News


మల్టీబ్యాగర్లు తగ్గడం మంచిదే!

Tuesday 26th March 2019
Markets_main1553597186.png-24809

కొత్త ఏడాది మరిన్ని మల్టీబ్యాగర్లు తయారవుతాయంటున్న నిపుణులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లో మల్టీబ్యాగర్లు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఒకపక్క ఏడాదిలో సూచీలు దాదాపు 15 శాతం ర్యాలీ జరిపినా, మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చిన స్టాకుల సంఖ్యమాత్రం గత పదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అయితే ఇలా ఒక ఏడాది మల్టీబ్యాగర్ల సంఖ్య తగ్గడం వచ్చే ఏడాది మరిన్ని మల్టీబ్యాగర్లుంటాయనేందుకు సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2019-20లో భారీగా మల్టీబ్యాగర్లు తయారవుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. గతంలో 2008-09లో మార్కెట్లో కేవలం 50 స్టాకులే మల్టీబ్యాగర్‌ రాబడులు ఇచ్చాయి. అయితే ఆ తర్వాత ఏడాది 1,333 స్టాకులు 100 నుంచి 5వేల శాతం వరకు దూసుకుపోయి మదుపరుల పంటపండించాయి. అదే విధంగా 2011-12లో 65 మల్టీబ్యాగర్లుండగా, 2012-13లో 87, 2013-14లో 188, 2014-15లో 649, 2015-16లో 205, 2016-17లో 401 షేర్లు మల్టీబ్యాగర్‌ రాబడులు ఇచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా పదేళ్లలో అతితక్కువగా కేవలం 46 స్టాకులు మాత్రమే మల్టీబ్యాగర్‌ రాబడులు ఇచ్చాయి. గత ఆర్థిక సంవత్సరంలో 207 స్టాకులు భారీ రాబడులు అందించాయి. ఈ ఏడాది మల్టీబ్యాగర్లుగా మారిన స్టాకుల్లో కోస్టల్‌ కార్పొరేషన్‌; టైన్‌ ఆయుర్వేదిక్‌, వికాస్‌ ప్రొపాంట్‌ అండ్‌ గ్రానైట్‌, సాధన నైట్రోకెమ్‌, శ్రీరామ్‌ ఏఎంసీ, బిర్లా కేబుల్‌ తదితరాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం సూచీలు మరో భారీ బుల్‌రన్‌ చూస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది మల్టీబ్యాగర్లుతక్కువగా ఉన్నా, ఏప్రిల్‌ 1 నుంచి ఆరంభమయ్యే సంవత్సరంలో చాలా స్టాకులు దూసుకుపోతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం సూచీలు దాదాపు 10 శాతం లాభపడ్డాయి. ఇకమీదట లార్జ్‌క్యాప్స్‌ కన్నా చిన్న, మిడ్‌క్యాప్స్‌ సత్తా చూపడం పెరుగుతుందని, ఎప్పుడైతే చిన్నస్టాకులు చురుగ్గా ఉంటాయో మరిన్ని మల్టీబ్యాగర్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు నాణ్యమైన ట్రాక్‌ రికార్డు ఉన్న స్టాకులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. 



You may be interested

మిడ్‌క్యాప్‌లో రికవరీకి అవకాశం: ఎలారా

Tuesday 26th March 2019

మిడ్‌క్యాప్‌లో రికవరీకి అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్‌ పేర్కొంది. చారిత్రక ధోరణలు, ధరలు, వ్యాల్యూషన్లు సౌకర్యంగా ఉండడంతో ఈ అంచనాకు వచ్చింది. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ వ్యాల్యూషన్లు చారిత్రకంగా కనిష్ట స్థాయిలో ఉన్నాయని తెలిపింది. రోలింగ్‌, అబ్జల్యూట్‌ పరంగానూ ఇదే కనిపిస్తోందని పేర్కొంది. దీంతో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో రికవరీ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం వ్యాల్యూషన్ల పరంగా కొనుగోలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న 20  మిడ్‌క్యాప్‌ కంపెనీలతో జాబితాను విడుదల చేసింది.    ఎలారా

మే14న మైండ్‌ట్రీ- ఎల్‌అండ్‌టీ ఓపెన్‌ఆఫర్‌ ఆరంభం

Tuesday 26th March 2019

మైండ్‌ట్రీలో అదనంగా 31 శాతం వాటా కొనేందుకు ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ మే 14న ఆరంభమవుతుందని ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. ఈ ఆఫర్‌ మే 27న ముగుస్తుందని వాటాదారులకు తెలియజేసింది. ఓపెన్‌ ఆఫర్‌లో 5.13 కోట్ల షేర్లను రూ. 5030 కోట్లకు సొంతం చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ముందుగా ప్రకటించినట్లే ఓపెన్‌ఆఫర్‌ ధర రూ. 980గా నిర్ణయించింది. అయితే మే 13లోపు ఈ ధర, ఆఫర్‌ సైజును మార్చేందుకు ఎల్‌అండ్‌టీకి అవకాశం

Most from this category