News


ఇండెక్స్‌ చూడొద్దు..మంచి షేర్లను అన్వేషించాలి

Tuesday 20th August 2019
Markets_main1566296537.png-27893

ప్రస్తుత పరిస్థితులలో మార్కెట్‌ ఎటువెలుతుందో అంచనా వేయడం కంటే నిర్దిష్ట స్టాక్స్‌లలో అవకాశాలను పరిశీలించడం మంచిదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెమాంగ్‌ జానీ ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

ప్రభుత్వం చేతుల్లో మార్కెట్‌ ప్రదర్శన..
మందగమనాన్ని ఎదుర్కొంటున్న రంగాలకు ఉద్దీపనలను అందించడంతో పాటు పన్నులు, సర్‌చార్జీల నుంచి కొంత ఉపశమననాన్ని కలిగించేంత వరకు దేశియ మార్కెట్‌ అద్వాన్న ప్రదర్శననే చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతుంది. అంతేకాకుండా విస్తృత దృక్పథంలో ఈ ఆదాయాల సీజన్‌ నిరాశపరిచింది. ఆర్థిక సంవత్సరం 2020 నాటి కార్పొరేట్‌ ఆదాయాల అంచనాలలో 4 శాతం నుంచి 5 శాతం తగ్గింపును చూడవచ్చు. కార్పోరేట్‌ ఆదాయాలు, ప్రభుత్వం నుం‍చి వెలువడే ప్యాకేజీ లేదా ప్రకటనలపై స్పష్టత వచ్చేంత వరకు మార్కెట్‌ సెంటిమెంట్‌లో ఎటువంటి పెద్ద మార్పు కనిపించదని అంచనావేస్తున్నాం. సమీప కాలంలో మార్కెట్‌ అండర్‌ పెర్ఫార్మన్స్‌లో ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో మార్కెట్‌ ఇండెక్స్‌ ఎటువెళుతుందో అంచనా వేయడం కంటే నిర్ధిష్ట స్టాక్స్‌లలో ఉన్న అవకాశాలను గమనించాలి.

ఆటో రంగంలో.. ఆశలు 
ఆటో రంగంలోని కంపెనీల షేర్లు తాజాగా అవి చేరుకున్న కనిష్టాల నుంచి 4 శాతం మేర కోలుకున్నాయి. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ప్రయాణీకుల వాహనాల కంపెనీలు తిరిగి పుంజుకోనున్నాయని నివేదికలు వెలువడడం దీనికి కారణమయ్యుండొచ్చు. దీనితో పాటు పండుగ సీజన్‌ కావడం వలన వాహన విక్రయాలు పెరుగుతాయని కొంతమంది ఆశపడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఈ రంగంలోని మందగమనాన్ని తిప్పికొట్టడానికి ఒక ప్యాకేజీని ప్రకటిస్తుందని అభిప్రాయపడడం కూడా ఆటో ఇండెక్స్‌ తిరిగి కోలుకోడానికి కారణం కావచ్చు. గత కొన్ని నెలల నుంచి ఈ రంగం చాలా నష్టపోయింది. ఫలితంగా కొంత పుల్‌ బ్యాక్‌ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆటో రంగంలో స్థిరమైన పునరుజ్జీవనం ఉంటుందని అనుకోవడం లేదు. 
  వీటికి తోడు గత ఆరు నుంచి ఎనిమిది నెలల సమాచారాన్ని పరిశీలించినట్టయితే, ద్విచక్రవాహన అమ్మకాలు, కార్లు, వాణిజ్య వాహనాల(సీవీ) అమ్మకాల కంటే అధికంగా తగ్గిన విషయం అర్థమవుతుంది. ఫలితంగా బజాజ్‌ ఆటో వంటి స్టాక్స్‌ కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ఫోర్‌ విలర్స్‌ వాహనాల్లో గత ఎడెనిమిది నెలలో దిద్దుబాటుకు గురయ్యాయి. మారుతి వంటి ఆటోదిగ్గజ కంపెనీలు రాబోయే 6 నుంచి 12 నెలల్లో తమ వృద్ధి సంఖ్యలు ఎలా ఉంటాయో మేనేజ్‌మెంట్‌ కూడా ఖచ్చితంగా అంచనావేయడం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఫోర్‌ వీలర్స్‌ పనితీరు అండర్‌ పెర్ఫార్మ్‌న్సలో ఉండే అవకాశం ఉంది. మరికొంత కాలం పాటు టూ, ఫోర్‌ వీలర్స్‌ మధ్య ఈ తేడా ఉండవచ్చు.

ప్రభుత్వ చర్యలు లేకపోతే?
ఎఫ్‌పీఐ(విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్స్‌)లపై, కార్పోరేట్‌ సెక్టార్‌పై విధించిన సర్‌చార్జీ కారణంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ తీవ్రంగా దెబ్బతింది. అంతేకాకుండా వ్యవస్థలో ఆర్థిక మందగమనం ప్రభుత్వానికి స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం నుంచి ఎఫ్‌పీఐల సర్‌చార్జీపై గాని, ఎల్‌టీసీజీ(లాంగ్‌ టెర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌)పై ఎటువంటి ప్రకటనలు వెలువడకపోతే ప్రస్తుతం ఉన్న బలహీన మార్కెట్‌ సెంటిమెంట్‌ మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు మార్కెట్‌ పతనాన్ని ఎదుర్కొంది కాబట్టి వచ్చే మూడు లేదా ఆరు లేదా ఎనిమిది నెలలో తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.You may be interested

మారుతి జోరు..

Tuesday 20th August 2019

ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు అనుగుణంగా ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉండడంతో ఆటో సెక్టార్‌లో కంపెనీ అయిన మారుతి సుజుకి ఇండియా మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ట్రేడవుతోంది. దేశీయ మార్కెట్‌ అమ్మకాల ఒత్తిడితో క్షీణిస్తుండగా మారుతి సుజుకీ మాత్రం లాభల్లో ఉన్న నిఫ్టీ50 షేర్లలో ముందుంది. ఈ షేరు మధ్యాహ్నాం 1.00 సమయానికి 2.55 శాతం లాభపడి రూ. 6,135.00 వద్ద ట్రేడవుతోంది. ఈ సెషన్‌లో రూ. 5,982.55 వద్ద ప్రారంభమైన ఈ

యస్‌ బ్యాంక్‌ షేర్లకు సీజీ పవర్‌ షాక్‌ ..!

Tuesday 20th August 2019

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ జరిపిన నేరపూరిత ఉదంతం యస్‌ బ్యాంక్‌ షేర్లకు షాక్‌ ఇచ్చింది. కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌పై ఆందోళనలు తెరపైకి రావడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం 6శాతం పతనయ్యాయి. సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీకి చెందిన ఉద్యోగులు కొందరు గత రెండేళ్లుగా అనధికారిక లావాదేవీలు జరిపినట్లు రిస్క్‌ అండ్‌ బ్యాలెన్స్‌ కమిటీ తెలిపింది. ఈ నేరపూరిత వ్యవహారం ద్వారా కంపెనీ అప్పులను తగ్గించి చూపడమే కాకుండా

Most from this category