STOCKS

News


15-35 శాతం రాబడులనిచ్చే 3 స్టాకులు!

Monday 7th October 2019
Markets_main1570444659.png-28754

గత కొన్ని సెషన్ల నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా చాలా వరకు స్టాకులు రోజువారి చార్టులో ట్రెండ్‌ రివర్సల్‌ను ఏర్పర్చాయి. ప్రస్తుతం ఈ స్టాకులను కొనుగోలు చేయడం మంచిదని నార్నోలియ ఫైనాన్సియల్‌ అడ్వజర్స్‌, టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్‌ రిసెర్చ్‌ హెడ్‌ షబ్బిర్‌ ఖయ్యుమి అన్నారు. సాంకేతిక విశ్లేషణ ఆధారంగా సమీప కాలంలో 15-35 శాతం రిటర్న్‌లివ్వగలిగే 3 స్టాకులను సిఫార్సు చేశారు. 
ముంజాల్‌ ఆటో ఇండస్ట్రీస్‌: సుమారు రూ. 37 వద్ద కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 50; స్టాప్‌ లాస్‌: రూ. 31; అప్‌సైడ్‌ 35 శాతం వరకూ వుండవొచ్చు.
ఈ స్టాక్‌ రోజువారి చార్టులో ‘కప్‌ అండ్‌ హ్యాండిల్‌’ నమూనాను ఏర్పరిచింది. ప్రస్తుతం ఈ నమూనా బ్రేక్‌ఔట్‌కు సిద్ధంగా ఉంది. ఇది సాధరణంగా బుల్లిష్‌ ట్రేండ్‌ను తెలుపుతుంది. అంతేకాకుండా ఈ స్టాక్‌ తన కీలక నిరోదమైన 50 ఎస్‌ఎంఏ(సింపుల్‌ మూవింగ్‌ యావరేజ్‌)ని అధిగమించింది. ఇది స్వల్పకాల అప్‌ ట్రెండ్‌ కదలికలను సూచిస్తోంది. మూమెంటం ఇండికేటర్‌ ఏంఏసీడీ(మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌, డైవర్జన్స్‌) సిగ్నల్‌ లైన్‌ను దాటింది. ఇది ట్రెండ్‌ ప్రారంభానికి సూచిక. ఈ స్టాక్‌ను రూ. 37 వద్ద కొనుగోలు చేయమని మేము సిఫార్సు చేస్తున్నాం. 
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌: సుమారుగా రూ. 37 వద్ద కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 48; స్టాప్‌ లాస్‌: రూ. 32; అప్‌సైడ్‌: 29 శాతం
 ఈ స్టాక్‌ రోజువారి చార్టులో ‘డబుల్‌ బాటమ్‌’ నమూనాను ఏర్పరిచింది. ఇది సాధరణంగా ట్రెండ్‌ రివర్సల్‌కు సూచీక. స్వల్పకాల మూమెంటం కోసం కీలక నిరోధమైన 50 ఎస్‌ఎంఏ స్థాయిని దాటడం చాలా ముఖ్యం. ఆర్‌ఎస్‌ఐ(రిలేటివ్‌ స్ట్రెంథ్‌ ఇండెక్స్‌) డెవర్జన్స్‌ కూడా డబుల్‌ బాటమ్‌ను ఏర్పరిచింది. ఇది అప్‌మూవ్‌కు సంకేతం. మేము ఈ స్టాక్‌ను రూ. 37 వద్ద  కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నాం. 
అమర్‌రాజా బ్యాటరీస్‌:  రూ. 670 వద్ద కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 770; స్టాప్‌ లాస్‌: రూ. 620; అప్‌సైడ్‌: 15 శాతం
ఈ స్టాక్‌ తన గరిష్ఠ స్థాయి రూ. 744 నుంచి దిద్దుబాటుకు గురయ్యి, గతంలో రోజు వారి చార్టులో ఏర్పాటు చేసిన ‘కప్‌ అండ్‌ హ్యండిల్‌’ నమూనా బ్రేక్‌ఔట్‌ స్థాయివద్ద స్థిరపడింది. ఆర్‌ఎస్‌ఐ(రిలేటివ్‌ స్ట్రెంథ్‌ ఇండెక్స్‌) 50 పైన ఉండగా, ఎంఏసీడీ ట్రెండ్‌ రివర్సల్‌ను సూచిస్తోంది. ఇది అప్‌మూవ్‌కు సంకేతం. అంతేకాకుండా ఈ స్టాక్‌కు 200 డీఎంఏ(డే మూవింగ్‌ యావరేజ్‌) వద్ద మద్ధతు లభించగా, ఇది అప్‌సైడ్‌ బుల్లిష్‌ కదలికను తెలుపుతోంది. ఈ స్టాక్‌ రోజువారి చార్టు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు, దీని తాజా ట్రేడింగ్‌ పరిమాణం సైతం బావున్నందున ఈ స్టాక్‌ను సుమారు రూ. 670 వద్ద కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నాం. You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

Monday 7th October 2019

లాభాల మార్కెట్లోనూ ప్రభుత్వరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ 1శాతం నష్టంతో 2156.20 వద్ద ట్రేడ్‌ అవుతోం‍ది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేరైన సిండికేట్‌ బ్యాంక్‌ 3.50శాతం నష్టపోయింది. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 2.50శాతం క్షీణించాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ఆరేళ్ల కనిష్టానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Monday 7th October 2019

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సేవలను అందించే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌‍ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం ఉదయం సెషన్‌లో ఆరేళ్ల కనిష్టానికి పతమయ్యాయి. కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ ఎస్సెల్‌ మీడియా వెంచర్‌  తన మొత్తం వాటాలో 10.71శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను వీటీబీ క్యాపిటల్‌ వద్ద తనఖా పెట్టినట్లు శుక్రవారం జీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో పునీత్‌ గోయెంకా కంపెనీ తెలిపారు. కంపెనీలో 90శాతం ప్రమోటర్లు కంపెనీ చెందిన 22 శాతం

Most from this category