News


స్పందన స్ఫూర్తి రూ.360కోట్ల నిధుల సమీకరణ

Saturday 3rd August 2019
Markets_main1564822236.png-27524

యాంక‌ర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపుల ద్వారా రూ.360.28 కోట్లను స‌మీక‌రించిన‌ట్లు స్పందన స్ఫూర్తి కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 42లక్షల ఈక్విటీ షేర్లను అప్పర్‌ ప్రైజ్‌ బాండ్‌ రూ.856 వద్ద కేటాయింపు ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. వెల్స్‌ ఫార్గో ఎమర్జింగ్‌ మార్కెట్స్‌ ఈక్వటీ ఫండ్స్‌, ఫ్లోరిడా రిటైర్‌మెంట్‌ సిస్టమ్స్‌, బజాజ్‌ అలియన్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలతో సహా మరో 15 యాంకర్‌ ఇన్వెస్టింగ్‌ సంస్థల నుంచి ఈ పెట్టుబడులను సమీకరించినట్లు కంపెనీ పేర్కోంది. 
సోమవారం నుంచి స్పందన స్ఫూర్తి ఐపీఓ:-
ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా ఏర్పాటైన మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ స్పందన స్ఫూర్తి పబ్లిక్‌ ఇష్యూ ఆగస్ట్‌ 5న(సోమవారం) ప్రారంభం కానుంది. ఇదే నెల 7న ముగియనున్న ఈ ఐపీఓ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.1200 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తుంది. షేరు ధరల శ్రేణి రూ.853-856గా నిర్ణయించింది. యాక్సిస్‌ క్యాపిటల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సంస్థకు లీడ్‌ మేజనర్లుగా వ్యవహరించనున్నాయి. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మూలధన పెంపునకు, కార్పోరేట్‌ అవసరాలకు వినియోగించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ నెల 19న కంపెనీ ఎక్చ్సేంజీల్లో కంపెనీ షేర్లు లిస్ట్‌ కానున్నాయి. 



You may be interested

డిసెంబర్‌కల్లా 10,300 స్థాయికి నిఫ్టీ!

Saturday 3rd August 2019

కొత్త ఇన్వెస్టర్లు పెట్టుబడులలో 1 శాతం రిస్క్‌ మాత్రమే తీసుకోండి మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు బేర్‌ మార్కెట్లో కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నాయని సామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. 12,000 మార్కు ఇక కలే!  బడ్జెట్‌ తర్వాత నుంచి మార్కెట్లు గణనీయంగా పడిపోతున్నాయి. ఇప్పటి వరకు బీఎస్‌ఈలో ఏకంగా రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. ముందుకు

11000 దిగువుకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Saturday 3rd August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 11000ల దిగువను ముగిసింది. రాత్రి సింగపూర్‌ మార్కెట్లో 10,976.50 వద్ద స్థిరపడింది. . ఇది నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11024)తో పోలిస్తే 48 పాయింట్ల నష్టంతో ఉందనే విషయాన్ని గమనించాలి. జాతీయ, అం‍తర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికా మరోసారి చైనాపై మరోసారి ట్రేడ్‌వార్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యాయి. ఆసియా

Most from this category