News


ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల పరుగు...

Monday 23rd September 2019
Markets_main1569260981.png-28502

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ 2018 నుంచి చూసుకుంటే ఇంత వరకు పెద్దగా లాభాలను ఇచ్చింది లేదు. కానీ, బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ అప్రతిహతంగా ముందుకు సాగిపోతూనే ఉంది. మార్కెట్లలో గత ఏడాదిన్నరగా తీవ్ర అస్థిరతలు నెలకొని ఉన్నప్పటికీ... ఎల్‌ఐసీ గత మూడేళ్లలో తన ఈక్విటీ ఆస్తులను గణనీయంగా పెంచుకున్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. 

 

పాలసీ ప్రీమియం రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఎల్‌ఐసీ ఎన్నో సాధనాలపై ఇన్వెస్ట్‌ చేస్తుంటుంది. అందులో ఈక్విటీ పెట్టుబడులు కూడా ఒకటి. ఈక్విటీల్లో ఎల్‌ఐసీకి ఉన్న పెట్టుబడుల విలువ జూన్‌ త్రైమాసికం (2019-20) నాటికి రూ.5.98 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. 2016 జూన్‌ త్రైమాసికం నాటికి ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ సుమారుగా రూ.3.6 లక్షల కోట్లు. మరి ఈ ఏడాది జూన్‌ నాటికి మూడేళ్లలో 63 శాతం పెరగడం విశేషం. ఒక్క 2018-19లోనే ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.74,781 కోట్ల మేర వృద్ధి చెందింది. ముఖ్యంగా ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ మధ్య కాలంలో ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.22,506 కోట్లు క్షీణించింది. అంటే ఈ కాలంలో అస్థిరతలు ఎక్కువగా ఉండడం తెలిసిందే. అయినా మూడేళ్ల సగటు కాలంలో ఎల్‌ఐసీ పెట్టుబడులు మంచి రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలంలో అస్థిరతలను అధిగమించి రాబడులను అందుకోవచ్చనడానికి ఇదొక నిదర్శనం.

 

ఎల్‌ఐసీ తన ఈక్విటీ పెట్టుబడులను ఏటా రూ.60,000 కోట్లు కంటే తక్కువకే పరిమితం చేయాలని భావిస్తుండగా.. మరోవైపు ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడులు బాగానే రాణిస్తున్నాయని తెలుస్తోంది. గత మూడేళ్లలో సెన్సెక్స్‌ 26,999 నుంచి 39,394కు పెరిగింది. ఎల్‌ఐసీ పనితీరు ఇంత కంటే గొప్పగా ఉంది. సెంటిమెంట్‌ బుల్లిష్‌గా ఉన్నప్పుడు షేర్లను విక్రయించడం, బేరిష్‌గా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం అనే విధానాన్ని ఎల్‌ఐసీ తన ఈక్విటీ పెట్టుబడులకు పాటిస్తోంది. ఈ సంస్థ ఏటా రూ.50,000-60,000 కోట్ల చొప్పున ఈక్విటీలపై పెట్టుబడులు పెడుతోంది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ ఇప్పటి వరకు రూ.21,600 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 51 శాతం వాటా తీసుకుని ప్రమోటర్‌గా మారిన విషయం కూడా తెలిసిందే.



You may be interested

థామస్‌ కుక్‌ దివాలా

Tuesday 24th September 2019

ఆరు లక్షల మంది పర్యాటకులకు ఇబ్బంది  22 వేల ఉద్యోగాలు పోతాయ్‌- గోవా పర్యాటకంపై పెను ప్రభావం  మాది వేరే కంపెనీ థామస్‌ కుక్‌ ఇండియా స్పష్టీకరణ లండన్‌: ప్రముఖ బ్రిటిష్‌ పర్యాటక సంస్థ, థామస్‌ కుక్‌ దివాలా తీసింది. దీంతో దాదపు ఆరు లక్షల మంది పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌కు చెందిన లక్షన్నరకు పైగా యాత్రికులు వివిధ దేశాల్లో చిక్కుకు పోయారు. వీరందరినీ స్వదేశానికి తరలించడానికి ఇంగ్లాండ్‌ ప్రభుత్వానికి భారీగానే వ్యయం

బుల్లిష్‌గా మారిన ఎఫ్‌పీఐలు

Monday 23rd September 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయాన్ని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ప్రశంసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్‌ తర్వాత నుంచి భారత మార్కెట్‌ విషయంలో వారు బేరిష్‌ ధోరణితో వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. సుమారు రూ.30,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. బడ్జెట్‌లో వృద్ధిని పెంచే చర్యలు లోపించడం, జూన్‌ క్వార్టర్‌ జీడీపీ వృద్ధి 5 శాతానికి పడిపోవడం ఎఫ్‌పీఐలను అమ్మకాల వైపు నడిపించిందని చెప్పుకోవాలి.

Most from this category