News


మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎంచుకున్న స్టాక్స్‌

Friday 17th May 2019
Markets_main1558116145.png-25804

ఏప్రిల్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అదే నెలలో విదేశీ నిధులు రావడంతో మార్కెట్లు పై స్థాయిల్లో కొనసాగేందుకు సాయపడింది. అయితే, మే నెలకు వచ్చే సరికి విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రయందారులుగా మారిపోయారు. దీంతో ఈ సమయంలో మన మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇనిస్టిట్యూషన్స్‌ ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి. గత నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు తగ్గినప్పటికీ... ఈఎల్‌ఎస్‌ఎస్‌ సహా ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.5,800 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసిన స్టాక్స్‌ను పరిశీలిస్తే... 

 

ఏప్రిల్‌ నెలలో ఫండ్‌ మేనేజర్లు కొనుగోలు చేసిన లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో... వొడాఫోన్‌ ఐడియా, డీఎల్‌ఎఫ్‌, బీహెచ్‌ఈఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, సెయిల్‌, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, అంబుజా సిమెంట్స్‌, సిప్లా, అశోక్‌లేలాండ్‌ ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఫండ్స్‌ మేనేజర్లు కొనుగోలు చేసినవి... డిష్‌టీవీ ఇండియా, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, ఆల్కెమ్‌ ల్యాబ్‌, గుజరాత్‌ గ్యాస్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జ్యూమర్‌, ఎస్కార్ట్స్‌, ఏసీసీ, థర్మాక్స్‌, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నాయి. స్మాల్‌ క్యాప్‌ విభాగంలో... వెల్‌స్పన్‌కార్ప్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌, సన్‌టెక్‌ రియాలిటీ, ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌, భారత్‌ డైనమిక్స్‌, నిట్‌ లిమిటెడ్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, షాపర్స్‌ స్టాప్‌, గెలాక్సీ సర్ఫాక్టెంట్స్‌, గ్యాబ్రియల్‌ ఇండియా ఉన్నాయి. 

 

ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు ఎక్కువగా విక్రయించిన స్టాక్స్‌ వివరాలు కూడా పరిశీలించాల్సిందే. లార్జ్‌క్యాప్‌ విభాగంలో కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, అదానీ పోర్ట్స్‌, విప్రో, యస్‌ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, ఐవోసీఎల్‌, మారుతి సుజుకీ, శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఎక్కువగా విక్రయించిన టాప్‌-10 స్టాక్స్‌... స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, ఆయిల్‌ ఇండియా, అవంతి ఫీడ్స్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, ఎన్‌బీసీసీ ఇండియా, బ్యాంకు ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌, క్యాస్ట్రాల్‌ ఇండియా, ఆర్‌ఈసీ లిమిటెడ్‌ ఉన్నాయి. స్మాల్‌క్యాప్‌ విభాగంలో... పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌, మ్యాక్స్‌ ఇండియా, కెన్‌ఫిన్‌ హోమ్‌, పీవీఆర్‌, బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌, ఆస్ట్రాజెనెకా ఫార్మా, వోకార్డ్‌, మనప్పురం ఫైనాన్స్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, కేర్‌ రేటింగ్స్‌ ఉన్నాయి. ఈ డేటా కేవలం ఇన్వెస్టర్ల అవగాహన కోసం మాత్రమే.You may be interested

పడి లేచే కెరటాలేనా... ఇవి?

Friday 17th May 2019

టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంకు, దిలీప్‌ బిల్డ్‌కాన్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ ఇలా కొన్ని స్టాక్స్‌ ఇటీవలి కాలంలో బాగా నష్టాలను చవిచూశాయి. అమ్మకాల ఒత్తిడికి ఇవి పడిపోయాయి. ఈ స్టాక్స్‌లో ర్యాలీ ఆగిపోవడమే కాదు... సమీప కాలంలో ఇవి రికవరీ అవుతాయా? అన్న సందేహాలు కూడా ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ఇలా పడిపోయిన వాటిల్లో కొన్ని ఇప్పటికీ వ్యాల్యూ బై కాదని బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి. యస్‌ బ్యాంకు షేరు అయితే

సెన్సెక్స్‌ లాభం 537 పాయింట్లు

Friday 17th May 2019

11400లపై ముగిసిన నిఫ్టీ  మార్కెట్‌ వారంతపు రోజైన శుక్రవారం భారీ లాభంతో ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, అటో, బ్యాంకింగ్‌, మీడియా, రియల్టీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సూచీలు భారీగా లాభాల్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ 537 పాయింట్ల లాభంతో 37,930 వద్ద, నిఫ్టీ 150 పాయింట్ల పెరిగి11,407ల వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా రెండో లాభాల ముగింపు. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంకు నిఫ్టీ

Most from this category