STOCKS

News


నిఫ్టీ, సెన్సెక్స్‌ టార్గెట్‌లను తగ్గించిన బ్రోకరేజిలు

Friday 23rd August 2019
Markets_main1566546597.png-27973

సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాలు నిరాశపరచడంతో పాటు, ఆర్థిక మందగమనం వలన ఇన్వెస్టర్లకు ఇండియాపై దృక్పథం మారుతుండడంతో నిఫ్టీ, సెన్సెక్స్‌ టార్గెట్‌ అంచనాలను ప్రముఖ బ్రోకరేజి సంస్థలు తగ్గించాయి. నిఫ్టీ లాభాలు, అంచనాలను అందుకోలేకపోవడంతో నిఫ్టీ మార్చి 2020 టార్గెట్‌ను నోమురా 12,900 నుంచి 11,880కి తగ్గించింది. ‘ప్రస్తుత ఫలితాల సీజన్లో లాభాల వృద్ధి తగ్గుముఖం పట్టింది. ఆర్థిక సంవత్సరం 2019 ప్రారంభం నుంచి ఆర్థిక సంవత్సరం 2020-21లో నిఫ్టీ లాభాలు 15-16 శాతం తగ్గాయి’ అని నోమురా తెలిపింది. ఆర్థిక మందగమనం వలన మరింత కోత ఉండే అవకాశం ఉందని వివరించింది. 
   తాజాగా సిటీ బ్రోకరేజి సెన్సెక్స్ మార్చి 2020 టార్గెట్‌ను 39,600 నుంచి 39,000 కు తగ్గించింది.‘దేశీయ, అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు, కార్పోరేట్‌ లాభాలు నిరాశపరచడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది జులై నుంచి భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. ప్రస్తుతం వీటి వాల్యుషన్‌లు చౌకగా లేవు’ అని ఈ బ్రోకరేజి తెలిపింది. అయితే, రిలేటివ్‌ పరంగా విలువలు మరింత సహేతుకంగా ఉన్నాయని వివరించింది. మరికొన్ని బ్రోకరేజిలు ఆదాయాల సీజన్‌పై బేరిష్‌ దృక్పథాన్నిచ్చి, నిఫ్టీ ఈపీఎస్‌ అంచనాలను తగ్గించాయి. 
   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ కంపెనీల ఆదాయ వృద్ధిని 19 శాతంగా  సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. మందగించిన ఆర్థిక వ్యవస్థ వలన ఈ కంపెనీల జూన్ త్రైమాసిక లాభాలలో సానుకూలత తక్కువగా ఉందని  తెలిపింది. అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం 2020, 21 నిఫ్టీ లాభాల అంచనాలను 5 శాతం మేర తగ్గించింది.    
   ప్రస్తుత ఫలిత సీజన్‌లో ఆదాయాల డౌన్గ్రేడ్ తీవ్రంగా ఉండడంతో, ఆర్థిక సంవత్సరం 2020 ఆదాయా వృద్ధి అంచనాలను 5 శాతంగా నిర్ణయించామని(ఫైనాన్సియల్‌ కంపెనీలను ఎక్స్‌క్లూడ్‌చేసి), ఇది ఆర్థిక సంవత్సరం 2019 ఆదాయా వృద్ధి 14 శాతం కంటే చాలా తక్కువని అంటిక్యూ స్టాక్‌ బ్రోకింగ్‌ తెలిపింది. తగ్గిన కార్పొరేట్ ఆదాయాలు, బలహీనమైన మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యానం, నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్, తగ్గిన వ్యాపారం / వినియోగదారుల విశ్వాసం కారణంగా మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని తెలిపింది. రాబోయే 6-9 నెలల్లో మరో 60 బేసిస్ పాయింట్ల రెపో రేటు తగ్గింపును ఈ బ్రోకరేజి అంచనా వేస్తోంది. ప్రభుత్వం విధానపరంగా జోక్యం చేసుకునే అవకాశం ఉండడంతోపాటు, తక్కువ వడ్డీ రేట్లు, సాధారణ రుతుపవనాల వలన ఖరిఫ్‌లో దిగుబడి పెరగడం, పండుగ డిమాండ్‌ వంటి కారణాల వలన ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని అంటిక్యూ స్టాక్‌ బ్రోకింగ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.
   ట్రస్టులుగా నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)పై ప్రభుత్వం అదనపు సర్‌ఛార్జీలను విధించడంతో,  జూలై 5 తర్వాత నుంచి దేశియ మార్కెట్‌లో సెంటిమెంట్ క్షీణించడం మొదలయ్యింది. దేశియ బెంచ్మార్క్ సూచీ సెన్సెక్స్ జూన్ 4 న నమోదు చేసిన రికార్డు స్థాయి 40,312.07 నుంచి 9.5 శాతం క్షీణించింది. పెరుగుతున్న యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి గ్లోబల్ కారణాల వలన కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింది.You may be interested

రూపాయి పతనంతో ర్యాలీ చేసే షేర్లివే..!

Friday 23rd August 2019

డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో 8నెలల కనిష్టానికి క్షీణించింది. ఈ ఆగస్ట్‌లో ఇప్పటికి 4.6శాతం నష్టపోయింది.  సుమారు ఆరేళ్ల అనంతరం ఒకనెలలో ఇంత శాతం పతనం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చైనా కరెన్సీ యువాన్‌ 11 ఏళ్ల కనిష్టానికి చేరుకోవడంతో వర్థమాన దేశీయ కరెన్సీలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి క్షీణత దేశీయ ఆర్థిక వ్యవస్థకు  శుభపరిణామం కాదు. ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ

మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Friday 23rd August 2019

2.50శాతం ర్యాలీ చేసిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఇటీవల బాగా క్షీణించిన మెటల్‌ షేర్లు శుక్రవారం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. వేదాంత, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా షేర్ల ర్యాలీ ఇండెక్స్‌ లాభపడేందుకు తోడ్పడింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,191.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభమైంది. అంతర్జాతీయ వృద్ధి మందగమనం, ట్రేడ్‌వార్‌తో గతకొంతకాలంగా భారీగా పతనమైన మెటల్‌

Most from this category