News


బడాషేర్లే బెటర్‌ అంటున్న ఎల్‌ఐసీ

Friday 18th October 2019
Markets_main1571388218.png-28982

స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ విక్రయం
లార్జ్‌క్యాప్స్‌పై ఫోకస్‌
దేశంలో అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ క్రమంగా లార్జ్‌క్యాప్స్‌పై ఎక్కువ మక్కువ చూపుతోంది. మార్కెట్‌ పరిస్థితులు అంతగా బాగాలేకపోవడంతో తన పోర్టుఫోలియోలోని చిన్న, మధ్యతరహా షేర్లను అమ్మేస్తోంది. గత త్రైమాసికంలో సిమెంట్‌, నిర్మాణం, రియల్టీ, ఇంజనీరింగ్‌, గ్యాస్‌ సరఫరా, టెక్స్‌టైల్స్‌ సహా వివిధ రంగాలకు చెందిన తనవద్దున్న చిన్న షేర్లను ఎల్‌ఐసీ వదిలించుకుంటోందని గణాంకాలు చూపుతున్నాయి. 

ఎల్‌ఐసీ వాటాలు తగ్గించుకున్న కంపెనీలు...


గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, లక్ష్మీమెషెన్‌వర్క్స్‌, బిన్నీ, అర్వింద్‌ స్మార్ట్‌స్పేసెస్‌, ఎంటీఎన్‌ఎల్‌, సింప్లెక్స్‌ రియల్టీ, క్రాంప్టన్‌గ్రీవ్స్‌, జైడస్‌ వెల్‌నెస్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, ఎంపైర్‌ ఇండస్ట్రీస్‌, తమిళనాడు న్యూస్‌ప్రింట్‌ తదితరాలతో సహా యాక్సిస్‌బ్యాంక్‌, భెల్‌, ఏబీబీ వంటి పెద్ద కంపెనీల్లో సైతం ఎల్‌ఐసీ వాటాలు తగ్గించుకుంది. 
ఎల్‌ఐసీ వాటాలు పెంచుకున్న కంపెనీలు...


ఇదే సమయంలో బ్లూచిప్స్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీవీఎస్‌ మోటర్స్‌తో పాటు ఏసీసీ, వోల్టాస్‌, హావెల్స్, ఎడెల్‌వీజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇంద్రప్రస్థగ్యాస్‌, హిందుస్థాన్‌ జింక్‌, గెయిల్‌ తదితరాల్లో వాటాలు పెంచుకుంది.
 ప్రస్తుతానికి వాటాల వివరాలు ప్రకటించిన కంపెనీల్లో దాదాపు 150 కంపెనీల్లో ఎల్‌ఐసీకి వాటాలున్నాయి. ఇవే కాకుండా పలు ఇతర కంపెనీల్లో సైతం ఎల్‌ఐసీకి వాటాలున్నట్లు తెలుస్తోంది. జూన్‌ చివరకు ఎల్‌ఐసీ పోర్టుఫోలియోలో దాదాపు 310 స్టాకులున్నాయి. 



You may be interested

ఆరామ్‌కో ఆసక్తి.. బీపీసీఎల్‌ ర్యాలీ

Friday 18th October 2019

దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ బీపీసీఎల్‌(భారత పెట్రోలియం)లో 53.29 శాతం ప్రభుత్వ వాటాను విక్రయించేందుకు, కేంద్ర ప్రభుత్వం సిద్ధపడడంతో ఈ కంపెనీ షేరు గత కొన్ని సెషన్‌ల  నుంచి ర్యాలీ చేస్తోంది. దీనితో పాటు బీపీసీఎల్‌ వాటాను విక్రయించేందుకు, వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ కోసం ప్రభుత్వం వివిధ అంతర్జాతీయ ఆయిల్‌, గ్యాస్‌ కంపెనీలకు బిడ్‌లు దాఖలు చేయమని ఆహ్వానం పంపింది. సౌదీ అరేబియాకు చెందిన ప్రఖ్యాత చమురు కంపెనీ సౌదీ ఆరాంకో,

‘‘జీ’’ షేర్లకు క్యూ2 ఫలితాల షాక్‌..!

Friday 18th October 2019

మీడియా రంగంలో సేవలు అందిస్తున్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటడ్‌ షేర్లకు క్యూ2 ఫలితాల ప్రకటన సెగ తగలింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు 9శాతానికి పైగా నష్టపోయాయి. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలను నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం ప్రకటించింది. ఆదాయ వృద్ధి నెమ్మదించడం, బలహీన నిర్వహణ మార్జిన్ల కారణంగా రెండో క్వార్టర్లో కంపెనీ నికర లాభం 7 శాతమే పెరిగి రూ. 413

Most from this category