STOCKS

News


టారీఫ్‌లు పెంచితే...వొడాఫోన్ఐ‌డియా మల్టిబ్యాగర్‌!

Wednesday 20th November 2019
Markets_main1574235998.png-29731

‘టెలికాం సెక్టార్‌కు సంబంధించి నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం, టెలికాం కంపెనీలు, ఈ సెక్టార్‌ దీర్ఘకాల వృద్ధి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి’ అని మార్కెట్‌ విశ్లేషకులు సమీర్‌ నారయణ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..
టెలికాం కంపెనీలు..యస్‌ బ్యాంక్‌
యస్‌ బ్యాంక్‌కు టెలికాం సెక్టార్‌ ఎదుర్కొంటున్న సమస్యలకు స్వల్ప పోలిక ఉంది. ఒకటి నిర్థిష్టమైన బ్యాంక్‌ గురించి చెబుతుంటే, మరోకటి మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని గురించి వివరిస్తోంది. సుప్రీం కోర్టు ఏజీఆర్‌ బకాయిలపై ఇచ్చిన తీర్పు తర్వాత, టెలికాం సమస్య, ఫైనాన్సియల్‌ వ్యవస్థలో రిస్క్‌గా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఈ బకాయిలు చెల్లించేందుకు టెలికాం కంపెనీలకు కొంత సమయాన్ని ఇచ్చే అవకాశం అధికంగా ఉండడంతో ఈ కంపెనీల షేర్ల ధరలలో మార్పు చూస్తున్నాం. 
    వాస్తవానికి ఇండియాలో మొబైల్‌ వినియోగం 80-85 శాతం పెరిగింది. ప్రస్తుతం ప్రతి మనిషి​ జీవితంలో డేటా కూడా నిత్య అవసరమయిపోయింది. ఇళ్లలోని సరుకులను కొనుగోలు చేసే ముందే తమ డేటా ప్లాన్‌లను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ప్రస్తుతం డేటా ముఖ్యమైన కొనుగోలుగా మారిపోయింది. అందువలన నెలకు సగటున 10 జీబీ డేటాను వినియోగించడం సాధరణమయ్యింది. కానీ చందాదారులు నెట్‌వర్క్‌ను మారే విషయంపై టెలికాం కంపెనీ ఆందోళన చెందాలి. తాజాగా టెలికాం కంపెనీలు టారిఫ్‌లను పెంచడానికి సిద్ధమయ్యాయి. స్వల్పంగా పెంచే టారిఫ్‌లు వినియోగదారులను దూరం చెయ్యవు. టెలికాం సెక్టార్‌కు సంబంధించి నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం, టెలికాం కంపెనీలు, ఈ సెక్టార్‌ దీర్ఘకాల వృద్ధి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇది ఈ కంపెనీలకే కాకుండా, బ్యాంకింగ్‌ వ్యవస్థకు, వినియోగదారులకు దీర్ఘకాలంలో మంచి చేస్తుంది. 
  యస్‌ బ్యాంక్‌ విషయానికొస్తే..యస్‌బ్యాంక్‌ కొత్త మేనేజమెంట్‌ మార్కెట్‌ను నిర్దేశించే మార్గదర్శకాలు ప్రకటించింది. అనిశ్చితిని తట్టుకునే విధంగా వాచ్‌లిస్ట్‌ను కూడా బ్యాంక్‌ విస్తరించింది. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌ను మెరుగుపరచడానికి మేనేజ్‌మెంట్‌ ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటుందో వేచి చూడాలి. విజిబులిటీ పరంగా చూస్తే దీర్ఘకాల ఇన్వెస్టర్లకు రూ. 60-65 అధ్వాన్న ధర స్థాయయితే కాదు. ఈ పరిమాణంలో ఉన్న బ్యాంక్‌ ఖచ్చితంగా తన పరిస్థితులను మార్చుకుంటుంది. మేనేజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్టు రెండవ దశ నిధుల సేకరణ జరగితే, దీర్ఘకాలానికిగాను ఈ స్టాక్‌ ప్రస్తుత ధరల స్థాయి వద్ద ఆకర్షిస్తోంది. 
   మల్టిబ్యాగర్‌ అవకాశం కోసం ఎదురుచూస్తుంటే ఖచ్చితంగా వొడాఫోన్‌-ఐడియా షేరును పరిశీలించడం మంచిది. కానీ సమస్యేంటంటే ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 16,000 కోట్లుంటే, రుణాలు రూ. లక్ష కోట్లకు పైగా ఉన్నాయి. కానీ టారిఫ్‌లను పెంచితే , కంపెనీ ఎబిట్డా 70 శాతానికి పైగా పెరుగుతుంది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఈ కంపెనీ షేరు  రెండింతలయ్యింది. ఒకవేళ ఎబిట్డా రెండింతలయితే, సాంకేతికంగా కంపెనీ షేరు 4-5రెట్లు పెరుగుతుంది. 

