News


ఎస్సార్‌ స్టీల్‌ రికవరీ డబ్బులు వచ్చేస్తున్నాయ్‌!

Saturday 14th December 2019
Markets_main1576319319.png-30231

ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలుకు సంబంధించి రూ. 42వేల కోట్ల మొత్తాన్ని చెల్లించే ప్రక్రియను ఆర్సెలార్‌ మిట్టల్‌ ఆరంభించినట్లు తెలిసింది. నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సార్‌స్టీల్‌ కొనుగోలుపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. దీంతో మిట్టల్‌ కంపెనీ చెల్లింపుల ప్రక్రియ షురూ చేసిందని, ఒకటి రెండు రోజుల్లో మొత్తం సొమ్ము చెల్లించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌ 16 నాటికి ఎస్‌బీఐకి ఈ నిధుల బదిలీ జరగవచ్చని తెలిపాయి. ఎస్సార్‌ స్టీ్‌ల్‌ రుణదాతల కన్సార్టియంకు ఎస్‌బీఐ లీడ్‌ బ్యాంకర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం వెంటనే నిధుల బదిలీ చేయకుండా ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు కోసం కేటాయించిన రూ. 42 వేల కోట్లను మిట్టల్‌ గ్రూప్‌ ఒక ఎస్‌క్రూ అకౌంట్‌లో ఉంచింది. ఇప్పుడీ నిధులను రుణదాతలకు అందించనున్నారు. ఎస్సార్‌ స్టీల్‌కు అప్పులిచ్చిన బ్యాంకుల్లో ఎస్‌బీఐ(రూ. 13226 కోట్లు), కెనెరా బ్యాంక్‌(రూ. 3798 కోట్లు), స్టాండర్డ్‌ చార్టర్‌ బ్యాంక్‌(రూ. 3557 కోట్లు), పీఎన్‌బీ(రూ. 2936 కోట్లు), డాయిష్‌బ్యాంక్‌(రూ. 2830 కోట్లు), ఐడీబీఐ బ్యాంక్‌(రూ. 2482 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌(రూ. 2294 కోట్లు), యూబీఐ(రూ. 2123 కోట్లు), బీఓఐ(రూ. 1985 కోట్లు, ఈఏఆర్‌సీ ట్రస్ట్‌(రూ. 1698 కోట్లు), కార్పొరేషన్‌ బ్యాంక్‌(రూ. 1567 కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఎస్‌బీఐకి రూ. 12161 కోట్లు, కెనెరా బ్యాంక్‌కు రూ. 3493 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌కు రూ. 2110 కోట్లు లభించనున్నాయి.

మరోవైపు ఎస్సార్‌ స్టీల్‌ నుంచి రుణదాతలకు రూ. 38896 కోట్ల రికవరీ లభించనుందని, కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిసొల్యూషన్‌ ప్రాసెస్‌ కింద తాము చేసిన యత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయని ఎస్‌బీఐ ప్రకటించింది. సీఐఆర్‌పీ కింద ఎస్సార్‌స్టీల్‌ను ఆర్సెలార్‌ మిట్టల్‌ కొనుగోలు చేసింది. దివాలా చట్టం అమల్లోకి వచ్చాక ఇదే అతిపెద్ద రికవరీ కానుంది. బ్యాంకుల బాలెన్స్‌ షీట్లకు ఈ మొత్తాలు మూడో త్రైమాసికంలో జమకూరవచ్చు. ఎస్సార్‌స్టీల్‌ రుణదాతల కన్సార్టియంకు ఎస్‌బీఐ లీడర్‌గా వ్యవహరిస్తోంది. తాజా రికవరీ తమ నిబద్ధతకు నిదర్శనమని బ్యాంకు పేర్కొంది. రికవరీ వార్తల నేపథ్యంలో శుక్రవారం ఎస్‌బీఐ సహా పలు పీఎస్‌యూ బ్యాంకులు మంచి ర్యాలీ జరిపాయి. You may be interested

వచ్చే 3-5వారాల్లో 11శాతం రాబడులిచ్చే షేర్లివే...!

Saturday 14th December 2019

హిందాల్కో, ఎన్‌ఎండీసీ షేర్లు బ్రేక్‌ అవుట్‌కు సిద్ధంగా ఉన్నాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ రాబోయే 3-5వారాల్లో 11శాతం రాబడుల్ని ఇన్వెస్టర్లకు పంచే సత్తా ఈ రెండు షేర్లకు ఉందని తెలిపారు.  షేరు:- ఎన్‌ఎండీసీ రేటింగ్‌:- బై టార్గెట్‌ ధర: రూ.127 స్టాప్‌ లాస్‌: రూ.103 అప్‌సైడ్‌:- 11శాతం  విశ్లేషణ:- గత కొన్నివారాలుగా ఎన్‌ఎండీసీ డైలీ, వీక్లీ టైమ్‌ఫ్రైస్‌ చార్టులు అప్‌ ట్రెండ్‌ను కనబరుస్తున్నాయి. వీక్లీ

పరిమిత లాభాల్లో ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 14th December 2019

అమెరికాలో ట్రేడయ్యే భారత ఏడీఆర్‌లు శుక్రవారం పరిమిత లాబాల్ని కూడగట్టుకున్నాయి. ఒక్క డాక్టర్‌ రెడ్డీస్‌ తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు 1శాతం నుంచి 0.10శాతం వరకు పెరిగాయి. అమెరికా చైనాల మధ్య డీల్‌ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్‌ ప్రకటనతో మెటల్‌ రంగానికి వేదాంత ఏడీఆర్‌ 1.20శాతం పెరిగింది. అక్కడి మార్కెట్లో టెక్నాలజీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిన కారణంగా  విప్రో ఏడీఆర్‌ 0.82శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు 0.50శాతం లాభపడ్డాయి.

Most from this category