News


లెమన్‌ ట్రీ- నిట్‌ టెక్‌.. జోరు

Tuesday 24th December 2019
Markets_main1577163319.png-30404

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ రెండు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ఒకటి ఆతిథ్య రంగ కంపెనీ లెమన్‌ ట్రీ హోటల్స్‌ కాగా.. మరొకటి సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌. డార్జిలింగ్‌లో హోటల్‌ నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న వార్తలు లెమన్‌ ట్రీ షేరుకి హుషారునివ్వగా.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) వార్తలతో నిట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ సైతం వెలుగులో నిలుస్తోంది. వివరాలు చూద్దాం..

లెమన్‌ ట్రీ హోటల్స్‌: 
డార్జిలింగ్‌లోని హిల్‌కార్ట్‌ రోడ్‌లో త్వరలో ప్రారంభంకానున్న 55 గదుల హోటల్‌ నిర్వహణకు సంబంధించి లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు లెమన్‌ ట్రీ హోటల్స్‌ తాజాగా పేర్కొంది. ఎస్‌జీబీ డెవలపర్స్‌ అభివృద్ధి చేస్తున్న ఈ 55 రూముల హోటల్‌ నిర్వహణకు అనుబంధ సంస్థ కార్నేషన్‌ హోటల్స్‌ ద్వారా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 2022 సెప్టెంబర్‌లో హోటల్‌ ప్రారంభమయ్యే వీలున్నట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 10.15 సమయంలో లెమన్‌ ట్రీ హోటల్స్‌ షేరు బీఎస్‌ఈలో 3.4 శాతం ఎగసింది. రూ. 64 వద్ద ట్రేడవుతోంది.  

నిట్‌ టెక్నాలజీస్‌: 
సోమవారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌నకు అనుమతించినట్లు సాప్ట్‌వేర్‌ సేవల కంపెనీ ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ పేర్కొంది. షేరుకి రూ. 1725 ధర మించకుండా 19.56 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 337 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో మంగళవారం ఉదయం 10.20 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో నిట్‌ టెక్‌ షేరు 2.2 శాతం పుంజుకుని రూ. 1612 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1626 వరకూ పెరిగింది.



You may be interested

షార్ట్‌టర్మ్‌కు రెలిగేర్‌ రికమండేషన్లు

Tuesday 24th December 2019

వచ్చే మూడు నాలుగు వారాల్లో మంచి రాబడినిచ్చే మూడు షేర్లను రెలిగేర్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది. 1. యాక్సిస్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 780. స్టాప్‌లాస్‌ రూ. 725. రెండు నెలలుగా రూ. 710-755 రేంజ్‌లో ట్రేడవుతోంది. ఇటీవల ఈ రేంజ్‌ పైఅవధిని తాకి తిరిగి వెనక్కువచ్చింది. ప్రస్తుతం తాజా కొనుగోళ్లకు అనుకూతంగా ఉంది. రూ. 740- 745 రేంజ్‌లో స్వల్పకాలానికి కొనుగోలు చేయవచ్చు. 2. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: కొనొచ్చు. టార్గెట్‌

మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ రియో ఎలైట్

Tuesday 24th December 2019

ధర రూ. 45,099  ముంబై: గ్రీవ్స్‌ కాటన్‌ ఈ-మొబిలిటీ అనుబంధ సంస్థ యాంపియర్ వెహికిల్స్‌.. ‘రియో ఎలైట్’ పేరిట సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 45,099 (ఎక్స్‌-షోరూం-బెంగళూరు)గా ప్రకటించింది. ఎల్‌ఈడీ డిజిటల్ డాష్‌బోర్డ్, డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, యూఎస్‌బీ ఛార్జింగ్ పాయింట్ వంటి ఫీచర్లు ఉన్నట్లు వివరించింది. 48వీ-20ఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ స్కూరట్లను సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. యాంపియర్ వెహికిల్స్‌

Most from this category