STOCKS

News


లార్జ్‌ క్యాప్స్‌లో ఇవి చాలా చౌక!

Wednesday 9th October 2019
Markets_main1570643578.png-28790

లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో వోలటాలిటీ అన్నది మిగిలిన ‍స్టాక్స్‌తో పోలిస్తే కొంత తక్కువ. రిస్క్‌ కొంచెం తక్కువ ఉండాలనుకునే వారు, మార్కెట్‌ ర్యాలీలో ముందు లాభాలు గడించాలనుకునే వారికి లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ అనుకూలం. ప్రస్తుత కరెక్షన్‌ నేపథ్యంలో ఈ లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఆకర్షణీయమైన స్టాక్స్‌ ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా తర్వాతి బుల్‌ ర్యాలీలో లాభాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. గత ఐదు సంవత్సరాల సగటు పీఈతో పోల్చి చూసినప్పుడు ప్రస్తుత వ్యాల్యూషన్‌ ఆధారంగా  ఓ స్టాక్‌ చౌకగా ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవచ్చు. లార్జ్‌క్యాప్‌ విభాగంలో ఫండమెంటల్స్‌ పరంగా బలమైన కంపెనీలు, ఐదేళ్ల సగటు పీఈ కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతున్న స్టాక్స్‌ వివరాలను వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సూచించింది. 

 

అరబిందో ఫార్మా
అమెరికా మార్కెట్లో మన దేశానికి చెందిన రెండో అతిపెద్ద జనరిక్‌ ఫార్మా కంపెనీ ఇది. అమ్మకాల పరంగా ప్రపంచంలో పదో అతిపెద్ద జనరిక్‌ కంపెనీ. మధుమేహం, ఎయిడ్స్‌, నెర్వస్‌ సిస్టమ్‌, చర్మ సంబంధిత సమస్యలకు కాంప్లెక్స్‌ ఇంజెక్టిబుల్స్‌, ఔషధాల ఉత్పత్తిలో ఉంది. ఏపీఐలకు సంబంధించి 11 యూనిట్లను నిర్వహిస్తోంది. అలాగే, ఫార్ములేషన్లకు సంబంధించి 15 యూనిట్లు కూడా ఉన్నాయి. అరబిందో ఫార్మా కంపెనీకి సగం మేర ఆదాయం అమెరికా మార్కెట్‌ నుంచే వస్తోంది. 26 శాతం యూరోప్‌ నుంచి ఉంది. అరబిందో ఫార్మా యూనిట్‌ విషయంలో యూఎస్‌ఎఫ్‌డీఏ లేవనెత్తిన తీవ్ర అభ‍్యంతరాలను ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. అయితే, దీర్ఘకాలంలో ఈ అవరోధాలను కంపెనీ చక్కదిద్దుకునే అవకాశాలు ఉన్నాయి. 2019లో కంపెనీ మూడు యూనిట్లకు సంబంధించి కూడా యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అలాగే, అమెరికాలో ధరల విషయంలో ఫార్మా కంపెనీలు కుమ్మక్కు అయ్యాయన్న కేసులో ఆరోపణలు సైతం ఎదుర్కొంటోంది. కంపెనీ గత ఐదేళ్లో అమ్మకాలు వార్షికంగా 19 శాతం చొప్పున పెరిగాయి. లాభాలు 15 శాతం చొప్పున పెరిగాయి. 2019 మార్చి నాటికి రుణ భారం ఈక్విటీలో సగం మేరే ఉంది. ప్రస్తుతం 13.82 పీఈ వద్ద ట్రేడవుతోంది. ఐదేళ్ల సగటు పీఈ 19తో పోలిస్తే తక్కువే. 

