News


ఈవారం మార్కెట్‌ను ప్రభావితం చేసిన 10 స్టాకులు

Saturday 10th August 2019
Markets_main1565430974.png-27686

 ప్రభుత్వం మార్కెట్లకు అనుకూలమైన  చర్యలను చేపట్టనుందనే వార్తల నేపథ్యంలో గురువారం, శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా ముగిశాయి. ఫలితంగా గత నాలుగు వారాల పాటు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈ వారం గణనీయంగా పుంజుకున్నాయి. ఆర్థిక శాఖ అధికారులు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఆందోళనలపై చర్చించేందుకు శుక్రవారం వీరిని కలిశారు. అంతేకాకుండా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ప్రభుత్వం అనేక దశలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడడంతో మార్కెట్లు గత రెండు సెషన్‌ల నుంచి పాజిటివ్‌గా ముగిశాయి. ఈ వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు లేదా 1.24 శాతం పెరిగి 37,581 వద్దకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 112.30 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగి 11,109 కు చేరుకుంది.

వారమంతా మార్కెట్‌పై ప్రభావం చూపిన స్టాక్‌ల జాబితా: 
జమ్మూ అండ్‌ కాశ్మీర్ బ్యాంక్:  ఈ బ్యాంక్‌ స్టాక్‌ ఈ వారం 25.28 శాతం పెరిగింది. ఇప్పటి వరకు జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌ను ప్రైవేటు రంగ సంస్థగా పరిగణించేవారు. కానీ తాజా పరిణామాల వలన జమ్మూ-కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో, వాటాదారుల మార్పు జరుగుతుందని, తర్వాత ప్రభుత్వం ఈ బ్యాంకులోకి ఈక్విటీని చొప్పించగలదని మార్కెట్లు ఆశిస్తున్నాయి. సెక్రటరీ ఫైనాన్స్‌ వాటా 3.34 శాతంతో కలిపి ఈ బ్యాంకులో రాష్ట్ర ప్రభుత్వం 59.23 శాతం వాటాను కలిగి ఉంది.

అఫ్ఫెల్‌ ఇండియా: ఈ కంపెనీ బీఎస్‌ఈలో నమోదయ్యాక అధికంగా లాభాలను ఆర్జించింది. తర్వాత  ఈ కంపెనీ షేరు విలువ తగ్గింది. కంపెనీ ఇష్యు ధర రూ. 745 కాగా 33 శాతం పెరిగి రూ.930 కు చేరుకుంది. ఈ వారం ఈ షేరు రూ. 842 వద్ద ముగిసింది. ఈ ధర ఇష్యు ధర కంటే 13 శాతం అధికం కావడం విశేషం.

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్: లక్ష్మి విలాస్ బ్యాంక్‌(ఎల్‌వీబీ)తో విలీనం కావడానికి ఆర్‌బీఐ అనుమతి పొందే ప్రయత్నంలో, ఇండియాబుల్స్ వ్యవస్థాపకుడు సమీర్ గెహ్లాట్ సంస్థలోని అన్ని నియంత్రణ, హక్కులను వదులుకుంటానని సెంట్రల్ బ్యాంకుకు హామీ ఇచ్చారు. ఈ వారం ఈ స్టాకు 3 శాతం పెరిగి రూ .505.60 స్థాయికి చేరుకుంది. ఎల్‌వీబీ ఈ వారంలో 5.66 శాతం పడిపోయి రూ .40.80 స్థాయికి చేరుకుంది.

హీరో మోటోకార్ప్: అసాధరణ లాభం(ఆస్తుల విక్రయాలు) రూ. 737.50 కోట్లుగా ఉండడంతో ఈ కంపెనీ క్యూ1 లాభం ఏడాది ప్రాతిపదికన 38. 28 శాతం పెరిగి రూ. 1,257 కోట్లకు చేరుకుంది. కానీ మిగిలిన విభాగాలలో ఈ కంపెనీ ఫలితాలు నిరాశపరిచాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 8,810 కోట్లుగా నమోదైన ఆపరేషనల్‌ ఆదాయం, ఈ జూన్‌ త్రైమాసికంలో రూ .8,030 కోట్లకు పడిపోయింది. ఈ వారం ఈ స్టాకు  9.14 శాతం పెరిగి రూ .2,621 కు చేరుకుంది. 

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఈ ఐటీ కంపెనీ క్యూ1 ఫలితాలు బాగుండడంతో ఈ కంపెనీ స్టాకు ఈ వారం 7 శాతం పెరిగింది. స్థిరమైన కరెన్సీ వద్ద ఆర్థిక సంవత్సరం 2020 ఆదాయం, 14-16 శాతం పరిధిలో పెరుగుతుందని హెచ్‌సీఎల్‌  అంచనా వేసింది. 

