News


లాభాలు రక్షించుకోవడమే అతిపెద్ద పాఠం!

Tuesday 12th November 2019
Markets_main1573543749.png-29530

ఏక్యూఎఫ్‌ అడ్వైజర్స్‌ కోఫౌండర్‌ నితిన్‌ రహేజా
స్టాక్‌మార్కెట్లో ఎప్పటికప్పుడు వచ్చిన లాభాలను పరిరక్షించుకోవడమే తాను నేర్చుకున్న పెద్ద పాఠమని ఏక్యూఎఫ్‌ అడ్వైజర్స్‌ కోఫౌండర్‌ నితిన్‌ రహేజా చెప్పారు. ఇందుకు తగిన సూత్రాలను ఫాలో కావడం వల్లనే గత రెండేళ్ల కాలంలో పలు మిడ్‌క్యాప్స్‌పై మంచి లాభాలు ఆర్జించామని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసుకోవడం మంచిదని చాలామంది అనలిస్టులు సలహా ఇస్తుంటారని కానీ తాను తద్భిన్నంగా వెళ్లానని చెప్పారు. కొన్నిసార్లు స్వల్పలాభాలను పట్టించుకోకుండా, స్టాప్‌లాస్‌లను చూసుకోకుండా  వేచి చూస్తే అంతిమంగా భారీ లాభాలు వస్తాయని తాను ఈ రెండేళ్లలో గ్రహించానన్నారు. అయితే స్టాప్‌లాస్‌లు పట్టించుకోకుండా ఉన్నామని, ప్రతి స్టాకును పతనమైతున్నా అట్టిపెట్టుకోలేదని, టాప్‌అవుట్‌ చెంది కరెక‌్షన్‌ జోన్‌లోకి జారిన స్టాకులను ఎప్పటికప్పుడ వదిలించుకుంటూ వచ్చామని తెలిపారు. 200 రోజుల డీఎంఏను ఛేదించడానికి నాలుగైదు మార్లు యత్నించి చివరకు బ్రేక్‌డౌన్‌ అయిన షేర్ల ఫండమెంటల్స్‌లో మార్పు రావడం ఎక్కువశాతం స్టాకుల్లో తాను గమనించానన్నారు. అంటే ఒక షేరు తదుపరి కదలికను దాని ధరే ముందు ప్రతిబింబిస్తుంటుందని, తర్వాతే ఫండమెంటల్స్‌లో మార్పు కనిపిస్తుందని చెప్పారు. ఉదాహరణకు కొన్ని స్టాకులు వరుసగా మంచి ఫలితాలు ప్రకటిస్తూ వచ్చినా దాని ధర పడిపోవడం గమనించవచ్చని చెప్పారు. అందువల్ల ధరల కదలికలో మార్పులను జాగ్రత్తగా గమనిస్తే షేరు తదుపరి స్థితిని అంచనా వేయవచ్చన్నారు. అయితే కొన్నిమార్లు కొన్ని స్టాకులు వాటి 200 డీఎంఏ దిగువకు పడిపోయినా వెనువెంటనే వేగంగా రికవరీ చెందుతాయని, ఉదాహరణకు బజాజ్‌ ఫైనాన్స్‌ ఇలాగే చేసిందని తెలిపారు. వీటన్నిటి ఆధారంగా తాము ఒక సూత్రాన్ని రూపొందించుకున్నామని, దీని ఆధారంగా రెండేళ్లలో మంచి లాభాలు ఆర్జించామని చెప్పారు. అయితే తాము కనిపెట్టిన పద్ధతిని మాత్రం ఆయన పూర్తిగా వివరించలేదు. 
బాటమ్‌అప్‌ చెందింది..
ప్రస్తుత మార్కెట్‌ బాటమ్‌ అప్‌ చెందిందని నితిన్‌ చెప్పారు. ఫలితాలు ప్రకటించిన 352 కంపెనీల్లో విక్రయాలు సరాసరిన 5 శాతం పెరిగాయని, లాభాలు సరాసరిన 11 శాతం వృద్ధి చెందాయని చెప్పారు. ఇవి చూడడానికి మామూలు గణాంకాలుగా కనిపించవచ్చు కానీ బాటమ్‌ అప్‌ మార్కెట్లో ఇవి చాలా మంచి నెంబర్లని తెలిపారు. ఈ మార్కెట్లో ప్రస్తుతం పలు అవకాశాలు కనిపిస్తాయని చెప్పారు. ఉదాహరణకు సేవలరంగ ఆధారిత వ్యాపారాలకు చెందిన కంపెనీలను ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు గ్యాస్‌ కంపెనీలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీలు, ఆస్పత్రుల ఫలితాలు కూడా బాగున్నాయన్నారు. ప్రైవేట్‌ బ్యాంకుల్లో కొన్ని మంచి ఫలితాలు నమోదు చేశాయన్నారు. వీటిలో నాణ్యమైన కంపెనీలను ఎంచుకొని పోర్టుఫోలియో నిర్మించుకోవాలని సూచించారు. You may be interested

మరోసారి ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు?

Tuesday 12th November 2019

తయారీ, మైనింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఉత్పత్తి క్షీణించడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామిక రంగం నేలచూపులు చూసింది. ఫలితంగా పారిశ్రామికోత్పత్తి సూచి(ఐఐపీ) గత ఏనిమిదేళ్లలో అత్యల్ప స్థాయికి చేరుకుంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో ఐఐటీ సూచీ -4.3శాతంగా నమోదైంది. ఏడాది క్రితం సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి 4.6శాతంగా నమోదైంది. 2011-12 సిరీస్‌లో సెప్టెంబర్‌ వృద్ధి అత్యల్పం కావడం గమనార్హం. గణాంకాలు నిరుత్సాహపరిచిన నేపథ్యంలో డిసెంబర్‌లో జరిగే ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమావేశంలో మానిటరీ

టాప్‌ 12 టెక్నికల్‌ సిఫార్సులు

Tuesday 12th November 2019

వివిధ బ్రోకరేజిల సాంకేతిక నిపుణులు సమీప కాలానికి గాను టాప్‌ స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. అవి.. (ముస్తాఫా నదీమ్‌, సీఈఓ, ఎపిక్‌ రిసెర్చ్‌) యస్‌ బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 82; స్టాప్‌ లాస్‌: రూ. 59 కనిష్ఠ స్థాయిల నుంచి ర్యాలీ చేశాక, ప్రస్తుతం ఈ స్టాక్‌ కన్సాలిడేషన్‌ దశలో ఉంది. ఈ షేరు ధర అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో 50 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే పైన ముగిసింది. ఇది ఈ

Most from this category