News


ఈ షేర్లపై బడా బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 5th September 2019
Markets_main1567670508.png-28215

నాలుగు లార్జ్‌క్యాప్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా ఉన్నాయి. లాంగ్‌టర్మ్‌కు వీటిని సిఫార్సు చేస్తున్నాయి.
1. ఇన్ఫోసిస్‌: యూబీఎస్‌ సిఫార్సు- కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. మార్జిన్‌ మెరుగుదలతో ప్రదర్శన మెరుగుపడుతుంది. బలహీన డిమాండ్‌ సమయాన ఇన్ఫీ బలమైన రక్షణాత్మక షేరుగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మంచి రెవెన్యూ వృద్ధి అవకాశాలున్నాయి.
2. లుపిన్‌: మోర్గాన్‌స్టాన్లీ సిఫార్సు- ఓవర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 1003. ప్రస్తుత స్థానం నుంచి రీరేటింగ్‌ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. యూఎస్‌లో ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తుల విక్రయాలు ఊపందుకోవడం కీలకం. 
3. కాడిలా: సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు- కొనొచ్చు. టార్గెట్‌ రూ. 285. కొత్త ఉత్పత్తులు, కొత్త ఆలోచనలు ఈ ఏడాది ఫలాలనిస్తాయని అంచనా. ప్రస్తుతం చాలా ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉంది.
4. వోల్టాస్‌: సిటి గ్రూప్‌ సిఫార్సు- కొనొచ్చు. టార్గెట్‌ రూ. 717కు పెంచింది. ఏసీ విక్రయాలు బలంగా ఉన్నాయి. తాజాగా సాధించిన ఈఈఎస్‌ఎల్‌ టెండర్‌ చాలా ప్రయోజనకరం. 



You may be interested

లాభాల్లో ‍ప్రభుత్వరంగ షేర్లు

Thursday 5th September 2019

 ప్రభుత్వరంగ షేర్లైన ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ షేర్లు దాదాపు 7శాతం ర్యాలీ చేశాయి. వాటితో పాటు హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, నాల్కో షేర్లు సైతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షే,ర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌ఈ ఇండెక్స్‌ దాదాపు 4శాతం ర్యాలీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాను కొంతమేర రానున్న రోజుల్లో ఈటీఎఫ్‌ల ద్వారా విక్రయించి, వాటాను 49 శాతం మేర

గరిష్టం నుంచి 1శాతం క్షీణించిన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 5th September 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులను లోనైంది. నేడు 27,086.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ 120 పాయింట్ల పెరిగి 27243.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ గరిష్టస్థాయి(27243.95) నుంచి 285 పాయింట్లు(1శాతం) నష్టపోయి 26,959.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యా్‌హ్నం

Most from this category