News


క్యూ3లో ఎల్‌ఐసీ ఈక్విటీ కొనుగోళ్లు ఇవే..

Friday 17th January 2020
personal-finance_main1579285644.png-30999

దేశీయంగా పెద్ద ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లలో ఎల్‌ఐసీ కూడా ఒకటి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవలను కూడా నిర్వహిస్తోంది. సుమారు రూ.31 లక్షల కోట్ల ఆస్తులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. పాలసీదారుల నుంచి ప్రీమియం రూపేణా వచ్చిన ఆదాయం నుంచి రిస్క్‌, పరిపాలనా చార్జీలను మినహాయించగా, మిగిలిన నిధులను సైతం ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో పెట్టుబడులుగా పెడుతుంటుంది. డిసెంబర్‌ క్వార్టర్‌(క్యూ3)లో ఎల్‌ఐసీ ఈక్విటీల్లో చేసిన పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ వివరాలు ఇవి...


 డిసెంబర్‌ త్రైమాసికంలో ప్రధానంగా ఎల్‌ఐసీ లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టింది. కొన్ని మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను కూడా పెట్టుబడులకు ఎంచుకుంది. ఇన్‌ఫ్రా, మెటల్స్‌, ఇన్ఫరే‍్మషన్‌ టెక్నాలజీ, పోర్టులు, ఎన్‌బీఎఫ్‌సీ, ఫార్మా రంగాల స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఇక టెలికం, విద్యుత్తు, ఆయిల్‌ రిటైలింగ్‌ కంపెనీలు, హాస్పిటల్స్‌, గ్రాఫైట్‌, బ్యాంకు స్టాక్స్‌లో పెట్టుబడులు తగ్గించుకుంది. ఎల్‌ఐసీ ఈక్విటీ పెట్టుబడుల విలువ సుమారు రూ.6 లక్షల కోట్లుగా ఉంటుంది. 2018-19లో ఈక్విటీల్లో రూ.68,620 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా, 2019-20లో రూ.70,000 కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేస్తుందని అంచనా. 

 

వాటాలు పెంచుకున్నవి
క్యూ3లో ఎల్‌ఐసీ వాటాలు పెంచుకున్న స్టాక్స్‌లో... జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, రైట్స్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కేఈసీ ఇంటర్నేషనల్‌, కమిన్స్‌ ఇండియా, క్యాడిలా హెల్త్‌కేర్‌, ఎంఫసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఫైజర్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టెక్‌ మహీంద్రా, బాష్‌, గిల్లెట్‌ ఇండియా. 

 

వాటాలు తగ్గించుకున్నవి..
క్యూ3లో ఎల్‌ఐసీ వాటాలు తగ్గించుకున్న స్టాక్స్‌.. టాటా మోటార్స్‌, జైడస్‌ వెల్‌నెస్‌, ఎంపైర్‌ ఇండస్ట్రీస్‌, లక్ష్మీ మెషిన్‌ వర్క్స్‌, లక్ష్మీ మిల్స్‌ కంపెనీ, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, ఎక్సెల్‌ ఇండస్ట్రీస్‌, డీసీఎం శ్రీరామ్‌ ఇండస్ట్రీస్‌, టూరిజం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ హెల్త్‌, ట్రాన్స్‌పెక్‌ ఇండస్ట్రీ, పైసలో డిజిటల్‌, జీఈఈ, ఇక్రా, ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా, ఇంజనీర్స్‌ ఇండియా, ఈఐహెచ్‌, ఇండియా టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఏబీబీ ఇండియా, శేషసాయి పేపర్‌ అండ్‌ బోర్డ్స్‌, గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ ఫార్మా, తమిళనాడు న్యూస్‌ ప్రింట్‌, హెచ్‌ఈజీ, వోల్టాస్‌, అంబుజా సిమెంట్స్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, పుంజ్‌లైడ్‌, గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌, ఏసీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, అపోలో హాస్పిటల్స్‌, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర, హిందుస్తాన్‌ కాపర్‌, యాక్సిస్‌ బ్యాంకు, జైప్రకాష్‌ అసోసియేట్స్‌, ఎన్‌హెచ్‌పీసీ, హెచ్‌పీసీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌.



You may be interested

‘యస్‌ బ్యాంకు’ వార్నింగ్‌ బెల్స్‌..!

Saturday 18th January 2020

యస్‌ బ్యాంకుకు ఇప్పుడు నిధులే ప్రాణవాయువు. ఎంత వేగంగా నిధులు సమీకరిస్తే బ్యాంకు సొంతంగా నిలదొక్కుకునేందుకు, గాడిలో పడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ, కారణాలేవైనా కానీ, నిధుల సమీకరణలో బ్యాంకు తీవ్ర జాప్యం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. పరిస్థితులు చేయి దాటిపోతే ఆర్‌బీఐ అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్న అభిప్రాయం పలువురు అనలిస్టుల నుంచి వినిపిస్తోంది.    యస్‌ బ్యాంకు రూ.10,000 కోట్ల నిధులను క్యూఐపీ/జీడీఆర్‌/ఏడీఆర్‌/ఎఫ్‌సీసీబీ ఇలా పలు మార్గాల్లో

స్వల్పంగా పెరిగిన టీసీఎస్‌ నికరలాభం

Friday 17th January 2020

విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ నికరలాభం స్వల్పంగా పెరిగింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 0.20 శాతం నామమాత్ర పెరుగుదలతో రూ. 8,105 కోట్ల నుంచి రూ. 8,118 కోట్లకు చేరింది. విశ్లేషకులు రూ. 8,180 కోట్ల మేర అంచనాలు వెల్లడించగా, ఈ అంచనాలను టీసీఎస్‌ దాదాపు అందుకుంది. కంపెనీ ఆదాయం 6.7 శాతం వృద్ధితో రూ. 37,338

Most from this category