 

ఐచర్‌ మోటార్స్‌
ఈ సంస్థకు రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ పెద్ద అస్సెట్‌. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్‌ మాదిరి. 250సీసీ, అంతకంటే ఎక్కువ సామర్థ్యం బైకుల అమ్మకాల్లో దేశీయంగా దిగ్గజ కంపెనీ. 2019లో ఇప్పటికి 8 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించింది. 50కు పైగా దేశాల మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్వీడన్‌కు చెందని ఏబీ వోల్వోతో కంపెనీ జాయింట్‌ వెంచర్‌ కింద దేశీయంగా వాణిజ్య వాహనాలను కూడా విక్రయిస్తోంది. ఆటోమొబైల్‌ రంగంలో మందగమనంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పనితీరు ఆశించిన మేర లేదు. ముఖ్యంగా అతిపెద్ద మార్కెట్‌ అయిన కేరళలో వచ్చిన వరదలు సైతం కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించింది. అలాగే, చెన్నై ప్లాంట్‌లో కార్మికుల సమ్మె ప్రభావం కూడా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో కొత్త బైకుల ఆవిష్కరణతోపాటు థాయిలాండ్‌లో నూతన తయారీ కేంద్రం ఏర్పాటు, దక్షిణ కొరియా వంటి నూతన మార్కెట్లోకి ప్రవేశించడం కలిసొచ్చే అంశాలు. ఆదాయం, లాభాలు వార్షికంగా 17, 18 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఐదేళ్ల సగటు పీఈ 46తో పోలిస్తే ఐచర్‌ మోటార్స్‌ ప్రస్తుతం 21 పీఈ వద్ద అందుబాటులో ఉంది. 

 

గోద్రేజ్‌ కన్జ్యూమర్‌
గృహ కీటక నాశన ఉత్పత్తుల్లో దేశీయంగా నంబర్‌ 1 కంపెనీ గోద్రేజ్‌ కన్జ్యూమర్‌. అలాగే, సోప్స్‌లో హెచ్‌యూఎల్‌ తర్వాత రెండో స్థానంలో ఉంది. సింథాల్‌, గుడ్‌నైట్‌, హిట్‌, ఎజీ ఇవన్నీ కంపెనీ బ్రాండ్లే. అంతర్జాతీయంగానూ బలమైన స్థానంలో ఉంది. హెయిర్‌కేర్‌, ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌, వెట్‌ టిష్యూల్లోనూ నంబర్‌ 1 స్థానంలో ఉంది. కంపెనీ ఆదాయంలో 47 శాతం అంతర్జాతీయ కార్యకలాపాల నుంచే వస్తోంది. దేశీయంగా గృహ కీటకనాశన ఉత్పత్తుల విక్రయాల్లో మందగమనం, ఆఫ్రికా, ఇండోనేషియా మార్కెట్లలోనూ అమ్మకాలు తగ్గడం వల్ల ఈ స్టాక్‌ గత ఏడాది కాలంలో 33 శాతం పడిపోయింది. పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకుంటాయని అంచనా. గృహ, వ్యక్తిగత, శిరోజ ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి సారించడం ద్వారా అమ్మకాలు పెంచుకునే వ్యూహంతో కంపెనీ ఉంది. దిద్దుబాటు కారణంగా ఈ స్టాక్‌ 28పీఈ వద్ద అందుబాటులో ఉంది. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీల పీఈతో పోలిస్తే ఇది 40 శాతం వరకు చౌక.You may be interested

పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర

Thursday 10th October 2019

- పావు శాతం తగ్గించిన ఎస్‌బీఐ - ఇకపై 3.25 శాతమే - రూ. 1 లక్ష లోపు బ్యాలెన్స్‌కు వర్తింపు - నవంబర్ 1 నుంచి అమల్లోకి - రుణాలపైనా వడ్డీ రేటు స్వల్పంగా తగ్గింపు ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పొదుపు ఖాతా డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ రేట్లకు మరింత కత్తెర వేసింది. రూ. 1 లక్ష లోపు సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును

క్యూ2 ఫలితాలపై బ్రోకరేజీల అంచనాలు

Wednesday 9th October 2019

ఈ నెల 10 నుంచి ముఖ్యమైన కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసిక కాలానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ముందస్తు పన్ను చెల్లింపులు చేశాయి కూడా. దీంతో గత నెలలో కార్పొరేట్‌ పన్ను తగ్గింపు నిర్ణయం తాలూకూ ఫలితాలు సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల్లో ప్రతిఫలించకపోవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ సంస్థ పేర్కొంది.    బలహీనంగా ఉంటాయి..: మోతీలాల్‌ క్యూ2లో కంపెనీల ఫలితాలు బలహీనంగా ఉంటాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. నిర్వహణ వాతావరణం

Most from this category