News


మార్కెట్లో మూడొంతుల కరెక్షన్‌ ముగిసినట్టే..!

Saturday 3rd August 2019
Markets_main1564770998.png-27507

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పతనం కొనసాగుతుండగా... రూ.55,000 కోట్ల ఆస్తుల నిర్వహణ చూసే ప్రముఖ మనీ మేనేజర్‌ మాత్రం ప్రస్తుత మార్కెట్‌ కరెక్షన్‌లో అధిక భాగం ముగిసినట్టేనని అంచనా వేస్తున్నారు. ‘‘కంపెనీల ‍త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం మార్కెట్‌ దిద్దుబాటుకు ప్రధాన కారణం. ఆర్థిక సేవల రంగంలో ఒత్తిళ్లు, ఆర్థిక రంగంలో డిమాండ్‌ మందగించడం, ముఖ్యంగా ఆటో రంగంలో’’అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఐవో సంపత్‌రెడ్డి తెలిపారు. బెంచ్‌ మార్క్‌ సూచీలు ఇప్పటికే గరిష్టాల నుంచి గణనీయంగా కిందకు దిగొచ్చాయని, కరెక్షన్‌లో అధిక భాగం ముగిసినట్టేనన్నారు. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో సంక్షోభం ప్రస్తుత పరిస్థితులకు ఒకానొక కారణంగా పేర్కొన్నారు. 

 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ ఏడాది జూన్‌లో నమోదు చేసిన గరిష్టాల నుంచి 8 శాతం పడిపోయింది. జూలై 5న బడ్జెట్‌ నాటి నుంచి బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.13.70 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బడ్జెట్‌లో ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ భారం మోపడం, నిఫ్టీ ఎర్నింగ్స్‌ 2.6 శాతం డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించాయి. ఈ ఏడాది ఇప్పటికే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 11 శాతం, స్మాల్‌క్యాప్‌ 12 శాతం వరకు నష్టపోయాయి. బడ్జెట్‌లో అధిక ఆదాయ వర్గాలపై ఆదాయపన్ను సర్‌చార్జీ మోపడం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)పై ప్రభావం చూపించిందని, ప్రస్తుత మార్కెట్‌ అమ్మకాలకు ఇది కూడా తోడైనట్టు సంపత్‌రెడ్డి తెలిపారు. 

 

ఎఫ్‌పీఐలు జూలైలో 1.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర) గత నెలలో రూ.16,835 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. అయితే, కంపెనీల ఫలితాల్లో రికవరీ అన్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం (డిసెంబర్‌ త్రైమాసికం నుంచి)లో ఉంటుందన్న ఆశాభావాన్ని సంపత్‌ వ్యక్తం చేశారు. ‘‘మొదటి అర్ధ భాగంలో వృద్ధి మోస్తరుగా ఉంటుంది. కంపెనీల ఆదాయాల రివకరీ తప్పకుండా జరుగుతుంది. ఎఫ్‌వై 20లోనే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో ఇది ఉండొచ్చు’’ అని చెప్పారు. ఎర్నింగ్స్‌లో 15-20 శాతాన్ని మార్కెట్లు ఆశిస్తున్నాయని, నిఫ్టీ ఎర్నింగ్స్‌ అంచనాలు ఇప్పటికే ప్రస్తుత సీజన్‌కు 2.6 శాతం తగ్గించడం జరిగిందన్నారు. ‘‘క్యూ1, క్యూ2లో పెద్ద వృద్ధిని చూడకపోవచ్చు. ఇది 4-5 శాతం మధ్య ఉంటుంది. క్యూ2లో ది 5-10 శాతంగాను ఉండొచ్చు. అయితే రెండో అర్ధ సంవత్సరంలో 15 శాతం వృద్ధి నమోదవుతుంది’’ అని వివరించారు. ప్రైవేటు పెట్టుబడుల వినియోగం అన్నది రానున్న కాలంలో ఎర్నింగ్స్‌ చోదకంగా ఉంటుందని పేర్కొన్నారు.  



You may be interested

ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి ఇప్పుడు...?

Saturday 3rd August 2019

నిఫ్టీ 11,981 నుంచి ఏకధాటిగా పడిపోతూ 11,000 పాయింట్లకు దిగవకు చేరిపోయింది. కేవలం 19 సెషన్లలోనే ఇది జరిగింది. దీంతో చాలా స్టాక్స్‌ విలువలు ఆకర్షణీయంగా మారాయి. దేశీయ అంశాల పాత్రే ఎక్కువగా ఉంటే, అంతర్జాతీయ అంశాలు కూడా మన మార్కెట్ల నష్టాలకు తోడయ్యాయి. అమెరికా ఫెడ్‌ వ్యాఖ్యలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తితో ఉన్న

భారీగా పడిపోయిన ఇండియాబుల్స్‌

Friday 2nd August 2019

రూ.లక్ష​కోట్ల మోసానికి పాల్పడిందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 8.61 శాతం నష్టపోయి రూ. 477.00 వద్ద ముగిసింది. ఇండియాబుల్స్‌ రూ.1 లక్ష కోట్ల మోసం చేసినట్లు ఆరోపిస్తూ బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామి పిఎం మోడీకి లేఖ పంపిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. నేషనల్‌ హౌసింగ్‌ బోర్డు నుంచి రూ. లక్ష కోట్లను మోసం  చేసిందనే సుబ్రమణ్యం

Most from this category