News


అస్థిరతల సమయాల్లో నమ్ముకోతగ్గ స్టాక్స్‌!

Tuesday 14th May 2019
Markets_main1557857113.png-25738

ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నం కావడంతో మే ఆరంభం నుంచి విదేశీ ఇన్వె‍స్టర్లు అమ్మకాలు చేస్తున్నారు. అమెరికా-చైనా మధ్య తాజాగా టారిఫ్‌ల యుద్ధం ఆరంభం కావడం కూడా నష్టాలు, అస్థిరతలు పెరిగిపోవడానికి కారణమయ్యాయి. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ఆటుపోట్లు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది అనలిస్టుల సిఫారసుల ఆధారంగా అస్థిరతల సమయంలో పెట్టుబడులకు పరిశీలించ తగిన స్టాక్స్‌ వివరాలు ఇవి. 

 

డీబీకార్ప్‌
12 రాష్ట్రాల్లో వార్తా పత్రికల మాధ్యమంలో బలమైన సంస్థ ఇది. ఏడు రాష్ట్రాల పరిధిలో ఎఫ్‌ఎం రేడియో సేవలను కూడా నిర్వహిస్తోంది. తొమ్మిది వెబ్‌సైట్లు, నాలుగు మొబైల్‌ యాప్స్‌ను కూడా మీడియా రంగంలో నిర్వహిస్తోంది. మార్కెట్‌ వాటా పెరగడం, పాఠకుల్లో వైవిధ్యమైన బేస్‌ ఉండడం, యాడ్‌ ఆదాయం రికవరీ కావం, న్యూస్‌ప్రింట్‌ ధరలు స్థిరపడడం వంటి అంశాల కారణంగా ఈ కంపెనీ పట్ల అనలిస్టులు బుల్లిష్‌గా ఉన్నారు.  దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల పరిధిలో కంపెనీ విస్తరించి ఉండడం సానుకూలంగా పేర్కొంటున్నారు. 

 

గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌
ఆటోమోటివ్‌, నాన్‌ ఆటోమోటివ్‌ లూబ్రికెంట్స్‌, గ్రీజుల తయారీ, మార్కెటింగ్‌ రంగంలో ప్రముఖ కంపెనీ. యస్‌ సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకారం... ఈ కంపెనీకి గణనీయమైన మార్కెట్‌ వాటా, బలమైన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో, విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్‌ ఉండడం వల్ల పనితీరు మెరుగుపడుతుందని అంచనా. చెన్నై ప్లాంట్‌ ఆరంభించడంతో దక్షిణాది, తూర్పు మార్కెట్లలో కంపెనీ స్థానం బలపడుతుందని యస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఈ స్టాక్‌ చాలా ఆకర్షణీయ స్థాయిల్లో ఉందని, 2020-21 వరకు వార్షికంగా కంపెనీ 16 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వ్యక్తం చేసింది.

 

బజాజ్‌ కన్జ్యూమర్‌కేర్‌
కాస్మెటిక్స్‌, ఇతర వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో ఉన్న ఎఫ్‌ఎంసీజీ కంపెనీ. ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకారం... హెయిర్‌ ఆయిల్‌ విభాగంలో కంపెనీ తన వాటాను రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉంది. వ్యయ నియంత్రణ, కంపెనీ అంతర్గత మార్పులతో ఆర్థిక పనితీరు మెరుగపడనుంది. ప్రస్తుతం కంపెనీ షేరు విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయని ఎస్‌బీఐ క్యాప్‌ భావిస్తోంది. 2020-21 వరకు ఏటా 12 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా.

 

అబాట్‌ ఇండియా
అబాట్‌ ఇండియా  పట్ల అనలిస్టులు ఎక్కువ మంది బుల్లిష్‌గా ఉన్నారు. కంపెనీకి రుణాలు లేకపోవడం, నగదు బ్యాలన్స్‌లు దండిగా ఉండడం, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, స్పెషాలిటీ బిజినెస్‌లో విస్తరణ, బలమైన రాబడుల రేషియో, పేరెంట్‌ సంస్థ బలమైనది కావడం కంపెనీ వృద్ధి అవకాశాలకు కలిసొస్తుందని విశ్లేషణ.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు అప్‌

Wednesday 15th May 2019

 ప్రపంచ ప్రధాన మార్కెట్లలో జరుగుతున్న షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలో భాగంగా ఆసియా మార్కెట్లు పెరిగిన నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ బుధవారం స్వల్పలాభాలతో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు  22  పాయింట్ల లాభంతో 11,264 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,242 పాయింట్ల వద్ద ముగిసింది. తాజాగా ఆసియాలో జపాన్‌ నికాయ్‌ సూచి స్వల్పంగా తగ్గగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌

తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్‌

Tuesday 14th May 2019

227 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌ 11200లపై ముగిసిన నిఫ్టీ మార్కెట్‌ తొమ్మిదో రోజుల వరుస నష్టాలకు మంగళవారం ముగింపు పడింది. సెన్సెక్స్‌ 227 పాయింట్లు లాభపడి 37,318 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 11200ల పైన 11,222 వద్ద ముగిసింది. గత తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్స్‌లో సూచీల వరుస పతనం కారణంగా అధిక షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గచూపారు. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 18పైసలు రికవరి

Most from this category