News


ఐపీఓతో పాలసీ హోల్డర్లకు ప్రాబ్లమ్‌ లేదు: ఎల్‌ఐసీ

Friday 7th February 2020
Markets_main1581071596.png-31604

ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌
బడ్జెట్లో ప్రకటించిన విధంగా ఎల్‌ఐసీని పబ్లిక్‌ లిస్టింగ్‌కు తెచ్చే యత్నాలు ఆరంభమయ్యాయి. ఐపీఓకు సంబంధించి పనులు మొదలెడతామని, కానీ ఇందుకు నిర్ధిష్ట సమయం నిర్ధారించలేమని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. ఐపీఓతో పాలసీ హోల్డర్లపై, కంపెనీ ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కంపెనీ వాల్యూషన్‌పై ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. ఇంకా వాల్యూషన్ల మదింపు చేయలేదని తెలిపారు. రూ. 2.1 లక్షల కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలో భాగంగా ఎల్‌ఐసీలో వాటాల విక్రయాన్ని ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌పై చర్చిచేందుకు ప్రభుత్వం త్వరలో ఇంటర్‌మినిస్ట్రియల్‌ బృందాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రభుత్వఅధికారి ఒకరు చెప్పారు. ఈ బృందంలో విత్తసేవల శాఖ, డీఐపీఏఎం, న్యాయశాఖల అధికారులు, మంత్రులు ఉంటారు. ఐపీఓ విధివిధానాలపై వీరు చర్చిస్తారు. వాటా విక్రయం 10 శాతాన్ని మించకపోవచ్చన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఐపీఓ ఉండొచ్చని ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. బీమా రంగంలోని మొత్తం పాలసీల్లో 78 శాతం పాలసీలు ఎల్‌ఐసీ నిర్వహణలో ఉన్నాయి. 



You may be interested

4 రోజుల ర్యాలీకి బ్రేక్‌- నష్టాల ముగింపు

Friday 7th February 2020

సెన్సెక్స్‌ 164 పాయింట్లు డౌన్‌ 40 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ రియల్టీ, ఆటో నేలచూపు నాలుగు రోజుల లాభాల ర్యాలీకి బ్రేక్‌ పడింది. రోజం‍తా ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 164 పాయింట్లు క్షీణించి 41,142 వద్ద నిలవగా.. నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 12,098 వద్ద స్థిరపడింది. నాలుగు రోజుల వరుస ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు గురువారం అమెరికా

ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Friday 7th February 2020

ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ వరుసగా మూడోరోజూ లాభంతో ముగిసింది. మార్కెట్‌ నష్టాల్లో ముగిసినప్పటికీ ఫార్మా రంగ షేర్లు లాభపడటం విశేషం. ఈ రంగంలో ప్రధాన షేర్లైన అరబిందో ఫార్మా, 6.50శాతం లాభపడింది. బయోకాన్‌ 5.50శాతం, దివీస్‌ ల్యాబ్స్‌ 3.30శాతం, గ్లెన్‌మార్క్‌ షేరు 2.50శాతం, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేరు 1.50శాతం, కేడిల్లా హెల్త్‌కేర్‌ 1శాతం, సిప్లా అరశాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు

Most from this category