News


2019: చౌక వడ్డీ రేట్ల ఏడాది

Monday 30th December 2019
Markets_main1577691780.png-30529

2019లో కేంద్ర బ్యాంకుల రేట్ల తగ్గింపు బాట
యూటర్న్‌ తీసుకున్న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌
6 సమీక్షలలో ఆర్‌బీఐ ఐదుసార్లు రెపో కోత

ఈ కేలండర్‌ ఏడాదిని(2019) చౌక వడ్డీ రేట్ల సంవత్సరంగా పిలవవచ్చునంటున్నారు పలువురు ఆర్థికవేత్తలు. 2008లో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం తరువాత వరుసగా 9 సార్లు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది జూన్‌లో తొలిసారి రేట్ల తగ్గింపువైపు దృష్టిసారించింది. వెరసి రేట్ల కోతకు తెరతీయడం ద్వారా యూటర్న్‌​ తీసుకుంది. మరోపక్క దేశీయంగా జీడీపీ మందగమనం, ద్రవ్యోల్బణం, రూపాయి డీలా వంటి పలు ప్రతికూలతలను ఎదుర్కొనేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో కోతలు అమలు చేస్తూ వచ్చింది. ఇతర వివరాలు చూద్దాం..

దశాబ్దకాలపు కనిష్టానికి రెపో
రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన పరపతి సమీక్షలు చేపట్టే మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరుసార్లు సమావేశాలు నిర్ణయించింది. వీటిలో భాగంగా ఐదుసార్లు రెపో రేటులో కోత విధించింది. వెరసి ఈ ఏడాదిలో ఆర్‌బీఐ దఫదఫాలుగా మొత్తం 135 బేసిస్‌ పాయింట్ల(1.35 శాతం)మేర రెపోను కట్‌ చేసింది. దీంతో అక్టోబర్‌కల్లా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు దశాబ్దకాలపు కనిష్టమైన 6 శాతం దిగువకు చేరింది. ప్రస్తుతం 5.15 శాతంగా అమలవుతోంది. దీంతో రివర్స్‌ రెపో సైతం 4.9 శాతానికి చేరగా.. బ్యాంక్‌ రేటుగా పిలిచే ఎంఎస్‌ఎఫ్‌(మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ) 5.4 శాతాన్ని తాకింది. జీడీపీ మందగమనం, రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), రూపాయి నీరసించడం, లిక్విడిటీ కొరత తదితర పలు అంశాలు ఆర్‌బీఐ పాలసీ సమీక్షా నిర్ణయాలపై ప్రభావం చూపే సంగతి తెలిసిందే. కాగా.. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పురోగతి 4.5 శాతానికి పరిమితమైంది. ఇది 2013 తదుపరి కనిష్ట వృద్ధికావడం గమనార్హం! ఇక అక్టోబర్‌లో సీపీఐ 4.62 శాతానికి ఎగసింది. తద్వారా ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతాన్ని మించింది. ఈ అంచనాలతోనే ఆర్‌బీఐ రేట్ల కోత బాటలో సాగుతున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు.

డిసెంబర్‌ సమీక్షలో ఆర్‌బీఐ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడింది! అయితే రెపో రేట్ల తగ్గింపును పూర్తిస్థాయిలో బ్యాంకులు అమలు చేయకపోవడంతో రుణ రేట్లను రెపోకు అనుసంధానించేందుకు ఆర్‌బీఐ నిర్ణయించినట్లు ఆర్థికవేత్తలు వివరించారు. ఈ ప్రభావంతో ఇటీవల ఎస్‌బీఐసహా పలు బ్యాంకులు గృహ, వాహన తదితర రుణ రేట్లను తగ్గిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

2 శాతం దిగువకు ఫండ్స్‌ రేటు
ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ అధ్యక్షతన ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ఈ ఏడాది జూన్‌లో తొలిసారి వడ్డీ రేటును పావు శాతంమేర తగ్గించింది. ఈ బాటలో మరోరెండు సమీక్షలలోనూ వడ్డీ రేటులో కోత పెట్టింది. దీంతో ఫెడ్‌ ఫం‍డ్స్‌ రేట్లు 1.5-1.75 శాతానికి చేరాయి. డిసెంబర్‌ సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే కట్టుబడినప్పటికీ ఫండ్స్‌ రేటు 2 శాతం దిగువకు చేరింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, చైనాసహా ప్రపంచ ఆర్థిక పురోగతి మందగించడం, బ్రెక్సిట్‌ అంశంపై తలెత్తిన అస్పష్టత, అమెరికా వ్యవసాయేతర రంగ ఉపాధి గణాంకాలు బలహీనపడటం వంటి అంశాలు ప్రధానంగా ఫెడ్‌ నిర్ణయాలను ప్రభావితం​చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

గతంలో ఏం జరిగిందంటే?
2008 ఆర్థిక సంక్షోభం తదుపరి పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీ స్థాయిలో సహాయక ప్యాకేజీల(స్టిములస్‌)ను అమలు చేశాయి. వీటికి దన్నుగా వడ్డీ రేట్లనూ నామమాత్ర స్థాయిలకు తగ్గించాయి. ఆపై ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడంతో స్టిములస్‌కు మంగళంపాడటంతోపాటు.. గత కొన్నేళ్లుగా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చాయి.  ఈ బాటలో ఫైనాన్షియల్‌ మార్కెట్లపై గణనీయ ప్రభావం చూపగల అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సైతం వరుసగా 9 సార్లు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, చైనా మధ్య ఏడాదిన్నర కాలంగా కొనసాగిన వాణిజ్య వివాదాలు, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగే(బ్రెక్సిట్‌) అంశంపై తలెత్తిన అస్పష్టత వంటి ప్రతికూల అంశాలు అంతర్జాతీయ ఆర్థిక మందగమనానికి బీజాలు వేశాయి. దీంతో ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై గణనీయ ప్రభావం చూపగల అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాది తొలిసారి రేట్ల పెంపు బాటను వీడింది. అంతేకాకుండా జులైలో రేట్ల తగ్గింపు ద్వారా యూటర్న్‌ తీసుకుంది.You may be interested

వారం గరిష్టానికి టాటామోటర్స్‌

Monday 30th December 2019

టాటా మోటర్స్‌ షేరు  సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్లో  వారం రోజుల గరిష్ట స్థాయిని అందుకుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.177.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరకు కొనుగోలుకు ఆసక్తి చూపడంతో ఒకదశలో 2.69శాతం పెరిగి రూ.180.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేరు వారం రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.1:07ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.176.15)తో

చిన్న స్టాకుల్లో వాటాలు పెంచుకున్న ఎంఎఫ్‌లు!

Monday 30th December 2019

2020లో పరుగులు తీస్తాయన్న అంచనాలు ఈ సంవత్సరం చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు చిన్నస్టాకులపై మక్కువ చూపారు. దాదాపు 100కుపైగా చిన్న కంపెనీల్లో ఎంఎఫ్‌లు 2019లో వాటాలు పెంచుకున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు స్టాకులు ఈ సంవత్సరం నెగిటివ్‌ రాబడులే ఇచ్చాయి. మార్కెట్లో లార్జ్‌క్యాప్స్‌ హవా కొనసాగుతున్నందున చిన్నస్టాకుల ర్యాలీ ఇంకా మొదలవ్వలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్రమంగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ పరుగులు ఆరంభమవుతాయని అంచనా వేస్తున్నారు.

Most from this category