షార్ట్‌టర్మ్‌కు డజన్ సిఫార్సులు
By D Sayee Pramodh

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడినిచ్చే 12 స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్ చేస్తున్నారు.
రెలిగేర్ బ్రోకింగ్ అజిత్ మిశ్రా సిఫార్సులు
1. లుపిన్: కొనొచ్చు. టార్గెట్ రూ. 820. స్టాప్‌లాస్ రూ. 750. డైలీ చార్టుల్లో రివర్సల్ ప్యాట్రన్ ఏర్పరిచి బ్రేకవుట్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 200 రోజుల డీఎంఏపైన కొనసాగుతూ పాజిటివ్‌గా కనిపిస్తోంది.
2. పీవీఆర్: కొనొచ్చు. టార్గెట్ రూ. 1920. స్టాప్‌లాస్ రూ. 1700. రికార్డు హైని తాకి రిట్రేసైన ఈ షేరు దిగువన వంద రోజుల డీఎంఏ వద్ద మద్దతు పొందింది. ఇక్కడ నుంచి బలమైన అప్‌మూవ్ సంకేతాలు ఇస్తోంది.
చార్ట్‌వ్యూఇండియా మజార్ సిఫార్సులు
1. అపోలో టైర్స్: కొనొచ్చు. టార్గెట్ రూ. 183. స్టాప్‌లాస్ రూ. 161. రెండుమార్లు ర. 162ను తాకి రీబౌన్స్ అయింది. ఈ స్థాయి బలమైన మద్దతుగా పనిచేస్తోంది. ఈ దఫా కూడా ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్దంగా ఉంది.
2. టాటాస్టీల్: కొనొచ్చు. టార్గెట్ రూ. 447. స్టాప్‌లాస్ రూ. 383. గత సెషన్లలో 50 రోజుల డీఎంఏను తాకి బలంగా రికవరీ చూపింది. త్వరలో మరో అప్‌మూవ్ చూపి 200 రోజుల డీఎంఏ వరకు ర్యాలీ జరిపేందుకు రెడీగా ఉంది.
3. ఎక్సైడ్: కొనొచ్చు. టార్గెట్ రూ. 207. స్టాప్‌లాస్ రూ. 186. రెండువారాలుగా కన్సాలిడేషన్ జరిపింది. తాజాగా బ్రేకవుట్ సంకేతాలు ఇస్తోంది.
ప్రభుదాస్ లీలాధర్ వైశాలి సిఫార్సులు
1. హిండాల్కో: కొనొచ్చు. టార్గెట్ రూ. 208. స్టాప్‌లాస్ రూ. 182. ఊర్ధ్వముఖ ట్రెండ్లైన వద్ద మద్దతు పొందుతూ వస్తోంది. ఆర్ఎస్ఐ ఇండికేటర్ ట్రెండ్ రివర్సల్ చూపుతోంది.
2. గోద్రేజ్ ప్రాపర్టీస్: కొనొచ్చు. టార్గెట్ రూ. 970. స్టాప్‌లాస్ రూ. 845. గత గరిష్ఠం నుంచి పతనమై రూ. 844 వద్ద మద్దతు పొందింది. ఇక్కడనుంచి కీలకమైన 200 రోజలు డీఎంఏపైకి ర్యాలీ జరిపి స్థిరంగా కనిపిస్తోంది.
ఆనంద్ రాఠీ జై ఠాకూర్ సిఫార్సులు
1. మాక్స్ ఫిన్సర్వ్: కొనొచ్చు. టార్గెట్ రూ. 512. స్టాప్‌లాస్ రూ. 486. సౌష్ఠవాకార త్రిభుజాకృతి నుంచి బ్రేకవుట్ సాధించినట్లు చార్టుల్లో చూపుతోంది. ఇలాంటి బ్రేకవుట్స్ మరింత అప్‌మూవ్‌కు సంకేతాలు.
2. పీఎఫ్సీ: కొనొచ్చు. టార్గెట్ రూ. 127. స్టాప్‌లాస్ రూ. 115. వేవ్ థియరీలో వేవ్ బీ కరెక్షన్ను ముగించింది. ఎంఏసీడీలో పాజిటివ్ క్రాసోవర్ ఏర్పడింది.
3. సన్‌ఫార్మా: కొనొచ్చు. టార్గెట్ రూ. 475. స్టాప్‌లాస్ రూ. 441. ఫాలింగ్ ఛానెల్ నుంచి బ్రేకవుట్ ఇవ్వడంతో పాటు ఇండికేటర్లలో పాజిటివ్ సంకేతాలు కనబరుస్తోంది. ఫార్మా ఇండెక్స్ కూడా పాజిటివ్ మూడ్‌లో ఉంది.
కోటక్ సెక్యూరిటీస్ శ్రీకాంత్ సిఫార్సులు
1. ఎల్ఐసీ హౌసింగ్: కొనొచ్చు. టార్గెట్ రూ. 440. స్టాప్‌లాస్ రూ. 410. షేరు బలమైన అప్‌ట్రెండ్‌లో ఉంది. గత ర్యాలీలో ఎదురులేకుండా పయనించి ఇటీవలే రెండు వారాలు మంచి పతనం చూసింది. తిరిగి అప్‌మూవ్‌కు రెడీగా ఉన్న సంకేతాలు చూపుతోంది.
2. రేమండ్: కొనొచ్చు. టార్గెట్ రూ. 740. స్టాప్‌లాస్ రూ. 670. గతంలో మంచి ర్యాలీ జరిపి గడిచిన రెండు వారాల్లో అందులో సగం మేర పతనమైంది. ఇప్పుడున్న స్థితిలో మరోమారు కొనుగోళ్లకు అవకాశం ఇస్తోంది.
You may be interested
దివాలా చట్టం పరిధిలోకి ఎన్బీఎఫ్సీలు.... బ్యాంకులకు మంచిదే: మూడీస్
Monday 25th November 2019డీఫాల్ట్‌ను ఎదుర్కొంటున్న ఎన్బీఎఫ్సీ(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీలు)లను దివాలా చట్టం పరిధిలోకి తీసుకురావడం బ్యాంకులపై పాజిటివ్ ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ ఓ నివేదికలో పేర్కొంది. దివాలా చట్టంలోని సెక్షన్ 227తో, రూ. 500 కోట్ల ఆస్తి విలువ కలిగిన ఒత్తిడిలోని ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీ(హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లను దివాలా కోర్టుకు సిఫార్సు చేసే అధికారాన్ని ప్రభుత్వం తాజాగా ఆర్బీఐకి ఇచ్చింది. దీని ఆధారంగా ఒత్తిడిలోని
సెన్సెక్స్ కొత్త రికార్డు...చేరువలో నిఫ్టీ
Monday 25th November 2019164 పాయింట్లు పెరిగి నిఫ్టీ కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూలాంశాలు రాణించిన బ్యాంకింగ్, మెటల్ షేర్లు మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభం నుంచి కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సోమవారం సూచీలు పరుగులు తీసాయి. సెన్సెక్స్ 529 పాయింట్లు పెరిగి 40,889 వద్ద క్లోజయ్యింది. ఇది సెన్సెక్స్‌కు రికార్డు ముగింపు. ఇక నిఫ్టీ 164.60 పాయింట్ల లాభంతో 12,079 వద్ద క్లోజయ్యింది. జూన్ తొలివారంలో నమోదైన రికార్డు గరిష్ఠాన్ని కొద్దిరోజుల క్రితమే దాటిన సెన్సెక్స్ తాజాగా 40,900 పాయింట్లపైన మరో