ఇన్ఫిబీమ్ అవెన్యూస్: డిజిటల్ చెల్లింపుల విభాగంలో లావాదేవీల వృద్ధి బాగుండడంతో ఈ కంపెనీ తన ఏకీకృత లాభంలో 129 శాతం వృద్ధి సాధించి రూ .28.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఫలితంగా ఈ స్టాకు ఈ వారం 10.77 శాతం పెరిగి రూ .44.20 కు చేరుకుంది.

ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్: మార్కెట్లు శుక్రవారం పుంజుకోవడంతో, ఈ స్టాక్ ఈ వారపు నష్టాలను 9.57 శాతానికి తగ్గించుకోగలిగింది. టైర్ తయారీలో విభాగంలో అడుగుపెట్టాలనుకునే నిర్ణయాన్ని మేనేజ్మెంట్ మార్చుకోవడంతో ఈ స్టాక్ తిరిగి కోలుకుంది. ఈ కంపెనీ స్టాకు ఈ వారం రూ. 848 వద్ద ముగిసింది.

జిందాల్ స్టీల్ అండ్‌ పవర్: ఈ వారం జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ 16.65 శాతం పడిపోయి రూ. 99.60 చేరుకుంది. ఈ కంపెనీ తన రుణ చెల్లింపులు చేయలేకపోయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రుణదాతల వద్ద సెక్యురిటీగా ఉన్న షేర్ల అమ్మకాల గురించి నివేదికలు వచ్చాయి. సంస్థ వీటిని కేవలం పుకార్లని, వీటిని నమ్మోద్దని ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చింది.

వొడాఫోన్ ఐడియా: బ్రోకరేజి సంస్థలు ఈ కంపెనీ రేటింగ్‌ను  తగ్గించడంతో ఈ కంపెనీ షేరు ఈ వారం 15 శాతం పడిపోయి రూ. 5.4 వద్ద ముగిసింది. బలహీనమైన ఆర్థిక పనితీరు కారణంగా, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ గురువారం ప్రతికూల దృక్పథంతో 'కేర్ ఎ' రేటింగ్‌కు ఈ కంపెనీ రేటింగ్‌ను తగ్గించింది. ఈ వారం ప్రారంభంలో, క్రిసిల్ వోడాఫోన్ ఐడియా క్రెడిట్ విలువను తగ్గించిన విషయం తెలిసిందే.

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్: కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణం తర్వాత ఈ స్టాక్‌ భారీగా పతనమయ్యింది. ఈ వారం ఈ స్టాకు 26.57 శాతం క్షీణించి రూ .73.40 స్థాయికి చేరుకుంది. దివంగత ఛైర్మన్ వీజీ సిద్ధార్థ లేఖలో చేసిన ప్రకటనలకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి సంస్థ ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ను(ఈవై) నియమించింది. ఈవై, కాఫీ డే, దీని అనుబంధ సంస్థల పుస్తకాలను కూడా పరిశీలిస్తుందని కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.You may be interested

అవెన్యూ సూపర్‌మార్ట్‌లో ఒకశాతం వాటా విక్రయించిన దమానీ

Saturday 10th August 2019

డీ-మార్ట్‌ రిటైల్‌ మాల్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్‌ లిమిటెడ్‌ ప్రధాన ప్రమోటర్ల ఒకరైన రాధాకృష్ణ దమానీ 1శాతం వాటాను విక్రయించారు. ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో దమానీ ఆగస్ట్‌ 09న ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో 1శాతం వాటాకు సమానమైన మొత్తం 62.3లక్షల ఈక్విటీ షేర్లను ప్రతిషేరు ధర రూ.1,404.10 వద్ద రూ.561.64 కోట్లకు విక్రయించినట్లు బీఎస్‌ఈలో గణాంకాలు తెలియజేశాయి. అయితే, వాటాను కొనుగోలు చేసినవారి పేరు తెలియలేదు. పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నియమనిబంధనలకు

11100ల దిగువుకు ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ఇండెక్స్‌

Saturday 10th August 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 11100ల దిగువన ముగిసింది. సింగపూర్‌లో ట్రేడింగ్‌ ముగిసే సరికి 11,089.50 వద్ద స్థిరపడింది. ఇది(11,089.50) నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11123)తో పోలిస్తే 33.50పాయింట్లు తక్కువ. జాతీయ, అం‍తర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం నష్టంతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.అమెరికా చైనాల దేశాల మధ్య సెప్టెంబర్‌లో జరగాల్సిన వాణిజ్య పరిష్కార చర్చలు రద్దు అయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు

Most from this category