ఎన్‌బీఎఫ్‌సీలో పెద్ద కంపెనీలే..
గతేడాది ఇదే సమయానికి ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం మార్కెట్‌ను చుట్టుకుంది. దీంతో చాలా వరకు చిన్న కంపెనీలు ఈ సెక్టార్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇది ఈ రంగంలోని పెద్ద కంపెనీలకు సానుకూలంగా పనిచేసింది. పెద్ద కంపెనీలు మార్కెట్‌ వాటాను పొందడమే కాకుండా, ఫండ్స్‌ ఖర్చులను కూడా మెరుగుపరుచుకున్నాయి. అందువలన ప్రస్తుతం ఈ కంపెనీలు మంచి స్థాయిలో ఉన్నాయి. ఈ కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు మించి ఉన్నాయి. వీటితోపాటు బేష్‌ ఎఫెక్ట్‌ పనిచేయడం వలన వచ్చే రెండు మూడు త్రైమాసికాలలో ఈ సెక్టార్‌లో వృద్ధి కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం వ్యవస్థలోకి నిధులను పంప్‌చేసింది. అందు వలన ఈ సెక్టార్‌ వృద్ధి వేగ తరమవుతుంది. ఖరిఫ్‌ పంట చేతికందడంతో జనవరి-ఫిబ్రవరి సమయంలో వినియోగం కూడా పెరగడం మొదలవుతుంది. ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్లో పెద్ద కంపెనీల రిటర్న్‌ రేషియో మెరుగుపడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ఎన్‌సీఎల్‌టీకి వెళ్లిన కంపెనీల రిజల్యూషన్‌ ఒక రూపును సంతరించుకుంది. ఇన్వెస్టర్లు ఈ స్టాకులలో ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

డిజిన్వెస్ట్‌మెంట్‌..
డిజిన్వెస్ట్‌మెంట్‌ పక్రియ  క్యాబినెట్లో క్లియర్ కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ స్టాక్స్‌ ప్రస్తుత స్థాయిల నుంచి పెరగడానికి ప్రాథమిక కారణమంటు ఏమి కనిపించడం లేదు. డిజిన్వెస్ట్‌ చేయనున్న కంపెనీల పేర్లు పబ్లిక్‌కు అందుబాటులో ఉంచినప్పటి నుంచి ఈ షేర్లు పెరగడం చూశాం. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఆర్థిక మంత్రి, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబం‍ధించిన ఆర్థిక లక్ష్యాలను మార్చాలనుకోవడం లేదని చెప్పడంతో కొంత మొత్తంలో వాటాను విక్రయించడం లేదా నిధులను సమకూర్చుకునే ప్రణాళికలను ప్రభుత్వం వేస్తోందని అర్థమవుతుంది. ఇది ఈ స్టాకులపై సానుకూల ప్రభావం చూపుతుంది.You may be interested

బీపీసీఎల్‌ 4 శాతం అప్‌

Wednesday 20th November 2019

కంపెనీలో కేంద్రం వాటా విక్రయ వార్తలతో గత కొద్దిరోజులుగా ర్యాలీ చేస్తున్న బీపీసీఎల్‌ షేరు బుధవారం అదే జోరును కనబరుస్తుంది. నేడు ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ.519.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడంతో పాటు నేడు జరిగే కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయం అంశంపై చర్చించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయిల్‌ కంపెనీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది.

టాప్‌ 6 ఆయిల్‌ దిగ్గజాల్లో ఆర్‌ఐఎల్‌

Wednesday 20th November 2019

తాజా ర్యాలీతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ అంతర్జాతీయ ఆరు చమురు దిగ్గజాల్లో స్థానం దక్కించుకుంది. ఆర్‌ఐఎల్‌ షేరు కదం తొక్కుతుండడంతో బీపీ సంస్థను తోసిరాజని రిలయన్స్‌ ప్రపంచంలో ఆరో అతిపెద్ద చమురు కంపెనీగా అవతరించింది. బీపీ మార్కెట్‌ క్యాప్‌ 13200 కోట్ల డాలర్లుండగా, మంగళవారం ఆర్‌ఐఎల్‌ 13300 కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించింది. మరోవైపు నష్టాల ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో బీపీ షేరు పడిపోవడం ఆ కంపెనీ వాల్యూను

Most from this category