News


2020లో కూడా పెద్దస్టాకులదే రాజ్యం!

Monday 23rd December 2019
Markets_main1577095704.png-30384

నిపుణుల అంచనా
ఈ ఏడాదిలాగానే కొత్త ఏడాదిలో కూడా పెద్ద స్టాకులదే రాజ్యమని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2019లో జరిగినట్లే కొన్ని లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే సూచీలను ముందుకు నడిపిస్తాయని అంచనా వేస్తున్నారు. ఎకానమీలో మందగమనం కొత్త ఏడాది కూడా కొనసాగవచ్చని, అందువల్ల ఇన్వెస్టర్లు ఎక్కువగా క్వాలిటీ షేర్లను ఎంచుకోవడం జరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి దీపేన్‌షా చెప్పారు. విదేశీ నిధులు సైతం లార్జ్‌క్యాప్స్‌లోకే ప్రవహిస్తాయన్నారు. ఈ ఏడాదిలో వృద్ధి నెమ్మదించినా సూచీలు మాత్రం మొత్తం మీద లాభాలే చూశాయి. దీంతో వరుసగా నాలుగో ఏడాది కూడా మార్కెట్‌ లాభాలనందించినట్లయింది. కానీ ఈ ఏడాది లాభాల్లో 65 శాతం వాటా కేవలం మూడు కంపెనీల షేర్ల ర్యాలీ కారణంగానే ఏర్పడింది. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు దూసుకుపోవడంతో ఇతర షేర్ల మద్దతు లేకున్నా సూచీలు సైతం పరుగులు పెట్టాయి.

సెన్సెక్స్‌ గమనం vs 200 డీఎంఏ స్థాయికి దిగువన ట్రేడవుతున్న స్టాకుల సంఖ్య

ముఖ్యంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీల్లో టాప్‌ క్వాలిటీ షేర్లను ఇష్టపడ్డారు. 2014 తర్వాత ఈ సంవత్సరం అత్యధిక ఎఫ్‌ఐఐలు ఇండియాకు వచ్చాయి. 
ఎర్నింగ్స్‌లో రికవరీ కొత్త ఏడాది స్టాక్స్‌లో ఉత్తేజం నింపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వృద్దిలో పతనం బాటమ్‌అవుట్‌ చెందినట్లు కనిపిస్తోందని గోల్డ్‌మన్‌ సాక్స్‌ ప్రతినిధి టిమోతీ మోయి చెప్పారు. కంపెనీ లాభాల్లో వృద్ధి 12 శాతం నుంచి 16 శాతానికి పెరగవచ్చన్నారు. ఫైనాన్షియల్స్‌, కన్జూమర్‌, ఇండస్ట్రియల్స్‌ రంగాల్లో రికవరీ ఉంటుందని చెప్పారు. అయితే ఒకపక్క ఎర్నింగ్స్‌ పెరుగుతుండగానే సెన్సెక్స్‌ వాల్యూషన్లు కూడా పెరుగుతున్నాయ. ప్రస్తుతం సెన్సెక్స్‌ 19 పీఈ వద్ద ఉంది. సూచీ పదేళ్ల పీఈ సరాసరి 16 కావడం గమనార్హం.

మిడ్‌, లార్జ్‌క్యాప్స్‌ నిష్పత్తి రేఖ గత రీబౌండ్‌ పాయింట్‌ దగ్గరలో ఉంది...

ప్రభుత్వం మరింత సాయం అందిస్తుందన్న నమ్మకాలు, ఎకానమీలో రికవరీపై ఆశలు ఇకమీదట మార్కెట్లో చిన్న, మధ్యతరహాస్టాకుల్లో పాజిటివ్‌ ఉత్సాహం తీసుకువచ్చే అవకాశాలున్నాయని నిపుణుల భావన. వీటి వాల్యూషన్లు కూడా బాటమ్‌ అవుట్‌ అయ్యాయని కోటక్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి జైదీప్‌ హన్సరాజ్‌ చెప్పారు. అయితే ఇందుకు మరింత సమయం పడుతుందన్నారు. మొత్తం మీద కనీసం కొత్త ఏడాది ప్రథమార్ధం వరకైనా పెద్దస్టాకుల హవానే కొనసాగవచ్చని ఎక్కువమంది నిపుణుల అభిప్రాయం. You may be interested

యస్‌బ్యాంక్‌ 3.50శాతం డౌన్‌

Monday 23rd December 2019

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జాబితా నుంచి తొలగించడంతో యస్‌ బ్యాంక్‌ సోమవారం ట్రేడింగ్లో 3.50శాతం నష్టపోయింది. నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.50.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్, యస్‌ బ్యాంక్, వేదాంత షేర్లను ఇండెక్స్‌ నుంచి తొలగించి.. వీటి స్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, నెస్లే ఇండియా షేర్లను బీఎస్‌ఈ చేర్చింది. ఫలితంగా ట్రేడింగ్‌ ఆరంభం నుంచి షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైయ్యాయి.

మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ కొనొచ్చు!

Monday 23rd December 2019

ఎస్‌బీఐ ఎంఎఫ్‌ సీఐవో నవనీత్‌ మునోత్‌ ఇప్పటికే మధ్య, చిన్నతరహా(మిడ్‌, స్మాల్‌) కౌంటర్లలో చాలా వరకూ దిద్దుబాటు(కరెక‌్షన్‌) జరిగింది. దీంతో ఇకపై ఈ విభాగంపై దృష్టి పెట్టవచ్చంటున్నారు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో నవనీత్‌ మునోత్‌. దేశీయంగా అతిపెద్ద ఈక్విటీ ఫండ్‌ నిర్వహిస్తున్న నవనీత్‌.. మార్కెట్‌ ట్రెండ్‌పై అవగాహన కోసం ప్రధానంగా నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తానంటున్నారు. స్థూల ఆర్థిక అంశాలు, కార్పొరేట్ల లాభదాయకత, వేల్యుయేషన్స్‌, లిక్విడిటీ పరిస్థితుల ఆధారంగా మార్కెట్ల

Most from this category