News


రూ.2 లక్షలకోట్ల సంపద కోల్పోయిన ఎల్‌ఐసీ

Monday 23rd March 2020
Markets_main1584953773.png-32636

కరోనా వైరస్‌ దాటికి ప్రపంచ మార్కెట్లు కుప్పకూలడం, ప్రపంచ కుబేరుల సంపద ఆవిరైపోతున్న తరుణంలో తాజాగా లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ)సంపదలో రూ.2 లక్షల కోట్లను కోల్పోయింది. కరోనా ప్రభావంతో ఎల్‌ఐసీ తన ఈక్విటీ పోర్ట్‌పోలియోలో రూ.1.84 లక్షల కోట్లను కోల్పోయింది.  ప్రపంచ, దేశీయ ఆర్థిక వృద్ధిపై కరోనా ప్రభావం పడడంతో కుబేరులతోపాటు కంపెనీలు తమ సంపదను కోల్పోతున్నాయి. వార్షిక ప్రాతిపదికన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు మార్చి 20నాటికి 25 శాతం క్షీణించాయి. దీంతో దాదాపు 94 శాతం ఎల్‌ఐసీ షేర్ల ధరలు భారీగా పతన మవడంతో ఇంత పెద్ద మొత్తంలో సంపద కోల్పోవాల్సి వచ్చింది. గతేడాదిడి సెంబర్‌లో రూ.6.04 లక్షల కోట్లుగా ఉన్న ఎల్‌ఐసీ హోల్డింగ్‌ సంపద  30.46 శాతం క్షీణించి రూ.4.20 లక్షల కోట్లకు చేరింది. కాగా ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీల షేర్ల ధరలు 70 శాతం పతనమైతే, రిలయన్స్‌ పవర్‌ 66 శాతం, టాటా కెమికల్స్‌ 66 శాతం తమ షేర్ల విలువను కోల్పోయాయి. 


LIC

You may be interested

మిడ్‌ క్యాప్స్‌ మహాపతనం

Monday 23rd March 2020

బీఎస్‌ఈ-500లో పలు షేర్లు బోర్లా ఫైనాన్షియల్‌ కౌంటర్లకు నష్టాల షాక్‌ 50-75 శాతం మధ్య డౌన్‌ కరోనా సృష్టిస్తున్న విలయానికి వణుకుతున్న ప్రపంచ దేశాల  సరసన తాజాగా ఇండియా చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకీ కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లలో మరోసారి ఆందోళనలు పెరిగాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు తాజాగా ఏకంగా 12 శాతంపైగా కుప్పకూలాయి. కొద్ది రోజులుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారనున్న అంచనాలతో

3వేల పాయింట్లు పతనమైన బ్యాంక్‌ నిఫ్టీ..!

Monday 23rd March 2020

మార్కెట్‌ మహాపతనంలో భాగంగా సోమవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 15శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా 17రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చి 31 వరకు ఈ

Most from this category