News


వైరస్‌ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌ సరిపోదు: రాజన్‌

Thursday 26th March 2020
Markets_main1585247210.png-32696

భారత్‌లో ప్రకటించిన లౌక్‌డౌన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని, వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఈ చర్య ఒక్కటి సరిపోదని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అన్నారు. ‘‘ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే లౌక్‌డౌన్‌ ప్రజలను పనులకు వెళ్లకుండా ఇళ్లకే కట్టిపడేసింది. అదేమీ అత్యంత సురక్షిత ప్రదేశం కాదు. ప్రజలు మురికివాడల్లోనూ నివసిస్తున్నారు’’ అని రాజన్‌ బ్లూంబర్గ్‌ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు. ఇన్ఫెక్షన్లను విస్తరించకుండా చూడడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

ప్రభుత్వం ప్రకటించిన లౌక్‌డౌన్‌ సమాజంలోని పేద వర్గాలకు ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతుందన్నారు రఘురామ్‌ రాజన్‌. దేశవ్యాప్తంగా 21 రోజుల లౌక్‌డౌన్‌ (ఏప్రిల్‌ 14 వరకు)ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిత్యం శ్రమిస్తే గానీ జీవనం సాగించలేని కోట్లాది మందికి తీవ్ర కష్టకాలం ఇది. వీరిని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. భారత జనాభా 130 కోట్లకు పైగా ఉండడంతో కోవిడ్‌-19 విస్తరణ ‍ప్రమాదం ఎక్కువ అని రాజన్‌ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు బలహీనంగా ఉండడం కోవిడ్‌పై పోరాటానికి ఇబ్బంది కలిగించొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని వనరులను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

లౌక్‌డౌన్‌ సమయంలో జీవనోపాధి ఆగిపోయిన వారు కూడా జీవనం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందని, అటువంటి వారు నివసించే ప్రాంతాలకు ఆహార సరఫరా, సేవలను అందించడం అతిపెద్ద సవాలుగా రాజన్‌ పేర్కొన్నారు. తదుపరి మూడు వారాల్లో భారత్‌ ఈ పరిస్థితిని ఎదుర్కొంటుందని అంచనా వేశారు. భారత్‌లో రెండో, మూడో విడత కరోనా వైరస్‌ విజృంభణకు అవకాశాలున్నాయని, వైరస్‌ నియంత్రణపై చైనా సాధించిన ‍పురోగతిపై అందరూ దృష్టి సారించాలని ఆయన సూచించారు. సంపన్న దేశాలు ఈ సమయంలో పేద దేశాలకు నిధుల సాయం అందించాలని, అప్పుడు ఆయా దేశాలు మహమ్మారిపై పోరాటం చేయగలవన్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని 2008 ఆర్థిక మాంద్యంతో పోల్చి చూడడం సరికాదన్నారు. దేశాల మధ్య వైరస్‌ నియంత్రణ విషయంలో సమన్వయం లోపించినట్టు చెప్పారు. ‘‘కోవిడ్‌-19 వైరస్‌ను ప్రపంచం నుంచే నిర్మూలించాలి. లేదంటే ఇది తిరిగి మళ్లీ ప్రవేశించి దెబ్బతీస్తుంది’’అని రాజన్‌ హెచ్చరించారు. You may be interested

మల్టీ బ్యాగర్ల వేటలో రిటైల్‌ ఇన్వెస్టర్లు

Friday 27th March 2020

మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ ఏమున్నాయి..? అంటూ గూగుల్‌ సెర్చ్‌ బార్‌లో వెతుకుతున్నారా..? గూగుల్‌ ట్రెండ్స్‌ను గమనిస్తే.. మల్టీబ్యాగర్ల కోసం అన్వేషణ తారా స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. మార్కెట్లు కరెక్షన్‌కు గురైన సందర్భాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. మల్టీబ్యాగర్ల కోసం అన్వేషణ గరిష్ట స్థాయికి చేరడం చివరిగా 2019 ఏప్రిల్‌లో జరిగింది. అప్పుడు మార్కెట్లు పతన బాటలోనే ఉన్నాయి. నిఫ్టీ 11856 పాయింట్ల నుంచి 11,108 పాయింట్లకు నాడు క్షీణించింది. కొన్న ధర

మూడో రోజూ ముచ్చట- మార్కెట్‌ జూమ్‌

Thursday 26th March 2020

బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ దన్ను మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ 4 శాతం అప్‌ సెన్సెక్స్‌ 1411 పాయింట్లు హైజంప్‌ 324 పాయింట్లు ఎగసిన నిఫ్టీ ఇండస్‌ఇండ్‌ 46 శాతం దూకుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు మరోసారి జోరు చూపాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఇండెక్సులు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్‌  1411 పాయింట్లు దూసుకెళ్లి 29,947 వద్ద నిలవగా.. నిఫ్టీ 324 పాయింట్లు జంప్‌చేసింది.

Most from this category