News


ఆర్‌బీఐ పీసీఏ అమలు..లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ లోయర్‌ సర్క్యూట్‌

Monday 30th September 2019
Markets_main1569821701.png-28622

  లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ)పై దిద్దుబాటు చర్యల(ప్రాంప్టడ్‌ కరెక్టివ్‌ యాక్సన్‌(పీసీఏ))ను ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) ప్రారంభించడంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 5 శాతం నష్టపోయి లోయర్‌ సర్క్యూట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ అధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగివుండడంతోపాటు, మూలధనం తగినంత లేకపోవడం, వరుసగా రెండేళ్ల నుంచి ఆస్తులపై ప్రతికూల రాబడులను ఇవ్వడం వలన ఆర్‌బీఐ ఈ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. దీంతో ఈ బ్యాంక్‌ షేరు విలువ సోమవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 5 శాతం పడిపోయి రూ. 34.75 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ పరిమితిని చేరుకుంది. 
     కార్పోరేట్‌, ఒత్తిళ్లలో ఉన్న కంపెనీలు, రిస్క్‌ ఎక్కువగా ఉన్న రంగాలకు తప్ప మిగిలిన వారి కోసం బ్యాంక్‌ రుణ కార్యకలాపాలు యధావిదంగా ఉంటాయని ఎల్‌వీబీ తెలిపింది. అంతేకాకుండా ఎన్‌పీఏ(మొండి బకాయిలు)లను రికవరి చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి, బ్యాంక్‌ క్యాపిటల్‌ను పెంచడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి బ్యాంక్‌ దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టిందని ఎల్‌వీబీ పేర్కొంది. సీఆర్‌ఏఆర్‌(క్యాపిటల్‌ టూ రిస్క్‌ వెయిడ్‌ రేషియో) పెంచడం కోసం, క్యాపిటల్‌ను పెంచే వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఈ బ్యాంక్‌ తెలిపింది. పీసీఏ అంటే తాత్కాలికంగా బ్యాంక్‌ కార్యకలాపాలను మూసివేయడం కాదని, బ్యాంక్‌, సాధరణ కార్యకలాపాలను కొనసాగించగలదని ఎల్‌వీబీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ను విలీనం చేసుకుందామని ప్రయత్నించిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 12 శాతం నష్టపోయి 52 వారాల కనిష్ఠమయిన రూ. 342.70 కు పతనమయ్యింది. ఆర్‌బీఐ ఒప్పుకుంటే ఇండియా బుల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ గెహ్లట్‌ విలీన సంస్థకు చైర్మన్‌గా ఉండరని, అదేవిధంగా బోర్డు స్థానం కూడా కలిగి ఉండరనే సంకేతాలను ఇండియా బుల్స్‌ గ్రూప్‌ ఇవ్వడం గమనార్హం.



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల పతనం

Monday 30th September 2019

నష్టాల మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌  ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 4శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,380.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ పతనం నుంచే ప్రభుత్వరంగ రంగ షేర్లలో భారీ అమ్మకాలు నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో దాదాపు 4శాతం నష్టపోయి 2286.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని

1500డాలర్ల దిగువకు పసిడి

Monday 30th September 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1500డాలర్ల దిగువకు చేరుకుంది. ఆసియాలో సోమవారం ఔన్స్‌ పసిడి ధర 8డాలర్లు (అరశాతం) క్షీణించి 1,498.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీజింగ్, వాషింగ్టన్‌ లు తమ మధ్య నెలకొన్న వాణిజ్య వివాదాన్ని "ప్రశాంతమైన మరియు హేతుబద్ధమైన వైఖరితో" పరిష్కరించుకుంటాయని చైనా ఉప వాణిజ్యమంత్రి వాంగ్ షౌవెన్ ఆదివారం తెలిపారు.ఇరుదేశాలకు చెందిన  ఉన్నతస్థాయి అధికారుల

Most from this category