News


రాబోయే రోజులు చిన్నస్టాకులవే!

Wednesday 27th November 2019
Markets_main1574849953.png-29902

కోటక్‌ ఏఎంసీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ
వచ్చే రెండేళ్లలో పెద్ద స్టాకులతో పోలిస్తే చిన్న స్టాకులు, డైవర్సిఫైడ్‌ ఫండ్స్‌ ఎక్కువ రాబడినిచ్చే ఛాన్సులున్నాయని కోటక్‌ ఏఎంసీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ అంచనా వేశారు. ఎకానమీ తిరోగమనంలో ఉంటే లార్జ్‌క్యాప్స్‌ గరిష్ఠాల వద్ద ఉన్నాయని చెప్పారు. కానీ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు మాత్రం ఇంకా తమ ఆల్‌టైమ్‌ హైలకు చాలా దిగువనే ఉన్నాయని తెలిపారు. ఎకానమీలో కనిపించే మందగమనమే విస్తృత స్థాయి మార్కెట్లో కనిపిస్తోందని, కానీ కేవలం లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే రివర్సులో కనిపిస్తున్నాయని వివరించారు. చిన్న స్టాకుల వాల్యూషన్లు దిగిరావడంతో పలు అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. మార్కెట్‌ పరిధి క్రమంగా విస్తరిస్తోందన్నారు. మొత్తం మీద మార్కెట్‌ మందకొడిగా ఉందని, కానీ గతంలోలాగా ఇకపై కొన్ని స్టాకుల్లోనే ర్యాలీ పరిమితమయ్యే అవకాశాలు ఉండవని తెలిపారు. తమ పోర్టుఫోలియోలో మార్పులకు ఇది సరైన సమయం కాదన్నారు. రాబోయే రోజుల్లో మార్కెట్లు ఒడిదుడుకులతో పయనిస్తాయని, ఇందుకు లార్జ్‌క్యాప్స్‌ కూడా అతీతం కాదని చెప్పారు. గత రెండేళ్లలో పెద్ద స్టాకులు భారీ రిస్కు లేకుండా పరుగులు తీస్తూ వచ్చాయని, ఇకపై ఈ పరిస్థితి ఉండదని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో రికవరీ బాగుంటుందన్న అంచనాలే మార్కెట్‌ను నడిపిస్తాయని తెలిపారు. టాక్స్‌ కట్‌ కారణంగా వచ్చిన జోష్‌ వల్ల మార్కెట్లో మరీ పెద్ద పతనాలు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 
చిన్న, మధ్యతరహా స్టాకుల వాల్యూషన్లు దిగివచ్చినా, అన్ని చిన్న స్టాకుల పరిస్థితి బాగున్నట్లు చెప్పలేమని హర్ష చెప్పారు. అన్ని నెగిటివ్స్‌ డిస్కౌంటయి, వాల్యూషన్లు బాగా తగ్గి ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లను పరిశీలించాలని సూచించారు. తాము కూడా ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ఇలా నాణ్యమైన వాల్యూ స్టాక్స్‌లో క్రమానుగత పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడమే మంచిదని సూచించారు. ప్రస్తుతం నిఫ్టీ స్టాక్స్‌లో మొత్తం ఎంఎఫ్‌ల పెట్టుబడులు 64 శాతమని చెప్పారు. గతంలో ఈ మొత్తం 65 శాతం దాటినప్పుడు ఫోకస్‌పెద్ద స్టాకుల నుంచి చిన్న స్టాకులవైపు మరలిందని గుర్తు చేశారు. ఈవాటా 67- 68 శాతానికి చేరినప్పుడు చిన్నస్టాకుల్లో ఎంఎఫ్‌ల పెట్టుబడులు గరిష్ఠాలకు చేరాయన్నారు. ఇదే నిజమైతే త్వరలో మరోమారు ఇదే రిపీటయ్యే అవకాశాలున్నాయన్నారు. మరికొద్ది నెలల్లో స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో ర్యాలీ ఆరంభమవుతుందని అంచనా వేశారు. ఆటో రంగంపై ప్రస్తుతానికి పెద్దగా పాజిటివ్‌గా లేమని, మెటల్స్‌లో మాత్రం తమ పెట్టుబడులు కొంత పెంచామని తెలిపారు. ఈ రంగంలో కొత్త పొజిషన్లు తీసుకుంటున్నామని చెప్పారు. 



You may be interested

సూచీల రికార్డు ముగింపు

Wednesday 27th November 2019

41వేల పైన ముగిసిన సెన్సెక్స్‌ 12100 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ రాణించిన బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ షేర్ల ర్యాలీ చివరి గంటలో బ్యాంకింగ్‌, అటో, మెటల్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం సూచీలు రికార్డు ముగింపును నమోదుచేశాయి. సెన్సెక్స్‌ 199 పాయింట్ల లాభపడి 41000 పైన 41,020.61 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 63 పాయింట్లు పెరిగి 12,100 వద్ద ముగిసింది. ఇంతటి స్థాయిలో  సూచీలు ముగియడం ఇదే ప్రధమం.  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ షేర్ల

టాటా స్టీల్‌పై విశ్లేషకులు బుల్లిష్‌

Wednesday 27th November 2019

యూరప్‌లో వున్న అనుబంధ కంపెనీలను పునరుద్ధరించడంతో పాటు, కంపెనీ ఉత్పత్తిని మెరుగుపరచడం, చౌక స్టీల్‌ దిగుమతులను ఇండియా నిషేదించడం వంటి అంశాల వలన టాటా స్టీల్‌ షేరు భవిష్యత్తులో మరింత పెరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా స్టీల్‌ గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌ రేషియో) రేషియో 4.7 వద్ద ట్రేడవుతోంది. ఇది ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ

Most from this category