News


ఐడీబీఐలో వాటాను ముందుగానే తగ్గించుకుంటాం: ఎల్‌ఐసీ

Friday 7th February 2020
Markets_main1581099429.png-31607

ఐడీబీఐలో 51 శాతం వాటా కలిగిన ఎల్‌ఐసీ నిర్దేశిత 12 ఏళ్ల వరకు ఆగకుండా ముందుగానే తమ వాటాను తగ్గించుకుంటామని స్పష్టం చేసింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ తన వాటాను తగ్గించుకునే విషయమై ఐఆర్‌డీఏఐ ఎటువంటి గడువు విధించలేదని ఎల్‌ఐసీ చైర్మన్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఆర్‌బీఐ 12 ఏళ్ల గడువు ఇచ్చినట్టు చెప్పారు. అయితే, ఎల్‌ఐసీ కూడా లిస్టింగ్‌కు వెళ్లాలనుకుంటున్నందున అంత సుదీర్ఘకాలం పాటు వేచి చూడాలనుకోవడం లేదన్నారు. ఎల్‌ఐసీలో కేంద్ర ప్రభుత్వానికి 47 శాతం వాటా ఉండగా, తన మొత్తం వాటాను 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించనున్నట్టు బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రభుత్వం తన వాటాల విక్రయంతో ఐడీబీఐ వ్యాల్యూ పెరుగుతుందని, దాంతో తమ వాటాను కూడా కొంత మేర విక్రయించే అవకాశం ఉందని కుమార్‌ పరోక్షంగా పేర్కొన్నారు.

 

రూ.1.5 లక్షల కోట్లను దాటిన ఎల్‌ఐసీ నూతన ప్రీమియం
ముంబై: ప్రభుత్వరంగంలోని జీవిత బీమా సంస్థ ‘ఎల్‌ఐసీ’ మొదటి సారి నూతన పాలసీల విక్రయం ద్వారా వచ్చే ప్రీమియం రూ.1.5 లక్షల కోట్ల మార్కును అధిగమించినట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకు నూతన వ్యాపార ప్రీమియంలో 17.48 శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపింది. పాలసీ సంఖ్యా పరంగా జనవరి చివరికి 77.61 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. మొదటి ఏడాది ప్రీమియం పరంగా మార్కెట్‌ వాటా 70 శాతంగా నమోదైంది. ఎల్‌ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి చివరికి మొత్తం రూ.1,42,93,289 కోట్ల క్లెయిమ్‌లకు సంబంధించి రూ.69,748 కోట్ల చెల్లింపులు చేసింది. మొదటి ఏడాది ప్రీమియం 17.48 శాతం వృద్ధి చెంది రూ.45,199 కోట్లుగా ఉంటే, పాలసీల విక్రయాలు 30 శాతం పెరిగి 1,95,85,635గా ఉన్నాయి. ఐఆర్‌డీఏఐ నూతన నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుత పాలసీలను, అదనపు ఫీచర్లతో మార్పులు చేసి ఈ నెల 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎల్‌ఐసీ తెలిపింది. 



You may be interested

రైల్వే స్టేషన్ల అభివృద్ధికి దిగ్గజాల క్యూ

Friday 7th February 2020

ప్రయివేటు రైళ్లను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పట్టాలపైకి ఎక్కించిన రైల్వే శాఖ.. ఇక రైల్వే స్టేషన్ల అభివృద్ధిలోనూ ప్రయివేటు సంస్థల సాయం తీసుకోనుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 50 రైల్వే స్టేష్లను దేశవ్యాప్తంగా ప్రయివేటు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అదానీ గ్రూపు, షాపూర్‌జీ పల్లోంజీ, టాటా రియాలిటీ, ఎన్‌ఐఐఎఫ్‌, జీఎంఆర్‌, జేకేబీ ఇన్‌ఫ్రా, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌, ఎస్సెల్‌ గ్రూపు, యాంకరేజ్‌

రియాల్టీ షేర్లు.... నేల చూపు

Friday 7th February 2020

శుక్రవారం  స్టాక్‌ మార్కెట్‌లో రియాల్టి షేర్లు భారీగా పతనమయ్యాయి. నిఫ్టి రియాల్టీ ఇండెక్స్‌ 1.75 శాతం తగ్గుదలతో 320.55 వద్ద ముగిసింది. డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ 4.47 శాతం తగ్గి 235.30 వద్ద,ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్  2.40 శాతం తగ్గి 372.10 వద్ద, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 2.29 శాతం తగ్గి 234.25 వద్ద, శోభా లిమెటెడ్‌ 1.33 శాతం తగ్గి 406.60 వద్ద, మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ 0.22 శాతం తగ్గి

Most from this category