరించింది. అయితే ఇలా పెద్ద, చిన్న స్టాకుల మధ్య ఎంక్యాప్‌ వ్యత్యాసం భారీగా పెరగడం తర్వాతి రోజుల్లో సాధారణ స్థాయిలకు వచ్చేస్తుందని మీన్‌ రివర్షన్‌ థియరీ సూచిస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చిన్నస్టాక్‌ ఇండెక్స్‌లు తమ గరిష్ఠాలకన్నా ఇంకా 20- 30 శాతం దిగువనే ట్రేడవుతున్నాయి. ప్రధాన సూచీలు మాత్రం ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. ఎకానమీలో మందగమనం మరో రెండు త్రైమాసికాలు కొనసాగవచ్చని, ఆ తర్వాతే బాటమ్‌అవుట్‌ కనిపిస్తుందని కోటక్‌ ఏఎంసీ అంచనా వేస్తోంది. అలాంటి సంకేతాలు వచ్చినప్పుడు చిన్న స్టాకులు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు జరిగే ప్రక్రియ కాదని తెలిపింది. You may be interested

బంగారంపై పెట్టుబడికి బోలెడు మార్గాలు!

Thursday 19th December 2019

భారతీయులకు బంగారం కేవలం ఆభరణమే కాదు, అది ఒక పెట్టుబడి సాధనం, ఒక హోదాచిహ్నం, ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో సంపదను కాపాడే అస్త్రమని ప్రముఖనిపుణుడు సుధేశ్‌ నంబియత్‌ చెబుతారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో బంగారం పెట్టుబడి సాధనంగా మరింతమందిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మనదగ్గర బంగారంపై పెట్టుబడులకు ఉన్న మార్గాలు ఎన్ని? అవి ఏంటి? చూద్దాం... 1. భౌతిక రూపంలో: బంగారాన్ని భౌతికంగా నాణేలు, అచ్చులు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేయడం ఎక్కువగా

టెక్‌ స్టార్టప్‌లలో భారీ నియామకాలు

Thursday 19th December 2019

న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలోని స్టార్టప్స్‌ (అంకుర సంస్థలు) ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సాఫ్ట్‌వేర్‌ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఫ్యూచర్‌ స్కిల్స్‌ ప్రైమ్‌’ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేసింది. నాస్కామ్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని టాప్‌ 15 కంపెనీలు నిరంతరం ఉద్యోగాలను కల్పిస్తూనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు. 

Most from this category