News


బడ్జెట్‌ ఫలితాలు దీర్ఘకాలంలోనే.. స్వల్ప కాలంలో పెయిన్‌

Sunday 2nd February 2020
Markets_main1580666791.png-31448

బడ్జెట్‌ ప్రతిపాదనల ఫలాలు దీర్ఘకాలంలోనే కనిపిస్తాయని, స్వల్ప కాలానికి మార్కెట్లలో నొప్పి భరించక తప్పదని శామ్కో సెక్యూరిటీస్‌ జీఈవో జిమీత్‌మోదీ అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌పై అంచనాలు, కరోనా వైరస్‌ ఆందోళనలతో గత వారం మార్కెట్లపై ఒత్తిడి నెలకొందని, చివరికి బడ్జెట్‌ ప్రతిపాదనలు మరింత దీర్ఘకాలానికి ఉద్దేశించినవి కావడంతో మార్కెట్లు నష్టాలతో ముగియడానికి కారణమైనట్టు విశ్లేషించారు. స్టాక్‌ మార్కెట్లు ఆర్థిక వృద్ధి కోసం స్వల్పకాలిక బూస్ట్‌ను ఆశించినట్టు చెప్పారు. ఓ ప్రముఖ వార్తా సంస్థతో బడ్జెట్‌, మార్కెట్లపై తన అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు..

 

భవిష్యత్తు దృష్టి..
‘‘సంపూర్ణ దృష్టితో చూస్తే గత అక్టోబర్‌లో కార్పొరేట్‌ పన్ను కోత, తర్వాత రియల్‌ ఎస్టేట్‌ ప్యాకేజీ, మౌలిక రంగానికి ఊతం వంటి చర్యలతో ప్రభుత్వం సంస్కరణల పథాన్ని అనుసరించినట్టు తెలుస్తోంది. మరింత సులభతర, తక్కువ మినహాయింపులతో కూడిన పన్ను శ్లాబులను ప్రవేశపెట్టడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చి, కొనుగోలు శక్తిని పెంచడంపై బడ్జెట్‌ దృష్టి సారించింది. డిజిటైజేషన్‌ పెంపునకు నిధుల కేటాయింపు, డీడీటీ తొలగింపు, తదుపరి దశాబ్దానికి జాతి నిర్మాణం కోసం వీలుగా నూతన విద్యా విధానం, వైద్యుల అందుబాటును పెంచడం, ప్రభుత్వ ఆస్పత్రులకు అనుబంధంగా ప్రైవేటు వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతించడం వంటి నిర్ణయాలు భవిష్యత్తు దృష్టితో తీసుకున్నవే. వీటి ఫలితాలన్నీ కూడా మంచి పునాదితో దీర్ఘకాలంలో ఫలితాలను ఇస్తాయి. కానీ, స్వల్ప కాలంలో మార్కెట్లను ఉత్సాహపరిచేవీ ఏవీ లేవు. ప్రభుత్వం వృద్ధి పెంపునకు ఇప్పటికే కట్టుబడి ఉంది. రానున్న సంవత్సరాల్లో వృద్ధి పెరిగేందుకు ప్రభుత్వ చర్యలు దోహదం చేస్తాయి. కానీ, వచ్చే కొన్ని ‍త్రైమాసికాల పాటు వృద్ధి బలహీనంగానే ఉంటుంది.

 

ఈ వారం..
దలాల్‌ స్ట్రీట్‌ను బడ్జెట్‌ నిరాశపరిచింది. జనవరి నెల ఆటోమొబైల్‌ గణాంకాలు మంచి రికవరీని సూచించాయి. కాంపాక్ట్‌, చిన్న వాహనాల విభాగంలో డిమాండ్‌ మొదలైనట్టు సంకేతమిచ్చాయి. మారుతి వార్షికంగా 1.6 శాతం అమ్మకాల వృద్ధిని చూపించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మెరుగుపడుతున్నట్టు నిదర్శనం. మార్కెట్లు ట్రెండ్‌లైన్‌ను కోల్పోయాయి. కరెక్షన్‌ మరింత ఎక్కువగా ఉండనుంది. మార్కెట్లు కొంత వెనక్కి వచ్చిన తర్వాత మరింత పతనం ఉండొచ్చు. బడ్జెట్‌ ప్రతిపాదనలతో దీర్ఘకాల ప్రయోజనాలను అర్థం చేసుకున్న తర్వాత మార్కెట్లు తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అయితే, మార్కెట్లు, స్వల్పకాలిక, మధ్య కాలిక కరెక్షన్‌లోకి ప్రవేశించాయి. కనుక ప్రతీ పెరుగుదలలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చు. మార్కెట్లు స్థిరపడే వరకు చూసి, ఆ తర్వాత కొనుగోళ్లు చేసుకోవడం సూచనీయం’’ అని జిమీత్‌ మోదీ సూచించారు.You may be interested

బడ్జెట్‌ ప్రభావం, ఆర్‌బీఐ సమీక్ష, ఫలితాలే దిక్సూచీ..

Monday 3rd February 2020

నిరాశపరిచిన బడ్జెట్‌ పతనం ఈ వారంలోనూ కొనసాగే అవకాశం: రెలిగేర్ బ్రోకింగ్ మంగళవారం నుంచి 3 రోజులపాటు ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష టైటాన్, భారతి ఎయిర్‌టెల్, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, పీఎన్‌బీ ఫలితాలు ఈవారంలోనే.. ముంబై: వారాంతాన జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 988 పాయింట్లు (2.43 శాతం)నష్టపోయి 39,736 వద్ద ముగియగా.. నిఫ్టీ 300 పాయింట్లు (2.51 శాతం) కోల్పోయి 11,662 వద్దకు పడిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

రుణం తీసుకుని ట్రేడ్‌ చేస్తున్నారా..?

Sunday 2nd February 2020

మన చుట్టూ ఉన్న ఇన్వెస్టర్లలో రుణం తీసుకుని ట్రేడ్‌ చేసే వారూ (లెవరేజ్‌) ఉన్నారు. రుణం తీసుకుని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి రుణం తీసుకుని ఇలా ట్రేడ్‌ చేయడం ఎంతో రిస్క్‌ అన్న మాటలు వినిపిస్తుంటాయి. రుణం తీసుకుని ట్రేడ్‌ చేయడంలో ఉండే రిస్క్‌? ఇందుకు ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలన్నది ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌, ఎండీ డీకే అగర్వాల్‌ తెలియజేశారు.   ‘‘లెవరేజ్‌

Most from this category