News


లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ ఇప్పుడే మొదలైంది..!

Friday 4th October 2019
Markets_main1570129851.png-28701

బీఎస్‌ఈ 100లోని స్టాక్స్‌లో నాలుగింట మూడొంతులు సెప్టెంబర్‌లో పెరిగాయి. వరుసగా మూడు నెలల నష్టాలకు గత నెలలో తెరపడింది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు దలాస్‌ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందనడంలో సందేహం లేదు. ఎక్కువగా షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. బీఎస్‌ఈ100లోని 22 స్టాక్స్‌ డబుల్‌ డిజిట్‌ స్థాయిలో పెరిగాయి. బీపీసీఎల్‌, సీమెన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండియన్‌ ఆయిల్‌, టీవీఎస్‌ మోటార్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌ అధికంగా పెరిగిన వాటిల్లో ఉన్నాయి. కానీ, ఇది ఆరంభం మాత్రమేనంటున్నారు కొందరు విశ్లేషకులు.

 

‘‘సెప్టెంబర్‌లో మార్కెట్లు ఇంత భారీగా పెరగడానికి కారణం అప్పటి వరకు అధిక అమ్మకాలు చోటు చేసుకోవడం వల్లే. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం వెలువడిన తర్వాత మార్కెట్‌ పెరగడం ఆరంభమైంది. లార్జ్‌క్యాప్‌ మంచి పనితీరు చూపాయి. స్మాల్‌క్యాప్‌ కంపెనీలతో పోలిస్తే లార్జ్‌క్యాప్‌ కంపెనీ మార్కెట్‌ విలువే ఎక్కువగా పెరిగింది. ఎఫ్‌అండ్‌వో ఆప్షన్లే ప్రధాన కారణం. అంతకుముందు ఎఫ్‌ఐఐల నుంచి ఎక్కువగా షార్ట్స్‌ ఉన్నాయి’’ అని ఎడెల్‌వీజ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సాహిల్‌కపూర్‌ పేర్కొన్నారు. మార్కెట్‌ విలువ పరంగా భారీగా పెరిగిన స్టాక్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. సెప్టెంబర్‌లో రూ.71,000 కోట్ల మేర మార్కెట్‌ విలువను పెంచుకుంది. ఆ తర్వాత బజాజ్‌ ఫైనాన్స్‌, కోటక్‌ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.40,000 కోట్ల మేర మార్కెట్‌ విలువ పెంచుకున్నాయి. అదే సమయంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 44 శాతం, యస్‌ బ్యాంకు 30 శాతం చొప్పున నష్టపోయాయి. రెండంకెల స్థాయిలో నష్టాలను చవిచూసిన వాటిల్లో ఆర్‌ఈసీ, గ్లెన్‌మార్క్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఉన్నాయి. 

 

‘‘బుల్‌ర్యాలీ లార్జ్‌క్యాప్‌లో మొదలైంది. బీఎస్‌ఈ100 సూచీ సెప్టెంబర్‌లో పెరగడం అన్నది కార్పొరేట్‌ పన్ను తగ్గింపునకు స్పందనే. ఇది ఈక్విటీలు, ఆర్థికరంగ స్వరూపాన్ని మార్చేస్తుంది’’ అని కార్నెలియన్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు వికాస్‌ ఖేమాని పేర్కొన్నారు. మార్కెట్‌ర్యాలీ అన్నది కేవలం రానున్న నెలల కోసమే ఆరంభం కాలేదని, వచ్చే సంవత్సరాల కోసం మొదలైందని తాను భావిస్తున్నట్టు ఖేమాని చెప్పారు. ఫైనాన్షియల్‌, కన్జంప్షన్‌ స్టాక్స్‌ పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. అయితే, కొందరు నిపుణులు మాత్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో కంపెనీల నిర్వహణ పనితీరులో మార్పేమీ రాదని, ఆర్థిక రంగంలో రికవరీ ఇంకా ఆరంభం కాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆటో విక్రయాలు ముందుగా గాడిన పడాల్సిన అవసరం ఉందంటున్నారు.



You may be interested

సరైన ధర వద్దే నిధుల సమీకరణ: యస్‌బ్యాంకు

Friday 4th October 2019

నిధుల సమీకరణ యస్‌ బ్యాంకు ముందున్న ప్రథమ ప్రాధాన్యంగా బ్యాంకు ఎండీ, సీఈవో రవనీత్‌ గిల్‌ తెలిపారు. ఏదో ఒక ధర వద్ద కాకుండా, బ్యాంకుకు ప్రయోజనదాయకమైన ధర వద్దే నిధులను సమీకరిస్తామని చెప్పారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    నిధుల సమీకరణ ప్రణాళికల గురించి... నిధులను సమీకరించే సామర్థ్యం యస్‌ బ్యాంకుకు 100 శాతం ఉంది. అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌, కొన్ని దేశీయ కుటుంబ

నాలుగో రోజూ నష్టాలే..!

Thursday 3rd October 2019

మెటల్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఐటీ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌కు నాలుగో రోజూ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్‌ 198 పాయింట్ల పతనమై 38,107 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు నష్టపోయి 11,313 వద్ద స్థిరపడింది. ఆర్థిక మందగమన భయాలతో ప్రపంచ మార్కెట్లల్లో నెలకొన్న అస్థిరత, నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత, ఇటీవల అమెరికా, యూరప్‌లలో విడుదలైన బలహీన ఆర్థిక

Most from this category